Posted by Sakshyam Magazine on Monday, April 6, 2015


ముహమ్మద్(స)గూర్చి ఏవిధమైన అవగాహన లేకుండానే కొంతమంది క్రైస్తవ బోధకులు
అతి దారుణంగా విమర్శిస్తున్నారు. ఇంకా కొన్ని హదీసులను, ఖురాన్ వాక్యాలను వక్రీకరిస్తూ దాడులను చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో అసలు ముహమ్మద్(స) అంటే ఎవరో తెలియజేస్తూ, ఆయనపై వచ్చిన విమర్శలను చక్కని జవాబులతో తిప్పికొడుతూ వాళ్లు చదివే బైబిలే వారి పట్ల ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందో తెలియజేసే అద్భుతమైన పుస్తకం. దీనిని సాక్ష్యం పబ్లికేషన్స్ తరపున ప్రింట్ చేయాలని సంకల్పించాము. అయితే ముద్రణకు ఖర్చు ఎక్కువవుతుంది కాబట్టి, ఇది అందరి వద్దకు చేరాల్సిన పుస్తకం కాబట్టి ఇన్షా అల్లాహ్ ఈ ముద్రణకు మీ వంతు సహకారం చేయాల్సిందిగా కోరుచున్నాము. మీరు ముద్రణకు ఎంతైతే సహకరించారో దాని తగ్గ పుస్తకాలన్నీ కూడా మీకు అందించే ఎర్పాటు చేసేస్తాము. ఒకరకంగా చెప్పాలంటే మీరు సహకరించిన డబ్బుకు తగ్గ పుస్తకాలన్నీ మీ దగ్గరే ఉంటాయి.వాటిని మీరు మీ చుట్టుప్రక్కల క్రైస్తవ సోదరులకు అందించి ముహమ్మద్(స) వారి యొక్క ఔన్నత్యాన్ని అందించవచ్చు. దయచేసి మా ప్రయత్నాన్ని అర్ధం చేసుకుని సహకరిస్తారని, అల్లాహ్ అనుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తున్నాము. వివరాలకు సంప్రదించండి : 9866865253.