• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » Vedas » వాస్తు సిద్ధాంతం వాస్తవమా? కల్పితమా?

వాస్తు సిద్ధాంతం వాస్తవమా? కల్పితమా?

Posted by Sakshyam Magazine on Friday, May 27, 2016
Label: Vedas

మన పూర్వీకులు చాలా గొప్పవారు.వారు ప్రవేశ పెట్టిన అనేక అంశాలు నేటికీ ఎంతో ప్రయోజనాన్ని కలిగియున్నాయి. నిజమైన సైన్సు అందులో దాగి యుండేది. కానీ నేడు పూర్వీకులు ప్రవేశపెట్టిన ఆ పద్ధతులలో కల్పితాలు విపరీతంగా చోటుచేసుకుని పూర్వీకుల పద్ధతులను సమూల నాశనాన్ని చేసి వేస్తున్నాయి. కలుపు మొక్క పుట్టి వరిపైరును మింగేసినట్లుగా కల్పితాలు వచ్చి వాస్తవాలను మరుగున పడేశాయి. దాని కారణంగా పూర్వీకులు అసలు పద్ధతులన్నీ ప్రాచుర్యాన్ని కోల్పోయి పతన స్థితికి చేరిపోయాయి.

    అటువంటి వాటిల్లో "వాస్తు సిద్ధాంతం" అనేది ఒకటినిజానికి పూర్వీకులు ప్రవేశ పెట్టిన "వాస్తు"లో ఎంతో సైన్సు దాగియుంది. మానవాళికి ప్రయోజనముంది.కానీ నేటి వాస్తు సిద్ధాంతం పూర్తిగా కమర్షియల్ అయ్యిపోయింది. ధనార్జనే ధ్యేయంగా మారిపోయింది. దీని కారణంగా కల్పిత సిద్ధాంతాలను ప్రవేశ పెట్టబడి అనేక మండి అమాయకులను మోసం చేసి దోచుకునే విధంగా వాస్తు మారిపోయింది. పూర్వీకుల భావాలు ,ఉద్దేశ్యాలు కనుమరుగయ్యిపోయాయి.
ఉదాహరణకు : వాస్తు అంటే...


     ఒక ఇంటి "గుమ్మం"ఉందంటే దానికెదురుగా కిటికీయో, వేరొక గుమ్మమో పెట్టమనేవారు పూర్వీకులు. ఎందుకంటే.. గాలి చక్కగా అటూ,ఇటూ ప్రయాణిస్తే ఇంటిలో వాళ్ళు ఆరోగ్యవంతులవుతారని. ఒకవేళ అలా పెట్టకపోతే ఐశ్వర్యం అడుగంటి పోతుందని హెచ్చరించారు. కారణమేమిటంటే స్వచ్చమైన గాలి... నివసించే ఇంటిలో ప్రవేశించించలేనప్పుడు మనిషి అనారోగ్యానికి పాలయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సైన్సు కూడా రుజువు చేసింది. మనిషి అనారోగ్యానికి గురయ్యిపోతే అతని వైద్య ఖర్చులకు ధనం ఖర్చు చేయాలి. అంటే ఇంటిలో దాచుకున్న సంపద తరుగుతున్నట్టే కదా?

      ఈశాన్యం మూల చెట్టు పెంచవద్దని అన్నారు. ఎందుకంటే మనం నీళ్ళ వాడకం ఈశాన్యం మూలనే చేస్తాం! ఆరోజుల్లో ఇప్పటిలా టైల్స్,గచ్చులు ఉండేవి కాదు కాబట్టి.. నీళ్ళ వాడకం వల్ల అక్కడ బురద ఏర్పడేది అది ఎప్పటికప్పుడు భూమిలోకి ఇంకిప్ఒవాలంటే సూర్యరస్మీ అవసరం. అలాంటప్పుడు అక్కడ చెట్టు ఆక్రమించి సూర్యరశ్మిని అడ్డుకుంటే ఆ బురద ఇంకిపోదు. మరింతగా బురద తయారవుతుంది. తరవాత ఆబురదలో అనేక క్రిమికీటకాలు చెరీ ఆ ఇంటివారిని కుట్టుట వలన చర్మ వ్యాధులు వస్తాయి. దాని వలన ఆ ఇంటివారు అనేక సమస్యలు పడాల్సి వస్తుంది. అందుకనే మన పూర్వీకులు ఈశాన్యం మూల చెట్టు పెంచితే ఇంటిలో శనిగాడు తాండవిస్తాడని చెప్పారు.

