Posted by Sakshyam Magazine on Friday, September 25, 2015
@ ఇంత గొప్ప అంశం పై కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన “ప్రపంచ శాంతి సందేశ కేంద్రం (UPMC)-ఏలూరు” వారికి నా ప్రత్యేక ఆభినందనలు. వారిని దేవుడు సంఘ సేవలో మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆ సర్వశక్తిగల దేవుని ప్రార్ధిస్తున్నాను.
@ “యేసు ఎవరు?” అన్న అంశం పై బైబిల్ వెలుగులో మాట్లాడటానికి తమను తాము గొప్ప స్కాలర్స్ గా భావించుకుంటున్న వారు ముందుకు రావటానికి సంకోచిస్తున్న నేపధ్యంలో బ్రదర్ ప్రభుదాస్ గారు ముందుకు రావటం ఎంతో అభినందనీయం. అంతే కాదు కార్యక్రమ నిబంధనావళిని ఏ మాత్రం ఉల్లంఘించకుండా ఎక్కడా విమర్శా ధోరణిలో వెంగ్య ధోరణిలో మాట్లాడకుండా, ఎంతో ప్రేమగా బ్రదర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
@ యేసు దేవుడని నిరూపించటానికి క్రైస్తవ వక్త బైబిల్ నుండి కొన్ని వాక్యాలు తీసి వివరించటం జరిగింది. అయితే స్వయంగా ఆ వాక్యాలను వ్రాసిన, విన్న ఆదిమ అపోస్తలులు గానీ, పౌలు గానీ నేటి సువార్తీకుల మాదిరిగా ఆనాడు “యేసు దేవుడ”ని ఎందుకు ప్రచారం చెయ్యలేదన్నది నా ప్రధాన ప్రశ్నగా నిలిచింది. దానికి ఆదిమ అపోస్తలులు గానీ, పౌలు గానీ “యేసు దేవుడ”ని ప్రచారం చేసినట్లు క్రైస్తవ వక్త బైబిల్ నుండి కనీసం ఏ ఒక్క ఆధారం చూపలేకపోయారు.
@ “యేసు ఎవరు?” అన్న అంశం పై చర్చ క్రైస్తవ-ముస్లిం వర్గాల వారి మధ్యే కాకుండా, క్రైస్తవ వర్గాల వారి మధ్య సైతం జరగాల్సి ఉంది. కారణం “యేసు ఎవరు?” అన్న దాని పై క్రైస్తవంలోనే ఎంతో గలిబిలి ఏర్పడి, నేడు సంఘం అనేక వర్గాలుగా చీలిపోయింది. కాబట్టి ఈ అంశం పై చర్చ క్రైస్తవ వర్గాల వారి మధ్య ఐక్యత కొరకూ ఎంతో అవసరం.
@ ఈ రోజు స్వార్ధ పరులైన బోధకులు సువార్తను ఒక లాభసాటి వ్యాపారంగా చేసుకున్నారు. అందుకే వారు కల్పించిన వివిధ తప్పుడు విశ్వాసాల కారణంగా ప్రజలు అనేక వర్గాలుగా చీలిపోయి దోపిడీకి గురౌతునారు. అన్నీ మత వర్గాల పరిస్థితి అలాగే ఉంది. భారత జాతి ఐక్యతకు ఇది ఎంతో ప్రమాదకరం.
@ భారత రాజ్యాంగం ఆర్టికల్ 51, E ప్రకారం జాతి జనులలో మత సామరస్యం ద్వారా సౌభ్రాతృత్వాన్ని కలిగించాల్సిన అవసరం ప్రతి పౌరునిపై ఎంతైనా ఉంది.
@కనుక పరిశుద్ధ బైబిలు గ్రంధం ప్రతిపాదించే సత్య విశ్వాసం ఏదో పరిశీలించి తెలుసుకోవటం కొరకు ఈ విధమైన ప్రేమ పూర్వక అవగాహనా వేదికలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. అది అటు ధార్మిక వర్గాల “సామరస్యానికి” ఇటు భారత జాతి “ఐక్యతకు” ఎంతో దోహదకారి కాగలదు. అందుకే తమను తాము గొప్ప బైబిలు స్కాలర్స్ గా భావించుకునే వారిని ముందుకు వచ్చి, ఇలాంటి చర్చలలో పాల్గొనవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.