Posted by Sakshyam Magazine on Thursday, February 19, 2015
7.యెహోవా,యేసు, యేసు శిష్యులూ దైవాలేనా!?
యేసు యెహోవాతో సమానం అని నిరూపించటానికి ఎన్నెన్నో ప్రయాసలు పడుతుంటారు మన క్రైస్తవ పండితులు. నిజానికి యెహోవా- "నాకు సాటి ఎవడూ లేడు" అని తన గొప్పతనాన్ని స్పష్టంగా బైబిలులో ప్రకటిస్తున్నాడు. అలాగే యేసు -"తండ్రి నాకంటే గొప్పవాడు" అని తను యెహోవా కంటే తక్కువ కావటాన్ని ఎంతో తేటగా చెబుతున్నారు. అయినప్పటికీ పండితులు చిన్న,చిన్న పోలికను చూపి ఇదిగో దీని ప్రకారం యేసు యెహోవాతో సమానమే కదా! అని చెబుతుంటారు. అయితే ఈ క్రింది వాక్య ప్రకారం ఒక త్రిత్వం ఏర్పడుతుంది. అది ఆమోదయోగ్యం అవుతుందేమో గమనించండి.
మిమ్మల్ని (శిష్యులను) చేర్చుకొనువాడు, నన్ను (యేసును) చేర్చుకొనును.
నన్ను (యేసును) చేర్చుకొనువాడు నన్ను పంపినవాని (యెహోవాను)
చేర్చుకొనును. -మత్తయి 10:40
పై వాక్యం ప్రకారం శిష్యులే యేసు, యేసే శిష్యులు. అలాగే యేసే యెహోవా, యెహోవాయే యేసు అయిపోతున్నారు. ఇది ఒక పోలికా? లేక యథార్థమా? ఉదాహరణకు:
1.శిష్యులను చేర్చుకుంటే యేసును చేర్చుకునంట్లే అని యేసు స్వయంగా చెబితున్నారు. అంటే యేసు శిష్యులు కూడా సాక్షాత్తు అంతేనా? శక్తి, సామర్థ్యాల పరంగా స్థితి, స్థానాలు పరంగా ఏ శిష్యుడైనా ఎప్పటికైనా యేసుతో సమానం కాగలడా? ఎంతమాత్రం కాలేడు. ఇదేకదా మీ సమాధానం.
2.యేసును చేర్చుకుంటే యెహోవాను చేర్చుకున్నట్లే అని యేసు స్వయంగా చెబుతున్నారు. అంటే యెహోవా ఎంతో, సాక్షాత్తు యేసు కూడా అంతేనా? శక్తీ సామర్థ్యాల పరంగా స్థితి, స్థానాల పరంగా యేసు ఎప్పటికైనా యెహోవాతో సమానం కాగలరా? ఎంత మాత్రం కాలేరు. ఇదే కదా మీ సమాధానం.
ఒకవేళ యేసు, యెహోవాకు సమానమే అని మీరు అంటే- దానికి ముందు యేసు, యేసు శిష్యులు కూడా సమానం అని ఒప్పుకోవాలి. ఆ తరువాతే యెహోవా, యేసు సమానం అని ఒప్పుకోవాలి. యేసు, యేసు శిష్యులు ఒక్కటి కాదు అంటే యెహోవా, యేసు కూడా ఒక్కటి కాదు. ఇది ఎంతో సమంజసమైన తర్కం. మరోసారి ఆలోచించండి. ఈ తర్కాన్ని కాదంటే - యెహోవా, యేసు శిష్యులు కలిసి ఒక్కటే అనే సరికొత్త త్రిత్వం ఒకటి ఏర్పడుతుంది. అసత్య విశ్వాసాల నుండి మనలను కాపాడి, యేసు అడుగు జాడలలో ఆ దేవుడు మనందరిని నడిపించుగాక! ఆమెన్. (Next Page comming soon)
1 2 3 4 5 6 7 8 9 10