Posted by Sakshyam Magazine on Thursday, March 19, 2015
మిత్రమా ఓ ప్రియ నేస్తమా...
జయనామ సంవత్సరంలో
నీ జీవితం జయాపజయాల
ఎత్తుపల్లాలను అధిగమించే ప్రయత్నంలో...
ముక్తిమార్గం కానరాక!
మోక్ష మార్గాన్ని చేరలేక!
దైవం ఉన్నా...
వేడుకునే సమయం లేక!
ప్రాపంచిక సుఖాలలో విహరిస్తూ
దైవాన్ని విస్మరిస్తూ!
అసలైన భోగాలు కోకొల్లలుగా ఉన్నా స్వర్గలోకాన్ని మరుస్తూ!
అందుతాయో అందవో తెలియని వన్నెలకై నిరీక్షిస్తూ!
నిలకడ లేని విషయాలలో నిండి ఉంది నిరుత్సాహమే అని తెలుసుకో...
మిత్రమా ఓ ప్రియ నేస్తమా...
నేనున్నాను అని నీ ముందుకొస్తున్న
మన్మధ నామ సంవత్సరానికి నమష్కరించి ఆహ్వానం పలుకు!
ఇకనైన గత సంవత్సరం అనుభవించిన చేదు చాయలను నీపై పడనీయకు!
కరుగుతున్న జీవితపు ఖజానాలో మంచిని తప్ప చెడును చేరనీయకు!
ప్రస్తుత సమాజంలో మోక్షంతో ముడిపడి ఉన్న ప్రతి చిన్న తునకను ఒదులుకోకు...
షడ్ రుచుల సమాహారం!
ప్రతి రుచికో ప్రమాణం!
ఉగాది పండుగ తరుణం.
ముహమ్మద్ సాగర్ (మండపేట)
9348222006