Posted by Sakshyam Magazine on Wednesday, May 4, 2016
మానవుడు సంపూర్ణ
స్వేచ్చా జీవి!
మానవునిగా మీరు పూర్తిగా మీ ‘జన్మతః స్వేచ్చాజీవి!’. కనుక ‘స్వేచ్చ’ మీ జన్మ హక్కుగా ఉండాలి. అయితే అది మీ నుండి తస్కరించ బడకుండా
ఉండాలంటే- మీ కొరకు ఏది ‘విధి’యో మరియు ఏది ‘నిషేధ’మో మీకు స్వయంగా మీకే తెలిసి ఉండాలి. వాటి జ్ఞాన రాహిత్యమే ‘మీ స్వేచ్చ’ను ఇతరులు హరించటానికి కారణ మౌతుంది.
ఎందుకంటే- పాపం సామాన్య అమాయక ప్రజలకు వాస్తవంలో
తమ కొరకు ఏది ‘విధి’యో మరియు ఏది ‘నిషేధ’మో తెలియదు కదా! ప్రజల ఈ
బలహీనతను ఆసరాగా చేసుకొని ‘వంచకులైన కొందరు మానవులు’ తమ స్వార్థ ప్రయోజనాల కొరకు ‘అధికశాతం మానవుల’కు చెందిన ‘స్వేచ్చ’ను హరించి, ‘బానిసలు’గా చేకుంటున్నారు.
దాని కొరకు వారు ఎవరికి నచ్చిన ‘విధి’-‘నిషేధాల’ను వారు కల్పించి ఆదేశిస్తూ, ఘోరంగా వంచిస్తూ పోతున్నారు. అలాంటి వారిని
ప్రశ్నించేవారు ఎవరూ లేరు. ఈ కాల్పనిక ‘విధి’-‘నిషేధాల’ సుడిగుండం
నుండి ఎవరి సహాయమూ లేకుండా మీకు మీరుగా బయట పడగలిగే ఒక ‘గొప్ప రహస్యము’ను మేము మీకు తెలప బోతున్నాము దానిని మీరు కాస్త జాగ్రత్తగా
గమనించగలరు.
ఒకవేళ, ‘విధి’-‘నిషేధాల’ వంటివి ఏమైనా ఉంటే- అవి మీ అంతర్గత శక్తి అయిన ‘మీ స్వభావం’ వైపు నుండి ఉండాలే తప్ప మీకు బహిర్గత శక్తులైన ‘నామ కార్ధ పెద్దల’ తరఫు నుండి ఉండకూడదు. ఉదాహరణకు: ఈ మానవ లోకాన్ని మౌలికంగా నాలుగు భాగాలుగా
విభజించవచ్చు.
1. మానవాళి సాధారణ మనస్తత్వం.
2.
మానవాళి సాధారణ శరీర తత్వం.
3.
మానవాళి సామాజిక
వ్యవస్థ.
4.
మానవాళి మనుగడ సాగించే పర్యావరణ వ్యవస్థ.
5.
పై నాలుగు వ్యవస్థలలోని ప్రతి ఒక్కదానిలోనూ ప్రకృతి సిద్ధంగా రెండు
విషయాలు ఉంటాయి. వాటిలో...
1. ‘కావాలి’ అని ‘కోరుకునేవి’. వాటిని Demands అనవచ్చు.
2. ‘వద్దు’ అని ‘నిరాకరించేవి’. వాటిని Limitations అనవచ్చు.
ఉదాహరణకు: పైన
పేర్కొన్న నాలుగింటిలోని ఒక్కొక్క దానికి సంబంధించిన Demands ను మరియు Limitations ను ఈ క్రింది గమనించగలరు.
1.
మానవాళి
సాధారణ మనస్తత్వం
A.
“ఇతరులు నన్ను గౌరవించాలి!” అన్నది మానవాళి సాధారణ మనస్తత్వం సంబంధించిన Demand. కనుక ఇతరులను గౌరవించటం ‘విధి’ అవుతుంది.
B.
“ఇతరులు అగౌరవ పరిస్తే, సహించలేకపోవటం” అన్నది మానవాళి సాధారణ మనస్తత్వం సంబంధించిన Limitation. కనుక ఇతరులను అగౌరవపరచటం
‘నిషేధం’ అవుతుంది.
2. మానవాళి సాధారణ శరీర
తత్వం
A.
పాలూ, పెరుగూ వంటి పానియాలు శారీరక ఆరోగ్యాన్ని ‘బాగు’ చేస్తాయి.
అవి మానవాళి సాధారణ శరీర తత్వం సంబంధించిన Demands. కనుక వాటిని
తీసుకోవటం ‘విధి’ అవుతుంది.
B.
సారా, మద్యపానం వంటి పానియాలు శారీరక
ఆరోగ్యాన్ని ‘పాడు’ చేస్తాయి. అవి మానవాళి సాధారణ శరీర
తత్వం సంబంధించిన Limitations. కనుక వాటిని తీసుకోవటం ‘నిషేధం’ అవుతుంది.
3. మానవాళి సామాజిక
వ్యవస్థ
A.
ఒక సమాజంలో ఉన్నప్పుడు ఇతరులకు ‘సహాయం’ చేయాలి. ఇది సామాజిక వ్యవస్థకు సంబంధించిన Demand. కనుక దానిని
పాటించటం ‘విధి’ అవుతుంది.
B.
ఒక సమాజంలో ఉన్నప్పుడు ఇతరులకు ‘హాని’ చేయకూడదు. ఇది సామాజిక వ్యవస్థకు సంబంధించిన Limitation. కనుక దానిని
పాటించటం ‘నిషేధం’ అవుతుంది.
4. మానవాళి మనుగడ సాగించే పర్యావరణ వ్యవస్థ
మన భూమి కంటే ఎంతో గొప్ప గొప్ప గ్రహాలు
అనేకం ఉన్నాయి. అయినప్పటికీ, మనం అక్కడ జీవించలేము. కారణం ఏమిటంటే- అక్కడ పపర్యావరణ వ్యవస్థ లేదు కనుక! అంటే- తగువిధమైన పరియావరణ వ్యవస్థ లేకపోతే మానవమనుగడ అసాధ్యం.
A. ‘పర్యావరణ
వ్యవస్థ’ను కాపాడే పనులు ‘చేయాలి’. అవి పర్యావరణ వ్యవస్థకు సంబంధించిన
Demand. కనుక దానిని పాటించటం ‘విధి’ అవుతుంది.
B. ‘పర్యావరణ
వ్యవస్థ’ను పాడు చేసే పనులు ‘చేయకూడదు’.
అవి పపర్యావరణ వ్యవస్థకు సంబంధించిన Limitations. కనుక వాటిని
పాటించటం ‘నిషేధం’ అవుతుంది.
పై ‘ఫార్మూలా’ను కనుక కాస్త
జాగ్రత్తగా అర్థం చేసుకుంటే- మీరు మీ నిత్య జీవితంలో ఎవరైనా ఏదైన ‘చెయ్యండి!’ అని మ్మల్ని
ఆదేశించినా లేక ఏదైనా ‘చెయ్య వద్దు!’ అని మీకు
ఆజ్ఞాపించినా అందులో ‘అతని
స్వార్థం’ ఉందా? లేక ‘మీ క్షేమం’ ఉందా? అన్నది మీకు
ఇట్టే అర్థం అయిపోతుంది.
ఈ ‘ఫార్మూలా’ను ప్రయోగించి కేవలం మీ సాధారణ స్నేహితుల సలహాల లేక మీ అధికారుల ఆదేశాల ‘వాస్తవికత’నే కాక, రాజకీయ నాయకుల
వాక్దానాలలో దాగి ఉండే ‘వంచన’ను కూడా కనిపెట్టగలరు. చివరకు ధార్మిక గ్రంథల ధార్మిక
ప్రవక్తల ప్రబోధనల ‘యథార్థత’నూ దాని ద్వారా
కనిపెట్టవచ్చు!
ఈ విధంగా చేయటం
ద్వారా మాత్రమే మీరు ఇతరుల ‘బానిసత్వం’ నుండి బయటపడి, ‘సంపూర్ణ స్వేచ్చ’ను పొంది, ‘మీరు
మీరుగా ఉండటం’ (Being Yourself) అన్నది మీకు
సుసాధ్యం అవుతుంది. “మానవునిగా మీరు పూర్తిగా మీ ‘జన్మతః స్వేచ్చాజీవి!’. కనుక ఎల్లప్పుడూ ‘స్వేచ్చ’ మీ జన్మ హక్కుగా ఉండాలి!” అన్నదే మా వాదన.
M. A. AbhilAsh
96664 88877
e-mail: tmcnewstmc@gmail.com