Posted by Sakshyam Magazine on Sunday, December 27, 2015
సర్వశక్తిగల దేవుని పేరుతో...
యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. -సామెతలు 21:30

గౌరవ నీయులైన పాఠక మిత్రులారా!
మనిషిలో ప్రక్కృతి సిద్ధంగానే ‘మంచి’-‘చెడు’ గుణాలు మిశ్రమంగా ఉంటాయి. తన మనో ప్రపంచంలో విజృంభిస్తూ ఉన్న ‘చెడు’ గుణాలను ఎంతవరకు ‘నియంత్రిస్తాడు’ మరియు అదే మనో ప్రపంచంలో పెల్లుబుకుతూ ఉన్న ‘మంచి’ని ఎంతవరకు ‘వికాస పరుస్తాడు’ అన్నదే మనిషి జీవితానికి సర్వసృష్టికర్త పెట్టిన పరీక్ష!
అయితే ఈ రహస్యాన్ని గుర్తించని వారు, సామాన్య ప్రజల నుండి ‘
అపార గౌరవ మరియాదల’ను మరియు ‘
అపార సంపద’ను ‘
అడ్డమైన మార్గాం’లో సంపాదించాలనే ‘
చెడు భావన’ నెత్తికెక్కిన వారు పవిత్ర ధార్మిక వ్యవస్థలో ప్రవేసించి, కొన్ని ‘
తప్పుడు విశ్వాసాల’ను మరియు ‘
తప్పుడు ఆచారాల’ను కల్పించి, వాటిని పవిత్ర ధర్మగ్రంధాల ప్రబోధనలుగా బొంకుతూ మార్కెటింగ్ చేస్తారు. సామాన్య భక్తజనం మనస్తత్వం ధర్మ గ్రంధారాల ఆధారంగా చెబితేనే తప్ప ఏవిషయాన్నీ వినరు.
గమనిక: అందుకే తమ కాల్పనిక ’తప్పుడు విశ్వాసాల’ను మరియు ‘తప్పుడు ఆచారాల’ను ధర్మగ్రంధాలలో ఉన్నట్లు ప్రజలను భ్రమింపజేయటానికి ఈ వంచక పండితులు ధర్మశాస్త్రాలలోని వాక్యాలను సాగాదీస్తూ, వంగదీస్తూ ఉంటారు! కాని వాటిని ‘వాంగ్మూలం’ (Statement) రూపంలో చూపించలేరన్నది ఈ మొత్తం చర్చలో అత్యంత గమనార్హ విషయం!
ఉదాహరణకు: నర హత్య, వ్యభిచారం, దొంగతనం వంటి నేరాలకు జంతుబలుల ద్వారా పాపపరిహారం పొందినట్లు కనీసం ఒక్కగాని ఒక్క ఆధారాన్ని పూర్తి పాత నిబంధన చరిత్రలో ఎక్కడా చూపించ లేరు! ‘రక్తం ద్వారా మాత్రమే పాప పరిహారం అవుతుంది’, ‘రక్తం ద్వారా మాత్రమే నిత్యజీవం లభిస్తుంది’ వగైరా... విషయాలను ‘వాంగ్మూలం’ (Statement) రూపంలో చూపటం ఏ బోధకునికీ సాద్యం కాదు, కాబోదు!
యేసు సిలువ మరణం తప్పని సరి కావాలంటే- దానికంటే ముందు, ‘పాపపరిహారానికి ఒక్క రక్తం మాత్రమే తప్పనిసరి’ అని పరిశుద్ధ బైబిలు గ్రంధం ప్రకటించటం షరతు! పాపపరిహారానికి ఒక్క రక్తం మాత్రమే కాక, వేరే ప్రత్యమ్నాయాలు కూడా ఉన్నాయని ఒకవేళ పరిశుద్ధ బైబిలు గ్రంధం చూపించి ఉంటే, యూదుల రక్తదాహం క్రమంలో అనేక మంది ప్రవక్తల సిలువ దండనలలో భాగంగానే యేసుకు కూడా సిలువ దండన వేయబడిందని తేలుతుంది. అప్పుడది ఒక ‘సాధారణ హత్యాయత్న’మే తప్ప ‘పవిత్ర సిలువ బలియాగము’ కాజాలదు కదా!పాపపరిహారానికి బైబిలు చూపే అనేక ప్రత్యామ్నాయాలను ఈ క్రింది వాక్యాధారంగా గనించగలరు!
1. చెడు మాని, మంచి చేయటం వలన పాపాలకు పరిహారం లభిస్తుంది!
నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను
వెదకి తమ చెడు మార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి
ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును. -2 వ దినవృత్తాంతాలు 7:14
2. పాపములను క్షమించమంటే పాపాలకు పరిహారం లభిస్తుంది!
ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని యిదివరకు నీవు ఈ ప్రజలదోషమును
పరిహరించి యున్నట్లు నీ కృపాతిశయమునుబట్టి ఈ ప్రజల దోషమును దయచేసి
క్షమించుమని యెహోవాతో చెప్పగా యెహోవానీ మాటచొప్పున నేను క్షమించియున్నాను. -సంఖ్యాకాండము 14:19,20
3. పాపములను, దోషములను ఒప్పుకుంటే పాపాలకు పరిహారం లభిస్తుంది!
నా దోషమును కప్పుకొనక నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని యెహోవా
సన్నిధిని నా అతిక్రమములు ఒప్పు కొందు ననుకొంటిని. నీవు నా పాపదోషమును
పరిహరించియున్నావు. -కీర్తన 32: 5
పైవాక్యాలలో పాపాల పరిహారానికి- 1. చెడు మాని, మంచి చేయటం 2. పాపములను క్షమించమని యెహోవాను కోరటం 3. పాప ములను, దోషములను యెహోవా యెదుట ఒప్పుకోవటం అనే మూడు ప్రత్యామ్నాయాలను పరిశుద్ధ బైబిలు గ్రంధం ప్రతిపాదిస్తుంది! పాత నిబంధన కాలంలో- కేవలం ఒక్క రక్తం ద్వారా తప్ప పాప పరిహారానికి మరొక ప్రత్యామ్నాయం లేనే లేదని అధిక శాతం క్రైస్తవ పండితులు చేస్తున్న వాదన అసత్య వాదన అని పరిశుద్ధ బైబిలు గ్రంధ వాక్యాల ద్వారా తేలిపోతుంది.
గమనిక: వాక్యాధారంతో తప్ప వ్యర్ధమైన విషయాలతోగాని, వాక్యాల వక్రీకరణతోగాని కాక, బైబిలు గ్రంధ వాక్యాల ‘వాంగ్మూలం’ (Statement) రూపంలో తమ సిద్ధాంతానికి అధారాలు చూపించాలని క్రైస్తవ మిత్రులకు మనవి
M.A.Abhilash
9666488877
tmcnewstmc@gmail.com
వీడియో ప్రసంగాల కొరకు Sakshyam TV చూడండి.