      ఇంటిలో దీపం బుద్ది వెలిగిస్తే చీపురు వేయకూడదు. అంటే ఇల్లు చిమ్మకూడదు. అని పూర్వీకులు చెప్పారు. అలా చేస్తే లక్ష్మీదేవి ఇల్లు విడిచి పోతుందని హెక్కరించారు. దీని వెనుక పూర్వీకులు ఉద్దేశ్యం ఏమిటంటే "ఆరోజుల్లో ఇప్పటిలా కాంతివంతమైన ఎలక్ట్రికల్ బల్బులు లేవు. కిరసనాయిల్ లేక నూనె పమ్మెదలు వెలిగించుకునేవారు. "దీపం ముట్టించారంటే అర్ధం చీకటి మూసిరిందని" దీపపు వెలుగు పెద్దగా ఉండదు. ఒకవేళ చీపురుతో ఇల్లు చిమ్మడం చేస్తే విలువైన వస్తువులు లేక, బంగారపు వస్తువులు ఆ ఇంటి చెత్తలో కల్సీ పోయి చెత్తకుప్ప మీదకు చేరిపోయే ప్రమాదం ఉంది. డఅని వలన ఆ ఇన్టి వారికి ధననష్టమే కదా! లక్ష్మీదేవి ఇల్లు విడిచి పోవడమంటే ఇదే! ఎందుకంటే చీకటిలో కేవలం దీపపు వెలుగులో అటువంటి చిన్న విలువైన వస్తువులను గమనించలేరు కాబట్టి మన పూర్వీకులు ఆ విధంగా తెలియజేశారు.

    ఇదే విధంగా స్త్రీ నుదుటున బొట్టు, గుమ్మానికి మావిడాకులు గడపాలకు పసుపు రాయడం, ప్రతి స్త్రీ కాళ్ళకు వారానికి ఒకసారైనా పసుపు రాసుకోవడం ఇవ్వన్నీ ఆరోగ్యానికి సంబంధించినవే వీటన్నింటిలో ప్రయోజనముంది.

   గృహిణీలు వంట పాత్రలు తోమేటప్పుడు,  బట్టలుతికేటప్పుడు, ఎక్కువుగా నీళ్ళలో ఉంటారు.పాదాలు ఎక్కువుగా నీళ్లలో తడుస్తూనే ఉన్తాయీ. ప్రతి గృహినీకి ప్రతిరోజూ తప్పనిసరిగా నిమగ్నమవ్వాల్సిన పరిస్థితి. దానివలననే పాదాలు పగిలిపోయి నీతి తెమకు ఒరిసిపోవడం జరుగుతూ ఉంటుంది. రాత్రి సమయాలలో పాదాలు మంట, నొప్పి కారణంగా నిద్ర పట్టక బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య నుండి ఉపశమనం కొరకు , సమస్యను దూరం చేయడం కొరకు వారానికి ఒకసారైనా పసుపు రాయడం స్త్రీ లక్షణమని పూర్వీకులు చెప్పారు. ఎందుకంటే పసుపును మించిన యాంటీ బయోటిక్ ఏదీలేదు.

   అందుకనే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా తెల్లవారు జామున పసుపున కలిపిన ఒక చెంబుడు నీళ్ళు (ఇంచుమించు లీటరు) త్రాగుతానని , ఆరోగ్యంగా హుషారుగా ఉంటానని ఒక సందర్భంలో తెలియజేశాడు కూడా!

   ఇలా ఎన్నో విషయాలు మన పూర్వీకులు తెలియజేశారు. ఉపమానరీతిలో బోధించారు. కాని వాటిని పరిశీలించడం, అర్ధం చేసుకోవడం ఎవరు చేస్తున్నారు? పూర్వీకులు తెలియజేసిన వాస్తు సిద్ధాంతాలన్నీ 100% వాస్తవమైనవి. కానీ నేటి వాస్తు సిద్ధాంతాలన్నేఏ నూటికి నూరుపాళ్లు పచ్చి కల్పితాలు. వీటిని నమ్మడం అజ్ఞానం. వాస్తు సిద్ద్హాంతాలకు సొమ్ము చేల్ల్ఇంచడం అమాయకరం

   ఆ దిక్కూ, ఈ దిక్కూ అని మాయ్అమఆతాళు చెప్తారు. నిజానికి భూమి ఏ దిక్కున నిలకడగా ఉందని? మనం ప్రతిక్షణమూ అన్నీ దిక్కులకూ తిరుగుతూనే వున్నాం కదా! వాస్తు సిద్ధాంతకర్తల మాయమాటలు నమ్మి కట్టిన అందమైన కూల్చుకోవడం మూర్ఖత్వం! ఆన్ని వసతులకూ సౌకర్యవంతంగా నిర్మించుకోవడమే నిజమైన వాస్తు! ఈ మాత్రం విషయాన్ని గ్రహించగలిగితే మీరే నిజమైన వాస్తు సిద్ధాంత కర్తలు.

వీడియో ప్రసంగాల కొరకు Sakshyam T V  చూడండి 

2 Responses to "వాస్తు సిద్ధాంతం వాస్తవమా? కల్పితమా?"

  1. ZilebiMay 27, 2016 at 5:34 AM


    పిండా, కూడు :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. UnknownNovember 18, 2016 at 4:51 PM

      Inta detailga iste pinda kudu antaventi babu
      Nuv amina vaastu siddantiva anti

      Delete
      Replies
        Reply
    2. Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • 1.క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు:"యేసు ఎవరు?"
    "యేసు పట్ల గల "మీ విశ్వాసం" ఏమిటి? అని మిమ్మల్ని ప్రశ్నిస్తే... " యేసును నేను దేవుని "గా విశ్వసిస్తున్నాను...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • పుస్తక పఠనం వలన ప్రయోజనాలు ఎన్నో!
    ఒ కప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య,సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి.చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు జరిగేవి.క...
  • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం.
                                                                                                Next Page పై పుస్తకం త్వరలో విడుదల కానుం...
  • క్రైస్తవపండితుల అపార్థాలు-బైబిల్ గ్రంధ యధార్థాలు
    నేటి క్రైస్తవ ధర్మం అంతా కల్పిత బోధనలతో నిండిపోయింది.నేటి చర్చి పాదర్ల బోధనలకు,బైబిల్ ఉపదేశాలకు సారూప్యమే లేదు.మానవుడు ముక్తి పొందాలంటే కల్...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • భగవద్గీత ప్రకారం దేవుని యొక్క గుణగణాలు ఏమిటి?
    ఈ క్రింది లింక్ లో ప్రముఖ ముస్లిం పండితుని యొక్క ప్రసంగాన్ని చూడవచ్చు.వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయగలరు.
  • ప్రపంచదేశాలలో ఆధ్యాత్మికతకు పుట్టినిల్లయిన భారతదేశంలో అసలైన ఆధ్యాత్మికత,సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవడానికి పాశ్చాత్య సంస్కృతే కారణమా?
    పై ప్రశ్నకు మీ విలువైన అభిప్రాయం తెలియజేయండి!

Recent Comments

Blog Archive

  • ►  2024 (2)
    • ►  July (2)
  • ►  2021 (1)
    • ►  April (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ▼  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ▼  May (6)
      • 'ఆధునిక విద్యా వంతులు అయినప్పటికీ నేరస్థులు కావటాన...
      • వాస్తు సిద్ధాంతం వాస్తవమా? కల్పితమా?
      • ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేదే "మర్యాద"
      • Voice of Bible లో English Articles
      • విగ్రహారాధన వెనుక దాగి ఉన్న కుట్ర – కుట్ర దారులు -...
      • మా వాదన! మానవుడు సంపూర్ణ స్వేచ్చా జీవి!
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative