• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » వ్యక్తిత్వ వికాసం » *అహంకారం* మనిషిని నిలువెల్లా దహించివేస్తుంది

*అహంకారం* మనిషిని నిలువెల్లా దహించివేస్తుంది

Posted by Sakshyam Magazine on Sunday, July 14, 2024
Label: వ్యక్తిత్వ వికాసం

అహంకారం* మనిషిని నిలువెల్లా దహించివేస్తుంది

*అహంకారం* మనిషిని నిలువెల్లా దహించివేస్తుంది

 *అహంకారంతో హుంకరించడం మనిషి దౌర్బల్యం. కొద్దిపాటి విజయానికే తమంతటివారు లేరన్న అహంకారంతో కన్నుమిన్నుగానక* *ప్రవర్తించేవారు కొంతకాలం విజయపథంలో పయనించినా- ఎదురుదెబ్బ తినకమానరు.* *ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నవారే* *ఉన్నత స్థానంలో మన్ననలందుకుంటారు.* 

 *అహంకారం* 
 *ఒకసారి ఇంద్రుడు ఐరావతం మీద వందిమాగధులు జేజేలు పలుకుతుండగా, దర్పమంతా ప్రదర్శిస్తూ అమరపురికి వెడుతుంటే- దుర్వాస మహర్షి ఎదురవుతాడు. ఆయన* *మహేంద్రుడికి ఒక మాలను కానుకగా ఇచ్చి అది విజయమాల అని, అది ఇంద్రుడి మెడలో* *ఉన్నంతవరకు ఏ రాక్షసుడూ దరిదాపులకు రాడని చెబుతాడు.* 

 *అహంకారంతో మిడిసిపడుతున్న ఇంద్రుడు ఆ మాలను తీసుకుని తాను ధరించకుండా నిర్లక్ష్యంగా ఐరావతం మీదకు* *విసురుతాడు. ఐరావతం ఆ మాలను తొండంతో అందుకుని చిందరవందర చేసి కింద పడేసి కాళ్లతో తొక్కుతుంది. ఇది గమనించిన దుర్వాస మహర్షి ఇంద్రుడి పొగరుకు కోపించి, అతడి రాజ్యం* *పరాధీనమవుతుందని శపిస్తాడు. ముని శాపం ప్రభావంతో రాక్షసులు దేవలోకం ముట్టడించి మహేంద్రుణ్ని ఓడించి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తారు. ఉపేంద్రుడు శ్రీహరిని శరణువేడటం తరవాతి కథ.* 

 *సూదిమొన మోపినంత స్థలాన్ని కూడా పాండవులకివ్వనని అహంకారంతో ప్రవర్తించిన దుర్యోధనుడు చివరికి ఏమయ్యాడో అందరికీ తెలిసిందే.* 

 *దక్షుడు యాగం తలపెట్టాడు. దక్షయజ్ఞానికి దేవతలందరినీ ఆహ్వానించి, చిన్నచూపుతో తన అల్లుడైన పరమశివుడికి ఆహ్వానం పంపడు. అయినా భర్త అనుమతితో పుట్టింటికి వెళ్తుంది జగన్మాత. కూతుర్ని ఆదరించక అహంకారంతో పరమశివుణ్ని నిందిస్తాడు దక్షుడు. తన భర్తను తూలనాడిన తండ్రిపై ఆగ్రహించిన సతీదేవి హోమగుండంలో తనువు చాలిస్తుంది. విషయం తెలిసిన పరమేశ్వరుడు* *ప్రళయతాండవం చేస్తూ- తన జటాజూటంలోని ఒక జట పెరికి నేల పైకి విసురుతాడు. ఆ జట నుంచి వీరభద్రుడు ఉద్భవిస్తాడు. దక్షవాటికలో ప్రవేశించిన వీరభద్రుడు దక్షుణ్ని సంహరిస్తాడు.* 

 *రావణుడి అహంకారం, హిరణ్యకశిపుడి అహంకారం వారి పతనాలకు దారితీశాయి. ఈ కథలు చదివితే అహంకారం రాక్షసాంశ అనిపిస్తుంది.* 

