Posted by Sakshyam Magazine on Thursday, July 6, 2017
హిందూ-క్రైస్తవ-ముస్లిం వర్గాలకు వారి,వారి "ఆధ్యాత్మిక" ధర్మశాస్త్రాలు- "గీతా-బైబిల్-ఖురాన్' గ్రంథాల పేరిట ఉన్నాయి. కానీ, భారతీయులందరికీ కలిపి ఒకే 'ఉమ్మడి లౌకిక ధర్మశాస్త్రం' ఉండి. అదే 'భారత రాజ్యాంగం!'. దాని ఆదేశాలు పాటించడం సకల భారతీయులకు విధి. కనుక ఒక వైపు "గీతా-బైబిల్-ఖురాన్' గ్రంథాల ప్రతిపాదిత 'సమాంతర దృక్పదాల' ఆధారంగా మన 'నైతికత'-'ఐక్యత' పరంగా మన విద్యార్ధులను తీర్చి దిద్దుతూ, మరొక వైపు- మన భారత రాజ్యాంగం అందిస్తున్న 'హక్కుల'తో పాటు అది విధిస్తున్న 'బాధ్యతల'ను కూడా విద్యార్ధి దాస నుంచే ఔపోసన పట్టించి వారిని 'ఉత్తమ పౌరులు'గా మలచటానికి "
Sakshyam Educations" అనే మా "
స్వచ్చంద విద్యా సంస్థ" నిశ్చయించుకుంది.
"ప్రతి భారత పౌరుడు ఈ క్రింది బాధ్యతలను మనసారా స్వీకరించి బాధ్యతాయుతంగా ప్రవర్తించవలెను!" అని రాజ్యాంగం ఆదేశిస్తున్న విషయాలను నిశితంగా గమనించగలరు.
- A) రాజ్యాంగ శాసన బద్దుడై యుండుట. శాసన మండలి ఆశయములనూ, శాసనం స్థాపించే సంస్థలనూ, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని అంకిత భావంతో గౌరవించుట.
- B) స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో అన్ని రంగాలలో వ్యవహరించుట.
- C) దేశ సార్వభౌమత్వాన్ని, సమన్వయతనూ, సమగ్రతను రక్షించుట.
- D) దేశ రక్షణలో అనుక్షణం సంసిద్ధుడై ఉండుట.
- E) ప్రజా జీవనంలో అన్యోన్యతనూ, భాత్రుభావాన్నిపోషించుట, మత, భాష, ప్రాంతీయతత్వాలకు వర్గ వైరుధ్యములకు అతీతముగా ఉండుట.
- F) అమూల్యమైన భారతీయ చారిత్రక సంపదనూ, సుసంపన్న సంస్కృతినీ పరిరక్షించుట.
- G) పర్యావరణాన్ని అడవులను,కొలనులనూ, నదులనూ రక్షించుట, అభివృద్ధి పరచుట, మృగ రక్షణ జలజంతు జీవరాసులపై కరుణాత్రత.
- H) శాస్త్రీయ మరియు మానవతా దృక్పధాలను అలవరచుకొనుట, జిజ్ఞాసను పెంపొందించుకొనుట, సంస్కరణ తత్వమును పెంపొందించుట.
- I) హింసను విడనాడుట, ప్రజల ఆస్తుల విధ్వంసం చర్యలను నిరోధించుట.
- J) వ్యక్తిత్వ సామర్ధ్యాల ఔన్నత్యాన్ని పెంపొందించుకొనుట ద్వారా మరియూ సమిష్టి కృషి ద్వారా అన్ని రంగాలలో గణనీయమైన స్థాయిని చేరుత కొరకు, శిఖరాగ్ర సాధన కొరకు నిరంతరం కృషి సల్పుట.
- K) రక్షకులు లేదా సంరక్షకులుగా ఉన్నవారందరూ ఆరు నుండి 14 సంవత్సరముల లోపల పసి వారికి విద్యాభాసము చేయు అవకాశమును కల్పించవలెను.
-(భారత రాజ్యాంగము Part -IV A, ప్రాధమిక బాధ్యతలు)
ఇవే మన భారత రాజ్యాంగం మనకు విధి చేస్తున్న బాధ్యతలు. పై బాధ్యతలలో C) మరియు E) ల ఆధారంగా "
Moralise India, Unite India- to Save India" అని ఏర్పడిన ఒక బృహత్తర నినాదంతో '
Sakshyam Educations' అనే మా "స్వచ్చంద విద్యా సంస్థ" మీ ముందుకు వచ్చింది.
Our "common secular law", "constitutional" orders!
Andhra,Telangana Teachers Notifications,10th,Inter,Degree,all Groups Model Papers and Question Papers, All Govt Jobs Notifications, latest job news...More. Please Visit the Teacherguide.in