Posted by Sakshyam Magazine on Sunday, August 10, 2014

దుష్టుల ఆలోచన చొప్పున నడువక
పాపుల మార్గమున నిలువక
అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు
దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
కీర్తనలు 1:1-2
జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు
వివేచన కలిగిన నరుడు ధన్యుడు
సామెతలు 3:13
మూర్ఖపుమాటలు నోటికి రానియ్యకుము
పెదవులనుండి కుటిలమైన మాటలు రానియ్యకుము
సామెతలు 4:24
జ్ఞానము ముత్యములకన్న శ్రేష్ఠమైనది.
విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు
సామెతలు 8:11
అపహాసకుని గద్దింపకుము గద్దించిన యెడల వాడు నిన్ను ద్వేషించును.
జ్ఞానంగలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును.
సామెతలు 9:8
నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును
ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు.
సామెతలు 24:16
మాటిమాటికి నీ పొరుగువాని యింటికి వెళ్లకుము
అతడు నీవలన విసికి నిన్ను ద్వేషించునేమో
సామెతలు 25:17
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలము.
పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధారము.
సామెతలు 9:10.
More Bible Articles