• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » ARTICLES » 'నేను గెలుస్తానా?' - మీ సందేహానికి 8 చాణక్య సమాధానాలు!

'నేను గెలుస్తానా?' - మీ సందేహానికి 8 చాణక్య సమాధానాలు!

Posted by Sakshyam Magazine on Wednesday, April 25, 2018
Label: ARTICLES

విజయం వరిస్తుందంటే నువ్వు మారతావా? సమాధానం చెప్పడానికి కొంచెం ఆలోచిస్తావు 'ముందు నాకు విజయాన్ని చూపించండి. తర్వాత మారతాను' చాలా మంది ఇలాగే ఆలోచిస్తారు. విజయాన్ని పువ్వుల్లో పెట్టి ఇస్తామని ఎవ్వరూ హామీ ఇవ్వలేరు. ఎందుకంటే నీ విజయనికి కర్త, కర్మ. క్రియ నువ్వే. వ్యక్తిగతంగా మారితేనే విజయలక్ష్మి దర్శనమిస్తుంది.

మరి విజయాన్ని ఆకర్షించడానికి వీలుగా మారడం ఎలా? ఇది మిలియన్ డాలర్ ప్రశ్న! రేపు చేయాలనుకున్న పని ఈ రోజు చేయాలి. ఈ రోజు చేయాలనుకున్న పని ఇప్పుడే చేయాలి. ఇప్పుడు చేయాలనుకున్న పని ఈ క్షణమే ప్రారంభించాలి.

పరిస్థితులు చేయి దాటిపోకుండా మీరు కష్టపడటానికి సిద్దపడాలి. మీరు మీ కిష్టమైన రంగంలో విజయం సాధించడానికి పరిస్థితులు అనుకూలంగా లేకుంటే, తక్షణం మరో రంగంలో ప్రయత్నించడం, అటువైపు మీ కృషి, ఆలోచనలు మళ్ళించడం తప్పేమీ కాదు. సానుకూల వాతావరణంలో విజయాలు సాధించడం ఎవరికైనా చాలా తేలికగా ఉంటుంది.

విజయం అనేది అప్పుడప్పుడూ ఒళ్ళంతా నూనె రాసుకున్న దొంగలా జారిపోతుంది. దాన్ని పట్టుకోవడం ఒక జీవితకాలపు కష్టమైపోతుంది కొంత మందికి. విజయ లక్ష్యాన్ని పక్కదోవ పట్టించకుండా, విజయ శిఖరాలపైనే దృష్టి నిలిపి, పరిస్థితులు అనుకూలించనప్పుడు మరో రంగంపై దృష్టి సారించడం తప్పేమీ కాదంటాడు చాణుక్యుడు తన 'అర్ధశాస్త్రం' అనే గ్రంధంలో.
మీ విజయం పట్ల మీకే సందేహాస్పదంగా ఉన్నప్పుడూ ఈ క్రింది సూత్రాలు పాటించమని బోధిస్తాడు చాణక్యుడు.
1. మీదైన విజయాన్ని సాధించాలనుకున్నప్పుడు, ఎప్పుడు తప్పులు సరిదిద్దుకోవడానికి సిద్దంగా ఉండాలి. మీ దారిలో విజయం తారసపడదని మీకు సృష్టంగా తెలిసినప్పుడు మరింత మంచి మార్గాన్ని ఎన్నుకోవడంలో తప్పేమీ లేదు. విజయాన్నివ్వలేని మార్గాన్ని తక్షణం విడిచిపెట్టాలి.
2. మీ సామర్ధ్యం పట్ల ఆత్మ విశ్వాసం కాకుండా, అతి విశ్వాసం ఉంటే, తక్షణం వాటిని మొహమాటం లేకుండా, ఆత్మ విమర్శతో విశ్లేషణ చేసుకోవాలి. నీ ఆలోచనలకంటే విభిన్నంగా నీ లక్ష్యాలు ఎందుకున్నాయో అవగాహన చేసుకుని, సాధించగలిగిన లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. 
3. జయాపజయాలు పగలు, రాత్రి లాంటివి. ఒక దానినొకటి వెంబడిస్తాయి. ఒక అంశంలో నీకు అపజయం ఎదురైతే, మరో లక్ష్యంతో విజయం సాధించవచ్చు. 
4. నువ్వు ఎన్నుకున్న మార్గంలో విజయం లభించనప్పుడు, దగ్గర దారులు ఎంత మాత్రం వెదకకూడదు.
5. నీ ప్రయత్నాలు, కృషి మధ్యలో ఆపేస్తే జనం హేళన చేస్తారని భావించకూడదు. ' రస విద్య' అంటే బంగారం తయారు చేసే విద్య పట్టుబడినా, ధన వ్యామోహం తగదని, అది ప్రజలకు అపకారం చేస్తుందని వేమన తన కృషిని వదిలిపెట్టి ఆదర్శ ప్రాయుడయ్యాడు. పొరపాటున రాజకీయ రంగంలో కొచ్చిన ఎందరో సినీ నటులు, అది తమ విజయ వేదిక కాదని, మళ్లి సినిమా వినోదల వేడుకలకు తిరిగొచ్చినవైనం మానందరికి తెలుసు. అనవసరమైన ఆత్మాభిమానాలతో నలిగిపోయి, జీవితాన్ని కష్టపడి అపజయల బాటా పట్టించేది మధ్య తరగతి మానవులే
 6. విజయం సాధించడానికి వంతు కృషి లోపం లేకుండా చేశావు. అయినా అనూ హ్య కారణాల వల్ల సాధ్యపడలేదు. అటువంటప్పుడు నీ విజయ మార్గాన్ని మార్చుకునే హక్కు నీకుంది. ఇటువంటి సందర్భంలో మార్గదర్శకుల సహాయం తీసుకుంటే వారు విజయాల బాటా చూపిస్తారు.
7. ఓర్పు ఎప్పటికీ బలమే. బలహీనత ఎంత మాత్రం కాదు. నీ ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు, మరింత ఓర్పు తో ప్రయత్నిస్తే అనితర సాధ్యమైన విజయాలు సాధించవచ్చు, 'ఓరిచితే తనపంతం ఊరకేవచ్చు; అంటారు అన్నమాచార్యులు. ఓర్పు వహిస్తే మన పట్టుదలలన్నీ తప్పక నెరవేరతాయని భావం.
8. నీ లక్ష్యాలు సాధిస్తే గొప్పవాడరని అంతా ఆకాశానికేతెస్తారు. లక్ష్యాలు సిద్దించకపోయినా నిరాశ పడకూడదు. 
9. వైఫల్యాలు వలన మన బలలేమిటో, వాటితో మనం ఏం సాధించగలమో మరింత అవగాహనకొస్తుంది. 

మనం నివసిస్తున్న భవనం కూలిపోతే, ఆ శిధిలాల మధ్య జీవించలే౦ కదా. కష్టపడి మరో చిన్న ఇల్లు కట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాము. మనం నియంత్రించలేని, మన చేతుల్లో లేని పరిస్థితుల ప్రభావం వలన విజయం దూరమైతే, సరికొత్త ఆలోచనలకు అంకురార్పణ చేయాలి. అసాధారణంగా, రొటీన్కి భిన్నంగా ఆలోచించాలి. తమ బలాల్లో ఉన్న బలహీనతల బలమేమిటో తెలుసుకున్న వాళ్లు నిజంగా విజయం సాధించినవాళ్లు. సింపుల్ గా చెప్పాలంటే తన బలహీనతల పట్ల అద్భుతమైన అవగాహన కలపడే నిజమైన విజయుడు.
"సైకాలజీ టుడే" సౌజన్యంతో

1 Response to "'నేను గెలుస్తానా?' - మీ సందేహానికి 8 చాణక్య సమాధానాలు!"

  1. UnknownOctober 16, 2016 at 3:22 PM

    లిప్ ముద్దు గురించి తెలియని నిజాలు https://goo.gl/sJ30vR
    నడుము గురుంచి మీకు తేలియని విషయాలు https://goo.gl/oKJRYz
    అగోరలా రహస్య దేవాలయాలు https://goo.gl/dVZg1c
    జమ్మి చెట్టు విశేషం https://goo.gl/Y6WCbi
    రంగులు మార్చుతున్న మూల విరాట్ వినాయకుడు https://goo.gl/1wzia7
    మన దేశంలో రావణాసురుడు ఆలయాలు https://goo.gl/mCwdZZ
    మన దెశంలొ మహిళలు కట్టించిన అద్భుత కట్టడాలు https://goo.gl/bvGxqV
    మన భారతదేశం లొని 10 అద్భుతాలు https://goo.gl/kRVTNB

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • 1.క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు:"యేసు ఎవరు?"
    "యేసు పట్ల గల "మీ విశ్వాసం" ఏమిటి? అని మిమ్మల్ని ప్రశ్నిస్తే... " యేసును నేను దేవుని "గా విశ్వసిస్తున్నాను...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • పుస్తక పఠనం వలన ప్రయోజనాలు ఎన్నో!
    ఒ కప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య,సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి.చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు జరిగేవి.క...
  • క్రైస్తవపండితుల అపార్థాలు-బైబిల్ గ్రంధ యధార్థాలు
    నేటి క్రైస్తవ ధర్మం అంతా కల్పిత బోధనలతో నిండిపోయింది.నేటి చర్చి పాదర్ల బోధనలకు,బైబిల్ ఉపదేశాలకు సారూప్యమే లేదు.మానవుడు ముక్తి పొందాలంటే కల్...
  • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం.
                                                                                                Next Page పై పుస్తకం త్వరలో విడుదల కానుం...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • వేద శాస్త్రాల ప్రకారం మాంసాహారం నిషిద్దమా?
     నేడు గోవధ నిషేదం ఒక రాజకీయ నినాధం తప్ప వేద నిషేధం కాదు.ఆనాడు ఆర్యులు కాని,వేద అనుచరులుగాని మాంసాహారులే.వారు చేసే యజ్ఞాలకు ఎన్నో అశ్వాలు,...
  • కొంతమంది ప్రముఖ బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల అపార్ధం!
    ఈమధ్యకాలంలో కొంతమంది బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల విపరీతమైన అపార్ధం చేసుకుని తమ,తమ బ్లాగులలో పరోక్షంగా పోస్టులు వ్రాయడం ప్రా...

Recent Comments

Blog Archive

  • ►  2024 (2)
    • ►  July (2)
  • ►  2021 (1)
    • ►  April (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ▼  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ▼  April (2)
      • 'నేను గెలుస్తానా?' - మీ సందేహానికి 8 చాణక్య సమాధాన...
      • బైబిల్ ప్రకారం యేసు దేవుడా? ప్రభువా?
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative