• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » ARTICLES » మూఢ నమ్మకాలపై గొంతెత్తిన రాజారామమోహన్‌ రాయ్‌...క్లుప్తంగా ఆయన గురించి....కె కె వి నాయుడు.

మూఢ నమ్మకాలపై గొంతెత్తిన రాజారామమోహన్‌ రాయ్‌...క్లుప్తంగా ఆయన గురించి....కె కె వి నాయుడు.

Posted by Sakshyam Magazine on Wednesday, May 23, 2018
Label: ARTICLES

Ram_Mohan_Roy_Sakshyam-Magazine.jpeg
ఒకప్పుడు భారతదేశంలోని స్థితిగతులను చూసిన వారెవ్వరూ ఇంతటి మార్పు కలలో కూడా ఊహించి ఉండరేమో?
ఆ రోజుల్లో సాంఘీక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండేవి. చాందస సంప్రదాయాలు, మూఢ నమ్మకాలు, అవివేకంతో కూడిన ఆచారాలు, నిరక్షరాస్యత దేశ జీవన వాహినికి అడ్డుగోడలై అంధకారమరుపోరుంది. దానికితోడు బ్రిటీష్‌ దొరల పెత్తనం, మన దేశ ప్రజలను సాంఘీకంగా, రాజకీయంగా పెరగనివ్వకుండా, మూఢ నమ్మకాల వలయంలో కూరుకుపోవడానికీ అవకాశం కలిగించి, ప్రజలను మరింత చీకట్లోకి పడవేయడానికి ఎంతగానో ప్రయత్నించారు. అటువంటి సమయంలో వెలుగు రేఖలా అవతరించాడు ”మహా మనిషి” రాజా రామమోహన రాయ్‌.

రాజారామమోహన్‌ రాయ్‌
1772 మే 22న బెంగాలులోని రాధానగర్‌ అనే గ్రామాంలో జన్మించాడు. తండ్రి రమాకాంత్‌ రాయ్‌ ముర్షీదా బాద్‌ పాలకులైన మహమ్మదీయుల ఆస్థానంలో పనిచేసేవాడు. తల్లి ఠాకూరాణి సనాతనురాలు.

   రామమోహనరాయ్‌  ప్రాధమిక విద్యను ఆ గ్రామంలోనే అభ్యసించాడు. తరువాత పాట్నాకు వెళ్ళి అక్కడ చదువుకున్నాడు. చిన్నతనం నుంచే అతను ఖురాన్‌, బైబిలు, భగవద్గీత క్షుణ్ణంగా చదివాడు. అంతేకాదు ఆయా గ్రంధాల లోతుపాతుల్ని గ్రహించాలనే జిజ్ఞాసతో, అరబ్బీ భాషను, సంస్కృత భాషను, ఇంగ్లీషును అభ్యసించి, ఆయా మతాలకు సంబంధించిన ఇతర గ్రంధాలను అధ్యయనం చేశాడు.

”ప్రముఖ సంఘ సంస్కర్తగా, మానవతావాదిగా, యుగకర్త” గా కొనియాడబడిన మహా వ్యక్తి. మన ఆచారాల విషయంలో గుడ్డి నమ్మకాలు, జుగుప్స కలిగించే విశ్వాసాలు, అజ్ఞానంతో కూడిన ఆచారాలు, పాప విముక్తి కొరకు ఆచరించే అనేక ప్రక్రియలు రాం మోహన్‌ రాయ్‌ కి ఎంతో చికాకు కలిగించారు. ఒక మతానికి చెందినవారు ఇతర మతాలకు చెందిన వారిపై నిందారోపణలు చేయటం, బహిరంగంగా విమర్శించుకోవటం, ముష్టి యుద్ధాలకు దిగటం ఆయన సహించలేకపోయాడు. ఆయన ఉద్దేశంలో ”దేవుడనే వాడు ఒకడే. ఏ మతమైనా, కులమైనా అందరూ ఆరాధించేది ఒకరినే. అందరి పూజలూ ఆయనకే చేరుతారు. మతాలన్నీ కలసి పోరు విశ్వమతం ఏర్పడాలి ”ఆ ఆలోచనలే ఆయన బ్రహ్మ సమాజం స్థాపించడానికి పురికొల్పారు. రాయ్‌ హిందువు అరునప్పటికీ, హిందూ మతంలోని దురాచారాలను, మూఢ విశ్వాసాలను తీవ్రంగా ఖండించేవాడు. ఆ సమయంలోనే వాటిని ఖండిస్తూ ఒక వ్యాసం రాసినప్పుడు తండ్రికి కోపం వచ్చి, అతనిని ఇంటి నుండి గెంటివేశాడు. అరునా, రాయ్‌ చలించక, తన దేశ ప్రజలు బాగుపడాలంటే మూఢ విశ్వాసాలను వదిలి, బాగా చదువుకొని జ్ఞానం సంపాదించి తెల్లదొరల బానిసత్వపు చెరను తప్పించుకొని, స్వతంత్రంగా బతకాలని భావించి తన భావి కార్యక్రమాన్ని నిర్ణరుంచుకున్నాడు.

