Posted by Sakshyam Magazine on Thursday, April 9, 2020
#వైరస్ వ్యాపించినప్పుడు ప్రవక్త ముహమ్మద్(స) చెప్పిందేమిటి?
1). #క్వారంటైన్ (QUARANTINE) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం:
“మీరు ‘సింహాన్ని చూసి దూరంగా జరిగిపోయినట్టు అంటువ్యాధి ఉన్న వ్యక్తి నుండి దూరమైపోండి” - [Sahih Bukhari 5707]
-----------------------------------
2) #సామాజిక_దూరం (SOCIAL DISTANCING) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం:
“ఎవరైతే అంటువ్యాధి కలిగి ఉన్నారో వారి నుండి ఆరోగ్య వంతులైన వ్యక్తులు దూరం పాటించాలి” - [Sahih Bukhaari 5774]
-----------------------------------
3) #ప్రయాణాలు_చెయ్యకూడదు (TRAVEL BAN) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం:
“ఏదైనా ప్రదేశంలో అంటు వ్యాధి ప్రబలినట్టు వింటే మీరు అక్కడకు వెళ్ళకండి; ఒకవేళ మీరున్న ప్రాంతంలో అంటు వ్యాధి ప్రబలినట్టైతే మీ ఉండే ప్రదేశాన్ని వదిలి పెట్టి వెళ్ళకండి” - [Bukhaari 3473]
-----------------------------------
4) #ఇతరులకు_హాని_కలిగించకూడదు” (DON'T HARM OTHERS) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం:
“ఎవరైతే ఇతరులకు హాని తలపెడతారో, అల్లాహ్ అతనికి హాని తలపెడతాడు” -[Abu Dawood 3635]
-----------------------------------
5) #ఇంటిలో_ఉండటం (STAYING HOME) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం:
“ఎవరైతే తమనుతాము రక్షించుకోవటానికి ఇళ్లలో ఉంటారో, వారు దేవుని రక్షణలో ఉంటారు” - [Musnad Ahmed, Saheeh]
-----------------------------------
6) #అవసరమైతే_ఇల్లుకుడా_మస్జిదే:
“సమస్త భూమి మసీదుగా చెయ్యబడింది; కేవలం కాలకృత్యాలు తీర్చుకునే ప్రదేశాలు, శ్మశానాలు తప్ప” - [Tirmidhi 317]
-----------------------------------
7) #ముఖాన్ని_వస్త్రంతో_అడ్డుపెట్టుకోవటం (FACE MASKING) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం:
“ప్రవక్త ముహమ్మద్(స) తుమ్మినప్పుడు తన ముఖాన్ని వస్త్రంతో కప్పుకునేవారు లేదా మోచేతిని అడ్డుపెట్టుకునే వారు” - [Abu Dawood 5029]
-----------------------------------
8) #చేతులు_శుభ్రపరచుకోవటం (WASH HANDS) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం:
“నిత్యం శుభ్రత పాటిస్తూ ఉండటం విశ్వాసంలో సగభాగం” - [Sahih Muslim 223]
-----------------------------------
9) #ఇంటి_నిర్బంధం (HOME QUARANTINE) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం:
“దేవుని ఆదేశం లేనిదే తనకు ఏ హానీ జరగదని విశ్వసిస్తూ అంటువ్యాధి కలిగిన వ్యక్తి సహనంతో ఇంటిలోనే ఉంటాడో అలాంటి వ్యక్తి దేవుని తరఫున గొప్ప ప్రతిఫలం పొందుతాడు లేదా అమరగతి పొందుతాడు” - [Sahih Bukhari 3474]
10) #ప్రతీవ్యాధికీ_చికిత్స_ఉంది
దేవుడు చికిత్సను సృష్టించని ఎటువంటి వ్యాధీ లేదు - [Al-Bukhari, Book 1, Hadith 33]
ఈ విధంగా వైరస్ వ్యాపించినప్పుడు వ్యక్తిగత భద్రత ఎలా తీసుకోవాలో, సామాజిక భద్రత ఎలా తీసుకోవాలో ఈనాడు డాక్టర్స్ చెబుతున్నదానిని 1400 సం.ల క్రితమే ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశించటం జరిగిందన్నది గమనార్హం