Posted by Sakshyam Magazine on Saturday, June 17, 2017
"సాక్ష్యం మేగజైన్"లో అన్ని రకాల ఆర్టికల్స్ ఉన్నాయి. ఇది కేవలం ఇస్లాం పరమైన సైట్ కాదని ఎన్నో సార్లు గతంలో మేము పేర్కొన్న విషయం మీకు విదితమే! నిజానికి మేము ఏవైతే కొన్ని కల్పిత సిద్ధాంతాలను గుర్తించమని ప్రబోధించామో వాటికి మన ధార్మిక గ్రంధాల వాస్తవికతతో ఏమాత్రం సంబంధం లేదన్న విషయం మేము గత వ్యాసాలలోనే రూడీ చేయగలిగాము. ఇక ముందు,ముందు కూడా జ్ఞాన పూర్వకమైన ఎన్నో వ్యాసాలూ రానున్నాయి. అవి ఎంతవరకూ శాస్త్ర వాస్తవికతతో ముడి పడి ఉన్నాయో పరిశీలించగలరు.
మా "సాక్ష్యం మేగజైన్" వారికందరికీ మామతం గొప్ప, మీ మతం దిబ్బ అనే భావన ఏకోశానా లేదు. అది మీరు గమనించవచ్చు. మేము అన్ని ధార్మిక శాస్త్రాలలో ఉన్న మహత్తును,వాస్తవాన్ని తెలియజేయడం, శాస్త్రాల పేరు చెప్పుకుని మాయా క్రతువులను స్థాపిస్తూ ప్రజలను వక్ర మార్గం తప్పిస్తున్న తప్పుడు సిద్ధాంతాలను శాస్త్ర వెలుగులో ప్రజల ముందు ఉంచడమే మా పనిగా భావిస్తూ చేస్తున్నాము తప్ప మరో భావం ఏమీ లేదు.
నిజానికి మాకు అన్ని ధార్మిక శాస్త్రాలు ఒక్కటే. అవన్నీ కాలానుగుణంగా ఆ భగవంతుని చేత ప్రోక్తించబడినవే. కేవలం వాటిని మాత్రమే మనిషి పరిగణలోకి తీసుకోవాలి. అయితే అవ్వన్నీ వ్యాఖ్యాన పరంగా, భాష్యాలపరంగా చాలా వరకు వక్రీకరించబడే ఉన్నాయి. ఈ విషయం వాస్తవ దృష్టితో శాస్త్ర పరిశీలన చేసిన ప్రతివారికి తెల్సిపోతుంది.
ఇకపోతే "సాక్ష్యం మేగజైన్"లో సమాచారం పొందుపర్చింది చాలా తక్కువనే చెప్పాలి. అయితే ఇక నుండి ఎన్నో ధార్మిక వ్యాసాలూ రానున్నాయి. ధర్మాన్ని ఆధారం చేసుకున్న సైన్స్ విషయాలు ప్రకటించబడనున్నాయి.
మరొక శుభవార్త ఏమిటంటే అతిత్వరలో "secrets of gita" పేరుతొ భగవద్గీతకు సంబందించిన ఆశ్చర్య పరిచే, ఆలోచించబడే సమాచారం సీరియల్ రూపంలో రానున్నది. అప్పుడు మీరే తప్పకుండా గ్రహించగలుగుతారు- గీతా శాస్త్రం యొక్క గొప్పతనం. ఇది అత్యధికంగా పండిత వర్గంచే వక్రీకరించబడిన విషయాన్నితప్పనిసరిగా తెలియజేస్తుంది. అంతవరకూ వెయిట్ అండ్ సీ!!
How much of "Sakshyam Magazine" distorted our my viewers will not notice !!
Andhra,Telangana Teachers Notifications,10th,Inter,Degree,all Groups Model Papers and Question Papers, All Govt Jobs Notifications, latest job news...More. Please Visit the Teacherguide.in