 ఆ రోజుల్లో భారతదేశంలో మతం పేరిట పీడిస్తున్న దురాచారాలలో ”సతీసహగమనం” ముఖ్యమైనది. భర్త మరణించగానే అతని శరీరం దహనం చేసేటప్పుడు భార్య కూడా ఆ మంటల్లోకి దూకి దహనమయ్యే అనాగరిక చర్యను అప్పటి ప్రజలు ఎంతో పవిత్ర కార్యక్రమంగా భావిస్తూండేవారు. రాయ్‌ ఆ చర్యను ఖండించినప్పుడు ఎందరో పెద్దల ఆగ్రహానికి, అసంతృప్తికి గురి అయ్యాడు. అరునా పట్టువిడువక, బ్రిటీష్‌ దొరలతో పోరాడి ”సతి”ని నిషేధించమని హవుస్‌ ఆఫ్‌ కామన్స్‌ కి ఒక విజ్ఞాపనపత్రం సమర్పించాడు. అరుతే అప్పటి ప్రభుత్వం ఆ విజ్ఞాపనను తిరస్కరించింది. రాయ్‌ విజ్ఞాపనను అంగీకరిస్తే అతను ఇంకా అనేక సంఘ సంస్కరణలు తలపెట్టి ప్రజల్ని చైతన్యవంతులుగా చేస్తాడేమోననే భయం వారిలో ఎక్కువగా ఉండేది. భారతీయులు సాంఘీకంగా గానీ, రాజకీయంగా గానీ విజ్ఞానపరంగా గానీ చైతన్యవంతులుకావటం వారి కిష్టంలేదు. హిందూ స్త్రీలకు ”సతి” దురాచారం ద్వారా అన్యాయం జరుగకుండా కాపాడటమే కాకుండా, స్త్రీలకు వారి తండ్రి, భర్తల ఆస్తిలో హక్కు ఉండాలని కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి రామ మోహన రాయే.

 1823లో ”హిందూ స్త్రీల హక్కులపై దురాక్రమణ” అనే గ్రంధం కూడా రాసి సంచలనం సృష్టించాడు. రాయ్‌ సంఘ సంస్కర్తగా తన విధి నిర్వహణలో అష్టావధానం చేశాడు.ఔ

 విద్య, సంగీతం, సాహిత్యం, రాజకీయం, విశ్వమత ప్రచారం, ప్రజల ప్రతినిధిగా, మూఢ విశ్వాసాలను ఖండించే వ్యక్తిగా అనేక రంగాలలో కృషి చేశాడు. రాయ్‌ బెంగాలీ బాషలో ”బెంగాలీ భాషా వ్యాకరణం” రాశాడు. దాన్ని 1833లో కలకత్తాలో ప్రచురించారు. అనంతరం పాఠశాలలో పాఠ్యయగ్రంథంగా ప్రవేశపెట్టడం జరిగింది. మతానికి సంబంధించిన అనేక గీతాలు రాశాడు. ఆ రోజుల్లోనే పత్రికా రంగానికి ఎంతో చేయూతనిచ్చిన ఘనత కూడా రాయ్‌ కే దక్కింది. కలకత్తాలో ప్రారంభమరున తొలి పత్రిక బెంగాల్‌ గెజెట్‌ను 1916 నుండి 1920 దాకా రాయ్‌ శిష్యులే నిర్వహించారు.

