Posted by Sakshyam Magazine on Tuesday, February 17, 2015
1.యెహోవావెలుగు,యేసూవెలుగు కనుక యేసు దేవుడా!?
వస్త్రమువలె వెలుగును నీవు (యెహోవా) కప్పుకొని యున్నావు... -కీర్తనలు 104:2
* యేసు వెలుగు
నేను లోకమునకు వెలుగును... -యోహాను 8:12
పై రెండు వాక్యాలను గమనిస్తె యెహోవా వెలుగు అని అలాగే యేసు వెలుగు అని తెలుస్తోంది. దీనిని బట్టి యెహోవా మరియు యేసూ ఒక్కటే అనే తర్కం లేవదీస్తుంటారు. కనుక యేసుదేవుడు అందుకే మేము యేసును ఆరాధిస్తున్నామని తమ యేసు ఆరాధనను కొందరు సమర్ధించుకుంటూ ఉంటారు. అలాంటివారికి బైబిల్ గ్రంధం యొక్క పూర్తిజ్ఞానం లేదనే చెప్పాలి. వారు ఏ తర్కం ప్రకారం యేసును దేవుడు చేశారో అదే తర్కం ప్రకారం ఈ క్రింది వాక్యాన్ని తీసుకుంటే యేసు శిష్యులు కూడా దైవాలైపోతారు.
* శిష్యులు కూడా వెలుగు!
మీరు లోకమునకు వెలుగై యున్నారు. -మత్తయి 5:14
ఈ వచనం ప్రకారం శిష్యులునూ వెలుగై ఉన్నారు. యెహోవా వెలుగు, యేసు వెలుగు కనుక యెహోవా, యేసూ ఒక్కటే అన్న తర్కమే వాస్తవమైతే - శిష్యులు కూడా వెలుగే కనుక వారిని కూడా దైవాలుగా ప్రతిష్ఠించి ఆరాధిస్తే యేసును దేవునిగా ఆరాధించేవారంతా ఒప్పుకోవాలి. ఇది తప్పు అయితె యేసు దేవుడు అన్నది కూడా తప్పే.
11. యేసు పరిపూర్ణ దేవుడా?!
క్రైస్తవ సమాజంలో విచిత్ర విశ్వాసాలు చాలా చోటు చేసుకుంటూ పోతున్నాయి. వాటిలో "యేసు పరిపూర్ణ మానవుడు! మరియు యేసు పరిపూర్ణ దేవుడు!!" అన్నది ఒకటి. ఇలాంటి మాటలను "ఫేషన్" విశ్వాసాలని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే బైబిలు గ్రంధంలో లేని యేసుగాని, యేసు శిష్యులుగాని తమ నోటితో ఉవ్వరించని విశ్వాసాలను నేడు మనం పలుకుతున్నాము. అలాంటి కాల్పనిక విశ్వాసాలను ఫేషన్ విశ్వాసాలనటం తప్పంటారా? అసలు యేసు పరిపూర్ణుడని ఎందుకు అన్నారు? దేవుడు పరిపూర్ణుడు కనుక. అయితే ఈ క్రింది వాక్యాన్ని గమనించండి.
మీ పరలోకపు తండ్రి (యెహోవా) పరిపూర్ణుడు గనుక మీరు (శిష్యులు)ను
పరిపూర్ణులుగా ఉండెదరు. -మత్తయి 5:48
యేసు ప్రకారం యేసు శిష్యులు కూడా పరిపూర్ణులుగా ఉంటారని ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది. అదీ పరలోకపు తండ్రి వలెనే! అటువంటప్పుడు పన్నెండుమంది యేసుశిష్యులు కూడా యెహోవాతో సమానమైన దైవాలైపోతారా? కాదు కదా! మరి అటువంటప్పుడు యేసు పరిపూర్ణ దేవుడెలా అవుతాడు?
111.యేసు కనికరం కలిగి ఉన్నారు కాబట్టి దేవుడా?
...మీ తండ్రి (యెహోవా) కనికరము గలవాడైయున్నట్లు మీరును కనికరము
గలవారై యుండుడి. -లూకా 6:36
యేసుకు దైవత్వాన్ని ఆపాదించినవారు దానిని నిరూపించుకోవటానికి యేసులోని కరుణాగుణాన్ని చూపిస్తుంటారు. ఆ గుణం ఆధారంగా యేసు దేవుడైపోతే మరి తండ్రిని పోలిన కరుణ శిష్యులు కలిగి ఉండాలని యేసు చెబుతున్నారు. అటువంటప్పుడు శిష్యులు యెహోవాతో సమానం అయిపోయి దైవాలైపోతారా? లేదుకదా! అటువంటప్పు యెహోవాలోని కరుణను పుణికి పుచ్చుకున్న యేసు యెహోవాతో సమానం ఎలా అయిపోతారు?
1111.యేసు విమోచకుడు కాబట్టి దేవుడా?
ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచనకుడైన సైన్యములకు
అధిపతియగు యెహోవా ఈలాగు సెలివిచ్చుచున్నాడు. -యెషయా 44:6
ఈ వాక్యం ప్రకారం సర్వసృష్టికర్త అయిన యెహోవా విమోచకుడు అలాగే యేసు కూడా విమోచకుడు. సరే యెహోవా విమోచకుడు ఇదే పోలిక యేసులో ఉన్నది కనుక యేసు దేవుడు అని చెబితే యెహోవాలోని ఇదే పోలిక ఎవనిలో ఉంటే వాడే దేవుడు అవుతాడని అర్ధమవుతుంది.
యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యులందరు ఎరుగునట్లు...-యెషయా 49:26
పై వాక్యం ప్రకారం యాకోబు విమోచకుడు. మరి అతడు కూడా యెహోవా వంటి దేవుడైపోవాలి. కదా! ఇక బైబిలు విశ్వాసిగా యాకోబును దేవునిగా అంగీకరించగలరా? ఎంతమాత్రం అలా సాధ్యం కాదు. మరి అటువంటప్పుడు యేసు, యెహోవా వంటి దేవుడెలా కాగలడు? కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. (
Next Page)