Posted by Sakshyam Magazine on Monday, July 13, 2015
రచ్చబండలో జరిగిన స్వలింగ సంపర్కం గూర్చి కొంతమంది మేధావుల అభిప్రాయాలు చదివి చాలా ఆశ్చర్యమేసింది. స్వలింగ సంపర్కాన్ని మేము సమర్ధించమంటూనే అది వ్యక్తిగత స్వేచ్చ గా పరిగణిస్తామంటూ సమర్ధించుకుంటూ వచ్చారు. ఇదేం పద్ధతో తెలియదు. మరొకరు ఒక పండితుణ్ణి ఆర్టికల్ యొక్క భావాన్ని తప్పించి స్వలింగ సంపర్కాన్ని ధార్మిక శాస్త్రాలు కూడా సమర్ధిస్తున్నాయని మరీ విడ్డూరంగా వ్యాఖ్యానించారు.
వ్యక్తిగత స్వేచ్చ అయినా, సామాజిక స్వేచ్ఛ అయినా కొన్ని పరిమితులు, హద్దులు ఉంటాయి. అవి మీరితే పెద్ద వినాశనాలే జరుగుతాయి. వ్యక్తిగత స్వేచ్ఛ గురించి ఆలోచిద్దాము. నిజానికి స్వేచ్ఛ అని దేనినంటారు. అది తనకుగాని, తన కుటుంబానికిగాని, సమాజానికిగాని ఎటువంటి నష్టాన్నిగాని, ప్రమాదాన్నిగాని తీసుకు రాకూడదు.
కొంతమంది మేధావులు సమర్ధిస్తున్న ఈ స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్ఛ ఎలా అయ్యింది? దీని వలన నష్టంగాని, ప్రమాదంగాని లేవంటారా? మనువుగారు తన బ్లాగులో అసలు సెక్స్ అనేది ప్రధానమైన అంశం సంతానోత్పత్తికి మాత్రమేనని పేర్కొన్నారు. ఇది 100% కరెక్ట్. ఈ విషయంలో ఆలోచిస్తే స్వలింగ సంపర్కం వలన ఈ ప్రధానమైన అంశం ఎగిరిపోయింది. మరొక ముఖ్య విషయమేమిటంటే స్త్రీలు,పురుషులు ఒకరికొకరు తోడు. వీరిద్దరి మధ్య సంబoధం అనేది న్యాయబద్ధమైనది, సమర్ధనీయమైనది.
అంతేగానీ పురుషుల, పురుషుల మధ్య లైంగిక సంబంధమేమిటి? స్త్రీలకి, స్త్రీలకి మధ్య లైంగిక సంబంధమేమిటి? ఇది ఎలా సాధ్యం? ఇదేమైనా ఆరోగ్యవంతమైనదా? ఒకసారి ఈ సమర్ధించే మేధావులందరూ ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది?
ఈ స్వలింగ సంపర్కం ముమ్మాటికి వ్యక్తిగత స్వేచ్ఛ కాదు. ఇది చాలా భయంకరమైన వికృత చేష్ఠ! ఇది ప్రపంచాన్ని నాశనం కొరకు తీసుకువెలుతున్న ఒక విధమైన వైరస్.
ఇది వ్యక్తిగత స్వేచ్చంటూ బ్లాగుల్లోనూ, ప్రసంగాల్లోనూ ఊదరగొట్టుకోవడానికి బాగానే ఉంటుందిగాని, నిజ జీవితానికొచ్చేటప్పకి అది ఎంతగొప్ప వికృత చ్రేష్ఠో స్పష్టమవుతుంది.