 *మనిషి తాను ఎందులో గొప్పవాడినని ప్రశ్నించుకోవాలి. భగవంతుడిచ్చిన గాలి, నీరు, ఆహారం, ఔషధాలను వినియోగించుకుని* *బతుకుతున్నందుకు ఆ దేవదేవుడికి కృతజ్ఞుడై ఉండాలి. భూమిలోని నిక్షేపాలు అనుభవిస్తున్నందుకు భూమాతకు రుణపడాలి. సూర్యచంద్రులు, మేఘాలు లేకపోతే మనిషి ఉనికే ప్రశ్నార్థకం. ఏ క్షణాన* *రాలిపోతాడో తెలియని మనిషి అహంకరించడం మూర్ఖత్వమే కదా!* 
 *కంటికి కనిపించని వైరస్‌ మహామేధావిననుకునే మనిషిని భయభ్రాంతుణ్ని చేసి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయగలగడం సృష్టి విచిత్రం. తనకు అతీతమైన మహాశక్తి ఈ విశ్వాన్ని నడిపిస్తోందని అర్థం చేసుకున్నప్పుడు* *అహంకారానికి తావుండదు.* 

 *భగవంతుణ్ని నమ్ముకున్నవాడు సంయమనంతో మనగలుగుతాడు. తన ఆస్తి, పదవి భగవదనుగ్రహమే అని గ్రహించగలిగినవాడు* *నిగ్రహంతో మెలగుతాడు. తన పదవిని ఇతరుల సేవకు వినియోగించగలవాడికి పదవి అలంకారమవుతుంది. మహాజ్ఞానులు తమ జ్ఞానం సరస్వతీ కటాక్షమని భావిస్తారు.* 

 *దురహంకారం దుర్జన లక్షణమని గ్రహించి* *మానవత్వంతో మనగలగడమే మనిషి కర్తవ్యం. సంతృప్తికర జీవనమే సంతోషదాయకం. తాను అందరికంటే* *గొప్పవాడినని కాక అందరిలో ఒకడిని అనుకోవడమే అసలైన జీవన విధానం!* 
"సాక్ష్యం మేగజైన్" పాఠకులకు మనవి: ఇది అహంకారం యొక్క ప్రమాదం గురించిన కథలు మాత్రమే. దీనిలో అంతవరకే తీసుకోండి. 

0 Response to "*అహంకారం* మనిషిని నిలువెల్లా దహించివేస్తుంది"

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • 1.క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు:"యేసు ఎవరు?"
    "యేసు పట్ల గల "మీ విశ్వాసం" ఏమిటి? అని మిమ్మల్ని ప్రశ్నిస్తే... " యేసును నేను దేవుని "గా విశ్వసిస్తున్నాను...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • పుస్తక పఠనం వలన ప్రయోజనాలు ఎన్నో!
    ఒ కప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య,సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి.చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు జరిగేవి.క...
  • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం.
                                                                                                Next Page పై పుస్తకం త్వరలో విడుదల కానుం...
  • క్రైస్తవపండితుల అపార్థాలు-బైబిల్ గ్రంధ యధార్థాలు
    నేటి క్రైస్తవ ధర్మం అంతా కల్పిత బోధనలతో నిండిపోయింది.నేటి చర్చి పాదర్ల బోధనలకు,బైబిల్ ఉపదేశాలకు సారూప్యమే లేదు.మానవుడు ముక్తి పొందాలంటే కల్...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • భగవద్గీత ప్రకారం దేవుని యొక్క గుణగణాలు ఏమిటి?
    ఈ క్రింది లింక్ లో ప్రముఖ ముస్లిం పండితుని యొక్క ప్రసంగాన్ని చూడవచ్చు.వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయగలరు.
  • ప్రపంచదేశాలలో ఆధ్యాత్మికతకు పుట్టినిల్లయిన భారతదేశంలో అసలైన ఆధ్యాత్మికత,సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవడానికి పాశ్చాత్య సంస్కృతే కారణమా?
    పై ప్రశ్నకు మీ విలువైన అభిప్రాయం తెలియజేయండి!

Recent Comments

Blog Archive

  • ▼  2024 (2)
    • ▼  July (2)
      • Sakshyam Magazine కు స్వాగతం
      • *అహంకారం* మనిషిని నిలువెల్లా దహించివేస్తుంది
  • ►  2021 (1)
    • ►  April (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative