Posted by Sakshyam Magazine on Thursday, March 26, 2015
నీ నుండి మనిషి తీసుకుంటున్నది రవ్వంత
నీ విషయంలో మనిషి కోల్పోయేది కొండంత!
ప్రతి రోజు ప్రతి పురుషునికి ఇంట్లోనే పరస్త్రీ దర్సనం నీ వల్ల
ప్రతి రోజు ప్రతి స్త్రీకి ప్రపంచంపై వ్యామోహమ్ నీ వల్ల!
ఆడవారికి నీ లోని ధారావాహికల ప్రేరణ
వారికి తెలియకుండానే వారు కోల్పోతున్న విచక్షణ!
యువతపై సినిమాలు,వాటి పాటల రూపంలో పడుతున్న అస్లిలతల జోరు
వారి జీవితాలపై కురుస్తున్న చెడు ప్రమాణాల హోరు!
విజ్ఞ్యాన వినోద కార్యక్రమాలతో పిల్లలు భళా
కార్టున్లలోని కర్కశ పాత్రలతో పిల్లలలో నేర కళ!
నిన్ను కనిపెట్టడం ప్రపంచం అధిరోహించిన ఇంకోమేట్టు నాడు
నీ నుండి పొందవలసిన మంచికన్నా చెడుకే ప్రాధాన్యతనిన్స్తున్న మానవలోకం నేడు!
ఓ దూరదర్శిని భూతదర్సిని... ఓ దూరదర్శిని భూతదర్సిని...
Md. Sagar (Mandapeta)