గౌరవ నీయులైన పాఠక మిత్రులారా!
మొదటి భాగంలో, పాప పరిహారానికి - 1. ‘చెడు మాని, మంచి చేయటం’ 2. ‘పాపములను క్షమించమని యెహోవాను కోరటం’ 3. ‘పాప ములను, దోషములను యెహోవా యెదుట ఒప్పుకోవటం’ అనే మూడు ప్రత్యామ్నాయాలు పాతనిబంధన కాలంలో ఉన్నాయని పరిశుద్ధ బైబిలు గ్రంధం ద్వారా తెలుసుకున్నాము. దీనిని బట్టి, పాత నిబంధన కాలంలో- కేవలం ఒక్క రక్తం ద్వారా తప్ప పాప పరిహారానికి మరొక ప్రత్యామ్నాయం లేనే లేదని అధిక శాతం క్రైస్తవ పండితులు చేస్తున్న వాదన ‘అసత్య వాదన’ అని పరిశుద్ధ బైబిలు గ్రంధ (2 వ దినవృత్తాంతాలు 7:14; సంఖ్యాకాండము 14:19, 20; -కీర్తన 32: 5) వాక్యాల ద్వారా సుస్పష్టమయ్యింది.
మానవాళి జీవన ప్రణాలిక ఏమిటి?
రోగనివారణ జరగాలంటే, రోగము రాకకు గల కారణాలు ఏమిటో ముందస్తుగా గుర్తించటం అనివార్యం. ఎందుకంటే- వచ్చిన ద్వారం గుండానే దానిని సాగనంపటం సులువు అవుతుంది కనుక! అయితే ‘
పాపము’ అనే ఈ భయంకరమైన రోగము తలెత్తటానికి పరిశుద్ధ బైబిలు గ్రంధము తెలిపే ‘మూల కారణములు’ ఏమిటో తెలియాలంటే- దేవ దేవుడు, మానవాళి కొరకు చేసిన ‘జీవన ప్రణాళిక’ను గురించి కొంతవరకు తెలుసుకోవాలి. దానికి సంబంధించి ఈ క్రింది వాక్యాన్ని గమనించగరు.
నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను
ఉంచి, భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. -ద్వీతీయోపదేశకాండము 30:19
పై వాక్యము ద్వారా, మనిషి ముందు- ‘జీవము లేక ఆశీర్వాదము’ మరియు ‘మరణము లేక శాపము’ అనే రెండు ఆప్షన్స్ పెట్టినట్లు సర్వోన్నతుడైన దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రెండు గమ్యాలకు చేర్చే ‘మంచి’ మరియు ‘చెడు’ అనే రెండు విధానాలను కూడా ఆయన పెట్టాడు. వాటిని చూపించే ‘పట్టిక’ పేరే ‘ధర్మశాస్త్రం’. ఈ క్రింది గమనించగలరు.
యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును
కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని
పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. -నిర్గమకాండము 16:4
‘చేయవలసిన’ మరియు ‘చేయకూడని’ ఆజ్ఞలను అంటే- (Dos and Don’ts) ను గురించి తెలిపేదే ‘ధర్మశాస్త్రం’. దేవ దేవుడు దానిని మనకు ఇచ్చింది, దాన్ని పొగొడుతూ కూర్చోవటానికో లేక మోసుకుంటూ తిరగటానికో కాదు. మనకు ‘మేలు’ కలుగుట కొరకు ఆయన పాటించమన్న అందులోని 'ఆజ్ఞల’ను పాటిస్తూ మరియు మనకు ‘కీడు’ కలుగకుండుట కొరకు ఆయన మనకు వారించిన అందులోని 'ఆజ్ఞల’కు దూరంగా ఉంటూ, ఈ జీవితాన్ని పాటించటానికి. అలా పాటిస్తారా లేదా అని నేను మిమ్మును ‘పరీక్షించున్నా'ను అని పై వాక్యంలో దేవ దేవుడు తెలుపుతున్నాడు!
ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రంలోని 'ఆజ్ఞల’ను పాటిస్తే, ఇహలోక జీవితంలో ‘ఆశీర్వాదము’ మరియు ‘పరలోకజీవితం’లో ‘నిత్య జీవము’ను లభిస్తాయి. ఒకవేళ ధర్మశాస్త్రంలోని'ఆజ్ఞల’ను పాటించకపోతే, ‘ఇహలోక జీవితం’లో ‘శాపము’ను మరియు ‘పరలోకజీవితం’లో ‘నిత్య మరణము’నకు గురికావలసివస్తుంది. ఈ మహా కార్యమును ప్రారంభించి, దీనిని గాలికి వదిలేసి ఆయన ఎక్కడయినా వెళ్ళి పడుకున్నాడా? లేక మానవాళికి పరీక్ష స్థలమైన ఈ భూగోళంపై దృష్టి పెట్టి ఉన్నాడా? అన్న ప్రశ్నలకు పరిశుద్ధ బైబిలు గ్రంధం ఇచే సమాధానం ఏమిటో ఈ క్రింది గమనించగలరు.
యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డ వారిని మంచి వారిని అవి
చూచుచుండును. -సామెతలు 15:3
సకల మనవాళికి పరీక్ష స్థలమైన ఈ భూగోళంపై నివసిస్తున్న మంచి వారిపై మరియు చెడ్డ వారిపై కూడా ఆయన నిరంతరం తన దృష్టిని పెట్టి ఉన్నాడని పైవాక్యం ద్వారా బోధ పడుతుంది. అంటే మానవాళి జీవిత పరీక్ష సునిసితమైన నిఘాలో జరుగుతుందన్నమట! పరిశుద్ధ బైబిలు గంధం ప్రకారం- ఇదీ దేవ దేవుడు రచించిన మానవ జీవన ప్రణాళిక!
పరిశుద్ధ బైబిలు ప్రకారం- పాపము అనగా ఏమిటి?
ఏ ‘పాప’క్షమాపణ కొరకు ‘రక్త ప్రోక్షణం’ తప్పనిసరి అని నేటి అధికశాతం బోధకులు ప్రకటిస్తున్నారో, ఇంతకూ ఆ ‘పాపం’ అంటే ఏమిటీ? అది ఏన్నిరకాలూ? అన్న ప్రశ్నలకు సుస్పష్టమైన సమాధానాలను ముందుగా తేలుసుకోవటం ఎంతైనా అవసరం. ఈ క్రింది వాక్యాన్ని గమనించగలరు.
పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.
(-1 వ యోహాను 3:4),
ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము... -రోమీయులకు 6:23
పై వాక్యమును బట్టి- ‘పాపము’ అనగా ‘ఆజ్ఞ తిక్రమము’ అని అర్థం అవుతుంది. అంటే- మానవాళి ‘ఇహ’-‘పరాల’ సాఫల్యానికి దేవ దేవుడు ఏ 'ఆజ్ఞల’ను ఇచ్చాడో వాటిని అతిక్రమించటం వలన ఇటు ‘మనిషి వ్యక్తిగత జీవితం’ మరియు అటు ‘సాంఘీకంగా ఇతరుల జీవితాలు’ నాశనం అయిపోతాయి. అందుకే ‘ఆజ్ఞ తిక్రమము’ను ‘పాప’ కార్యముగా నిర్ధారిచాడు ఆ దేవ దేవుడు.
పాపాలు ఎన్నిరకాలు?
‘పాప’మంటే ఏమిటో అర్థమయ్యింది. ఇక ‘పాపం’ ఒకే రకంగా ఉంటుందా? లేక వివిధ రకాల పాపాలు ఉంటాయా? అన్నది తెలుసుకోవలసి ఉంది. సాధారణ పాపములు మరియు గొప్ప పాపము క్షమించ బడే పాపములు క్షమిచ బడని పాపములు వగైరా... ఉదాహణకు:
గొప్ప పాపము! Great Sin!
మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా
యొద్దకు కొండ యెక్కి వెళ్లెదను; ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము
చేయగలనేమో అనెను. -నిర్గమకాండము 32:30
పాపాలలో సాధారణమైనవే కాక ‘గొప్ప పాపము’ (Great Sin) కూడా ఒకటి ఉంటుందని పైవాక్యమును బట్టి అర్థమౌతుంది. ఇంతకూ ఏమిటి ఆ ‘గొప్ప పాపము’ అని ప్రశ్నిస్తే, పై వాక్యానికి కొనసాగింపుగా ఉన్న ఈ క్రింది వాక్యం ఇస్తున్న సమాధానాన్ని గమనించగలరు.
అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి అయ్యో యీ ప్రజలు గొప్ప
పాపము చేసిరి; వారు బంగారు దేవతను తమకొరకు చేసికొనిరి. -నిర్గమకాండము 32: 1
ఈ వాక్యమును బట్టి- దేవ దేవునితో పాటు మరొక దేనినైనా సహవర్తులుగా చేస్తే, అదే ఆయన దృష్టిలో ‘గొప్ప పాపము’ (Great Sin) అవుతుంది! తనతోపాటు ఇతరులను సహవర్తులు చెయ్య కూడదనే విషయంలో దేవ దేవుడు చేస్తున్న హెచ్చరిక లోని ‘స్పష్టత’నూ మరియు ‘తీవ్రత’నూ ఈ క్రింది వాక్యంలో గమనించగలరు.
