Posted by Sakshyam Magazine on Wednesday, July 16, 2014

విశ్వాసి అయిన ప్రతి వ్యక్తీ రెండు విధులను నిర్వర్తించవలసి ఉందని అల్లాహ్ నిర్దేశించి ఉన్నాడు.వాటిలో మొదటి విధి
'దైవధర్మ అనుసరణ".దీనినే షరియత్ పరిభాషలో '
ఇత్తెబాయె ఇస్లాం"అని అంటారు.రెండవ విధి 'దైవధర్మ ప్రచారం దీనిని
'ఇషాయతె ఇస్లాం"అని అంటారు.ఈ రెండు విధులనూ సమాంతరంగా నిర్వర్తించవలసి ఉంది.మొదటి విధిని నిర్వర్తించి, రెండవ విధిని నిర్వర్తించక పోతే ఏ విధమైన ప్రయోజనమూ లేదు అన్న దానికి ఆధారంగా ఈ క్రింది ఖురాన్ వాక్యాలను గమనించగలరు.
ఇంకా వారికి ఈ విషయం గుర్తు చేయి.వారిలోని ఒక వర్గం వారు మరొక వర్గంవారితో ఇలా అన్నారు: 'మీరు హితబోధ ఎందుకు చేస్తున్నారు? అల్లాహ్ నాశనం చెయ్యనున్న వారికి లేక కఠినంగా శిక్షించునున్న వారికి?..ఖురాన్ 7:164
పై వాక్యాలను కాస్త నిశితంగా గమనిస్తే వాటిలో మూడు వర్గాలు కనిపిస్తాయి. అవి:
1.హితబోధ చేస్తున్న వర్గం.
2.హితబోధ చేస్తున్న వారిని వారిస్తున్న వర్గం.
3.హితబోధ చేయబడే వర్గం.
మొదటి వర్గం ధర్మానుసరణ
[ఇత్తెబాయె ఇస్లాం] మరియు ధర్మప్రచురణ
[ఇషాయతె ఇస్లాం] అన్న రెండు విధులను కూడా చేస్తున్న వర్గం.
రెండవ వర్గం అయితే అటు ధర్మప్రచురణ
[ఇషాయతె ఇస్లాం] చేయక కేవలం
ధర్మ అనుసరణ [ఇత్తెబాయె ఇస్లాం] అన్న ఒక్క విధిని మాత్రమే చేస్తున్న వర్గం.
మూడవ వర్గం అయితే అటు
ధర్మ అనుసరణ మరియు ఇటు ధర్మ ప్రచురణ అనే రెండు విధులనూ చేయని వర్గం అనగా తిరస్కార వర్గం.
అయితే ఒకరోజు దైవశిక్ష అవతరించింది.ఆ శిక్ష నుండి ఎవరు రక్షించబడ్డారు? మరియు ఎవరు దానికి బలి అయ్యారు? అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ క్రింది వాక్యాలను గమనించగలరు.
చివరకు వారు తమకు జ్ఞాపకం చెయ్యబడిన హితబోధను పూర్తిగా విస్మరించినప్పుడు మేము చెడునుండి ప్రజలను వారించేవారిని రక్షించాము.దుర్మార్గులైన ఇతరులందరినీ వారి అవిధేయతల కారణంగా కఠిన శిక్షకు గురిచేసాము..ఖురాన్ 7:165
పై వాక్యాల ప్రకారం తాము
ధర్మానుచరణ చేస్తూ, అధర్మానికి పాల్పడుతున్న వారిని హెచ్చరిస్తూ
'ధర్మప్రచురణ కూడా చేస్తున్న ఒక్క వర్గాన్ని మాత్రమే అల్లాహ్ కాపాడాడు.కేవలం
ధర్మానుచరణ చేసేవారిని మటుకు
'ధర్మ ధిక్కారు"లతో కలిపి ఘోరశిక్షకు గురి చేసాడు.