Posted by Sakshyam Magazine on Saturday, December 31, 2016
జీసస్ శిలువ వేయబడలేదు................పైగా ఆయన నా తర్వాత అహ్మద్ అనే ప్రవక్త వస్తారనే శుభవార్తనూ అందజేయడం జరిగింది .
దొరికిన 15 వందల ఏళ్ళ పాత బైబిల్ చెబుతున్న నిజం. విస్మయం లో వాటికన్ చర్చ్ .
టర్కీ దేశపు మధ్యదరా ప్రాంతములో స్మగ్లర్ల పై జరిపిన దాడిలో ఈ బైబిల్ గ్రంతం దొరికింది. ఇది దాదాపు 15 వందల సం.ల క్రితం నాటిదని తేల్చారు. ఈ గ్రంథం టర్కీ లోని మ్యూజియం లో భద్రపరచబడింది.
ఈ గ్రంథం బంగారు అక్షరాలతో వ్రాయబడింది. ఇదే మొట్టమొదటి బైబిల్. దీనిని జీసస్ అనుచరుడైన బార్నబస్ వ్రాసాడు.
జీసస్ మాట్లాడిన ఆరామిక్ భాషలో ఈ బైబిల్ లిఖించబడింది.
తెహ్రాం లోని క్రైస్తవ మత పెద్దలు నిపుణులు ఇది అసలైన బైబిల్ అని తేల్చారు. తూర్పు,పస్చిమ దేశాల్లో క్రైస్తవం వ్యాపించి అడ్డదిడ్డమైన అచార వ్యవహారాలు పద్ధతులతో అవ్యవస్థితంగా నడుపడుతున్న సమయములో నిసియా కౌన్సిల్ సమావేశం జరిగింది.
రోం చక్రవర్తి కాన్స్ టాంటిన్ నాయకత్వములో ,హొసియన్ కొర్టుబా అనే బిషప్ అధ్యక్షతన తేదీ 20-5-325 సం.లో ఈ సమావేశం జరిగింది.
రాజ్య వ్యవహారాల్లో క్రైస్తవం జోక్యాన్ని దూరం చేసి,క్రైస్తవం నమ్ముతున్న ,పాటిస్తున్న అందరిలో ఏక రూపత తీసుకు కావడానికి నిసియా సమావేశం జరిగింది.
టర్కీ కి వాయువ్య ప్రాంతములో ఈ సమావేశం జరిగింది.
అప్పటినుండి క్రైస్తవ మతానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చెయ్యడం బైబిల్ ను ఒక ఆచరణాత్మక గ్రంథముగా మార్చడం ప్రారంభమయింది.
కొత్త కొత్త నిబందనలను చేర్చుతూ పాత వాటిని మార్చుతూ వచ్చారు.
ఈ సమావేశం తర్వాత బైబిల్ రూపు మారుతూ వచ్చింది.
క్రైస్తవ పరిశీలకులూ,పండితులూ,నిపుణుల అభిప్రాయం మేరకు అసలైన బైబిల్ కు,ఇప్పటి బైబిల్ కు పోలికలే లేవు.
బార్నబస్ సువార్తలు తొలగించి, మత్తయ్,మార్క్,ల్యూక్,జాన్ సువార్తలు చేర్చారు.
జోర్దాన్ లో దొరికిన డెడ్ సీ(మృత సముద్రం)రెల్లు కాగితపు చుట్టలు,గ్నాస్టిక్ సువార్తల కంటే ఇది ప్రామాణికమైన బైబిల్ అని,
భిన్నమైనదని వాటికన్ అంటున్నది.
ఈ పురాతన బైబిల్ లో బార్నబస్ సువార్తల ప్రకారం జీసస్ కు శిలువ వేయబడలేదు.
జీసస్ బదులు"జుడాస్ ఇస్కారియెట్" అనే వ్యక్తిని శిలువకు ఎక్కించారని,జీసస్ దేవదూతలతో తీసుకొని పోబడ్డాడని వ్రాయబడింది.
జీసస్ ఒక ప్రవక్త మాత్రమేనని వ్రాయబడింది.
జీసస్ దేవుడు అని గాని, దేవుని కుమారుడని గానీ ఎక్కడా పేర్కొనబడలేదు.
అంతేకాదు తన తర్వాత అహ్మద్ అనబడే ప్రవక్త వస్తారని జీసస్ స్వయంగా చెప్పినట్టు కూడా పేర్కొన బడింది.