కాలక్రమాన రాయ్‌ సంఘ సంస్కరణ కార్యక్రమాల్ని పరిశీలించిన ఢిల్లీ పాలకులు తమ తరపున, బ్రిటీష్‌ ప్రభుత్వంతో పనిచేయమని కోరారు. ఢిల్లీ చక్రవర్తి తరపున ప్రాతినిధ్యం వహిస్తూ అనేకపర్యాయాలు ఇంగ్లాండువెళ్ళి రాజుకి, బ్రిటీషు ప్రభుత్వానికి ఉన్న విభేదాలను తొలగించడానికి ఎంతో కృషి చేశారు. ఆయన చొరవకు, విజ్ఞానానికి, తెలివితేటలకు, సమయస్ఫూర్తికి, స్వామి భక్తికి బ్రిటీషు వారు కూడా విస్తుపోయారు.

ఢిల్లీ చక్రవర్తి ఆయన సేవలకు మెచ్చి రాజా అనే బిరుదు నిచ్చాడు. అప్పటి నుండి ఆయన రాజా రామమోహన్‌ రాయ్‌ అయ్యాడు.

 ఆ రోజుల్లో ఆయనను, ఆయన భావాలను అర్ధం చేసుకున్నవారు చాలా తక్కువ. చాలామంది ప్రజలు ఆయనను కఠినంగా తిరస్కరించారు.  రాజా రామమోహన్‌ రాయ్‌ ఆశయసిద్ది కొరకు చివరి వరకు పోరాడారు. 1833 సెప్టెంబర్‌ 27న రాయ్‌ స్వర్గస్థుడయ్యాడు.

 రాజారామమోహన్‌ రాయ్‌ జీవించి వుండగా తన ఆశయాలను ఆచరణ రూపంలో చూడలేకపోరునా ఆయన తదనంతరం ప్రజలే వాటిలోని సత్యాన్ని గ్రహించి ఆయననుయుగకర్తగా కీర్తించి, ఆయన అడుగు జాడలలో నడుచుకుంటున్నారు.

0 Response to "మూఢ నమ్మకాలపై గొంతెత్తిన రాజారామమోహన్‌ రాయ్‌...క్లుప్తంగా ఆయన గురించి....కె కె వి నాయుడు."

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • 1.క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు:"యేసు ఎవరు?"
    "యేసు పట్ల గల "మీ విశ్వాసం" ఏమిటి? అని మిమ్మల్ని ప్రశ్నిస్తే... " యేసును నేను దేవుని "గా విశ్వసిస్తున్నాను...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • పుస్తక పఠనం వలన ప్రయోజనాలు ఎన్నో!
    ఒ కప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య,సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి.చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు జరిగేవి.క...
  • క్రైస్తవపండితుల అపార్థాలు-బైబిల్ గ్రంధ యధార్థాలు
    నేటి క్రైస్తవ ధర్మం అంతా కల్పిత బోధనలతో నిండిపోయింది.నేటి చర్చి పాదర్ల బోధనలకు,బైబిల్ ఉపదేశాలకు సారూప్యమే లేదు.మానవుడు ముక్తి పొందాలంటే కల్...
  • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం.
                                                                                                Next Page పై పుస్తకం త్వరలో విడుదల కానుం...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • వేద శాస్త్రాల ప్రకారం మాంసాహారం నిషిద్దమా?
     నేడు గోవధ నిషేదం ఒక రాజకీయ నినాధం తప్ప వేద నిషేధం కాదు.ఆనాడు ఆర్యులు కాని,వేద అనుచరులుగాని మాంసాహారులే.వారు చేసే యజ్ఞాలకు ఎన్నో అశ్వాలు,...
  • కొంతమంది ప్రముఖ బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల అపార్ధం!
    ఈమధ్యకాలంలో కొంతమంది బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల విపరీతమైన అపార్ధం చేసుకుని తమ,తమ బ్లాగులలో పరోక్షంగా పోస్టులు వ్రాయడం ప్రా...

Recent Comments

Blog Archive

  • ►  2024 (2)
    • ►  July (2)
  • ►  2021 (1)
    • ►  April (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ▼  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ▼  May (2)
      • మూఢ నమ్మకాలపై గొంతెత్తిన రాజారామమోహన్‌ రాయ్‌...క్ల...
      • మీ జీవిత లక్ష్యం మీకు తెలుసా!?
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative