Posted by Sakshyam Magazine on Friday, August 14, 2015
బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మతాన్ని అంతమొందిచేది గాను భావిస్తున్నారు. ఇలా అర్ధం చేసుకోవడానికి కారణం కొన్ని ఆర్టికల్స్ ముస్లిం రచయితలు వ్రాయడం కావచ్చు. విజ్ఞులైన వారందరూ ఒక విషయం ఆలోచించాలి. రచయిత ఆర్టికల్ ని బట్టి మనం భావం తీసుకోవాలనా? లేక అతని మతాన్ని బట్టి భావాన్ని నిర్ణయించుకోవాలనా?
నిజానికి ఈ "సాక్ష్యం మేగజైన్"కి ఒక మతాన్ని అందలం ఎక్కించడం కోసం మరొక మతాన్ని విమర్శించే అవసరం ఏమాత్రం కలిగి లేదు. ఏ మతగ్రంధంలో నైనా సత్యాన్ని వెలికి తీసి బయట పెట్టడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది.
ఇంకా ఆయా మతావర్గాలలో నున్న చెదులకు ఆయా ధార్మిక గ్రంధాల వెలుగులోనే సత్యాసత్యాల నిర్ధారణ చేస్తుంది తప్ప వక్రీకరించవల్సిన అవసరం లేదు.
ఈ "సాక్ష్యం మేగజైన్" కి మతం అంటే ఒంటబట్టదు. కేవలం థర్మాన్ని మాత్రమే పరిగణిస్తుంది. ధర్మం దేవుడిచే నిర్మితమైనది. మతం మానవ అభిప్రాయాలతో ఏర్పరచుకున్నది. రెండిటికీ ఏ విధమైన సంబంధం లేదు.
ఈ "సాక్ష్యం" బ్లాగులోనే మీరు ఎన్నో వ్యాసాలు అన్నీ మతాల గురించి, అన్నీ ధార్మిక గ్రంధాల వెలుగులే పేర్కొనబడిన విషయం మీరు గమనించవచ్చును.
ఏదో పెద్దలు , పండితులు చెప్పారు! అందరూ చేస్తున్నారు! నలుగురిలో నారాయణ, గుంపులో గోవిందయ్య అనే రీతిలో కాకుండా శాస్త్ర పరిశీలన చేయండి. శాస్త్రానుకర్మ చేయడానికే ప్రయత్నం చేయాలి ఇదే థర్మమ్.
గతంలో ఒకాయన ఆకాశంలో దేవుడు కంపించాడని కెమెరాలో బంధించాడు. తీరా అది చూస్తే మబ్బులతో కూడిన ఒక మనిషి ఆకారం లా కన్పిస్తోంది. అది దైవదర్శనం అంటూ ఆందరూ ఆ కెమెరాలోని బొమ్మకు మొక్కారు. ఇది అజ్ఞానం కాదంటారా? ఇవే దైవ దర్శనమనుకుంటే అన్నిత్లోనూ చూడవచ్చు. కాలుతున్న మంటల్లో చూడవచ్చు. వివిధ, జంతు, పాముల రూపాలను కూడా అప్పుడప్పుడూ కనిపించడం చూడవచ్చు. ఇంకా చెట్ల ఆకృతిలో కూడా గమనించవచ్చును. కొన్ని పాండే ఫలాలలో కూడా చూడవచ్చును. ఇదంతా దైవదర్శనమా?
ఆ సృష్టికర్త ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఆయన రూపం కూడా మన దృష్టి పరిధిలో లేదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అటువంటప్పుడు ఏ రూపాలలో దేవుడుని మనం చూడగలం? ఏ రూపాన్ని ఆయనకు ఆపాదించగలం? దేనికి మొక్కగలం? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బలమైన ఆధారాలున్నాయి. దేవుడు అనుగ్రహిస్తే అవన్నీ మీ ముందుకొస్తాయి.
"దృశ్యరూప చింతన" మనిషి ఆజ్ఞానానికి నిదర్శనం, "ఏకేశ్వరోపాసనే" దైవదత్తమైనది. దయచేసి మీ శాస్త్రాలను అధ్యయనం చేయండి. పరిశీలించండి! వాస్తవాన్ని గ్రహించి ముందుకు నడవండి.తధాస్తు!!