Posted by Sakshyam Magazine on Thursday, January 15, 2015
.jpg)
సర్వ మానవులకు చెందిన "
స్వచ్చమైన ధర్మం" గ్రంధాలలో మరుగున పడిపోయింది. అధిక శాతం స్వార్ధపరులైన ధార్మిక పండితులు సృష్టించిన "
కాల్పనిక ధర్మం"ప్రజలలో వ్యాపించిపోయింది. అది వారికి అడ్డదారిలో "
డబ్బును-దర్పాన్ని" సంపాదించుకునే అత్యంత సులువైన మార్గం అయ్యింది."స్వచ్చమైన ధర్మం" తెలియక ప్రజలు నైతికంగా పతనమవుతున్నారు. ఇంకా అందరి "
ధర్మం" ఒక్కటే అన్న వాస్తవాస్తవం తెలియక సామాన్య ప్రజలు "
మతాల"పరంగా "
అనైక్యత"కు గురై పరస్పరం ఘర్షించుకుంటున్నారు. సకల ధార్మిక గ్రంధాల ప్రకారం - సర్వ మానవుల ధర్మం ఒక్కటే! ఈ విషయాన్ని ఖురాన్ తెలియజేస్తున్న వైనాన్ని గమనించగలరు.
(ఖురాన్ కు) పూర్వపు గ్రంధాలలోని సమస్త బోధలుగల స్పష్టమైన
నిదర్శనం (ఖురాన్) వారి (మక్కా బహుదైవోపాసకుల) వద్దకు రాలేదా? -ఖురాన్ 20:133
పైవాక్యం ప్రకారం - ఖురాను గ్రంధంలో ఉన్న సమస్త "
సిద్ధాంతాలు" ఖురాన్ కు పూర్వగ్రంధాలలో ఉన్న "
సిద్దాంతాలే" అని సుస్పష్టమవుతుంది. ఇంకా ఈ క్రింది వాక్యం ద్వారా తెలిసేదేమిటో చూడగలరు.
పూర్వికుల గ్రంధాలలో కూడా ఇది (ఖురాన్ ప్రబోధనం)ఉన్నది. -ఖురాన్ 26:196
అంటే ఈ ఖురాన్ గ్రంథం ఏ "
సిద్ధాంతాలు" ప్రబోధిస్తుందో అచ్చం అవే "
సిద్ధాంతాలు" ఖురాన్ కు పూర్వం వచ్చిన సమస్త ధార్మిక గ్రంధాలు కూడా కలిగి ఉన్నాయని పై వాక్యం ద్వారా సుస్పష్టమవుతుంది.
ఇంకా, పైన పేర్కొన్న రెండు వాక్యాల ద్వారా- అటు ఖురాన్ కు పూర్వపు గ్రంధాల "
సిద్దాంతాలు" ఇటు ఖురాన్ లో ఉన్నాయని తెలుస్తుంది. అలాగే ఇటు ఖురాను గ్రంధంలో ఉన్న "
సిద్ధాంతాలు" అటు ఖురానుకు పూర్వపు గ్రంధాలలో కూడా ఉన్నాయని సృష్టికర్త తెలియజేస్తున్నాడు. దీనికి ఆధారంగా "
భగవద్గీత-బైబిల్" గ్రంధాలకు చెందిన "
పన్నెండు" మౌలిక "
సిద్ధాంతాలు"తో ఖురాన్ మౌలిక "
సిద్ధాంతాలు" పోలి ఉండటాన్ని ఈ పై పుస్తకంలో గమనించగలరు. కావల్సినవారు
9866865253కి సంప్రదించగలరు.