నేను మీతో చెప్పినవాటినన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను; వేరొక దేవుని పేరు
ఉచ్చరింప కూడదు; అది నీ నోటనుండి రానియ్య తగదు. -నిర్గమకాండము 23: 13
ఒకే ఒక్కడైన దేవ దేవుడు తనను తప్ప ఇంతరులెవరినీ ‘దేవుని’గా గుర్తించకూడదు, వేరొకని నైనా దేవుడు అని నోటితో కనీసం ఉచ్చరించకూడదు అని ఎంతో ‘స్పష్టం’గా మరియు ఎంతో ‘తీవ్రం’గా హెచ్చరించినప్పటికీ, నేటి అధికశాతం క్రైస్తవ బోధకులు- ‘యేసు దేవుడు’ అని మరియు ‘పరిశుద్ధాత్మ దేవుడు’ అని దేవ దేవుని ఆ ఆజ్ఞను రెండు సార్లు అతిక్రమిస్తున్నారు! ఈవిధంగా క్రైస్తవులలోని అధికులు రెండింతలు ‘గొప్ప పాపము’ (Great Sin) నకు పాల్పడుతున్నట్లు పరిశుద్ధ బైబిలు గంధం ద్వారా తెలుస్తుంది. మొత్తమ్మీద ‘గొప్ప పాపము’ (Great Sin) అన్నది కూడా ఒకటి ఉన్నదని తెలుస్తుంది.
క్షమాపణ ఉన్న పాపము! క్షమాపణ లేని పాపము!!
మనుష్యకుమారునికి (అనగా యేసుకు) విరోధముగా మాటలాడువానికి
పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి
ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.–మత్తయి 12:32
పై వాక్యలో రెండు రకాల పాపాలు కనిపిస్తున్నాయి. వాటిలో...
1. మనుష్య కుమారునికి అంటే- యేసుకు విరోధాముగా మాటలాడు వానికి కలిగే పాపానికి పాపక్షమాపణ ‘ఉంది’.
2. పరిశుద్ధాత్మకు విరోధాముగా మాటలాడు వానికి కలిగే పాపానికి పాపక్షమాపణ ‘లేదు’.
బుద్ధిపూర్వకంగా చేసే పాపాలు!
మనిషికి ధర్మశాస్త్రాలతో సంబంధం లేకుండానే అతనికి ఉన ‘విచక్షణా జ్ఞానం’తోనే ‘మంచి’-‘చెడు’లను గుర్తిస్తాడు. అయినప్పటికీ తన స్వార్ధం కొరకో, స్వలాభం కొరకో చెడని తెలిసికూడా ‘చెడు’ చేస్తాడు! దానినే బుద్ధి పూర్వకంగా చేసే ‘పాపమ’ని అంటారు. ఈ క్రింది బైబిలు వాక్యాన్ని గమనించగలరు.
అయితే దేశమందు పుట్టినవాడేగాని పర దేశియే గాని యెవడైనను సాహసించి
పాపముచేసినయెడల. వాడు యెహోవాను తృణీకరించినవాడగును గనుక అట్టి
వాడు నిశ్చయముగా జనులలో నుండకుండ కొట్టి వేయబడును; వాడు యెహోవా
మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయ
బడును; వాని దోషశిక్షకు వాడే కారకుడు. -సంఖ్యాకాండము 15:30, 31
పొరపాటుగా జరిగే పాపాలు!
ఇశ్రాయేలీయులలో పుట్టినవాడేగాని వారి మధ్యను నివసించు పరదేశి యేగాన
పొరబాటున ఎవడైనను పాపము చేసినయెడల వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలెను. - -సంఖ్యాకాండము 15:29
ఇవే కాక, ఇంకా వివిధ రకాల పాపాలు ఉన్నాయని బైబిలు గంధం తెలియజేస్తుంది. అయితే, ఏ యే పాపాలకుఏయే విధమైన ప్రాయశ్చిత్తాలు ఉన్నాయని పరిశుద్ధ బైబిలు గంధం తెలియపరుస్తుందో తదుపరి భాగంలో తెలుసుకుందాము!
M.A.Abhilash
09666488877
tmcnewstmc@gmail.com
వీడియో ప్రసంగాల కొరకు Sakshyam TV చూడండి.