• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » Uncategories » క్రైస్తవపండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు-4

క్రైస్తవపండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు-4

Posted by Sakshyam Magazine on Monday, February 9, 2015

4.యేసు మహా దేవుడా?
            మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి 
            శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన 
            యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతకొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో 
            స్వస్థబుద్ధితోను, నీతిలోను, భక్తిలోను బ్రతుకు చుండవలెనని మనకు 
            బోధించుచున్నది. -తీతుకు 2:12-13
       పై వాక్యాన్ని కూడా యేసు దైవత్వాన్ని ఆపాదించడానికి ఉపయోగిస్తుంటారు. అదెలాగంటే -వాక్యంలో "మహదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత" అని స్పష్టంగా ఉంది. దీనిని బట్టి యేసును దేవుడు అనటంలో తప్పేంటి? అన్న ప్రశ్న తలెత్తుతుంది. రోమా 9:5లాగానే ఈ పైవాక్యం అనువాదలోపంతో అలా అనిపిస్తుంది.ఇది క్యాథలిక్కు బైబిల్ చూస్తే మీకే అర్ధమవుతుంది.ఈ క్రింది వాక్యాన్ని గమనించండి.
            ఇట్లు ఇహలోకంలో జీవించుచు, సర్వోన్నతుడగు మన దేవుని (యెహోవా) 
            యొక్కయు, రక్షకుడగు మన యేసుక్రీస్తు యొక్కయు... -తీతుకు 2:13
       ఈ వాక్యానికి మరియు ప్రొటెస్టెంటు బైబిల్ వాక్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించారా? అది అతి సున్నితమైన వ్యత్యాసం. అది కేవలం ఒక్క "కామా" (,)మాత్రమే! పై వాక్యాన్ని మరొక్కసారి గమనించండి. మన దేవుని యొక్కయు, రక్షకుడగు మన యేసుక్రీస్తు యొక్కయు అంటే -ఇద్దరి ప్రస్తావన చేయబడుతుందన్న మాట. ఒకటి సర్వ సృష్టికర్త అయిన దేవుని యొక్కయు మరియు యేసు క్రీస్తు యొక్కయు. అదే మీరు ఆంగ్ల బైబిల్ చూడండి. అది క్యాథలిక్కుగాని లేక ప్రొటెస్టెంట్ గాని రెండూ సమానంగానే ఉంటాయి. ఉదాహరణకు:
            Awaiting the blessed hope and appearing of the glory of our 
            reat god and saviour ?Jesus Christ; Titus2:13
        ఈ విధంగా మహాదేవునికి మరియు యేసుక్రీస్తుకును మధ్య "మరియు" అనే పదాన్ని లేక కామా (,)ను పెట్టకపోవటం వలన యేసే మహాదేవుడు అనే అర్ధం వచ్చేస్తుంది. నిజానికి ఇది ఎలాంటి పరిస్థితి అంటే...
    Kill him not,leave him మరియు Kill him,not leave him లాంటి వ్యవహారం. ఇక్క కామా స్థానభ్రంశం చెందటం వలన విడుదల పొందవలసినవాడు మరణ దండనకు గురైపోతాడు. అలాగే ఒక్క కామా లేకపోవటం వలన యెహోవా వేరు, యేసువేరు అని ప్రకటిస్తున్న పూర్తి బైబిల్ బోధ అసత్యం అయిపోతుంది. నిజానికి తీతుకు 2:13 సందర్భం ఎలాంటిదంటే ఈ క్రింది వాక్యాలను గమనించండి.
యేసు -
           నామాట విని నన్ను పంపినవాని (యెహోవా)యందు విశ్వాసముంచువాడు 
           నిత్యజీవం కలవాడు. -యోహాను 5:24
           అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను (యెహోవా)ను నీవు పంపిన క్రీస్తు యేసును
           ఎరుగటయే నిత్యజీవము..- యోహాను 17:3
         పై రెండు వాక్యాలు యేసువారి పవిత్ర అధరాలనుండి వెలువడినవి. వాటి ద్వారా తెలిసేదేమిటి? నిత్యజీవం పొందగోరువారు- ఒకటి యెహోవాను నమ్మాలి మరియు రెండు యేసునూ నమ్మాలి అని స్పష్టం అవుతుంది. ఇది యేసు ప్రకటించిన విశ్వాసం మరి యేసు శిష్యుల విశ్వాసం ఏమిటి? గమనించండి.
పేతురు -
           దేవుని (యెహోవా)గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన
           అనుభవజ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.
                                                                                            2పేతురు 1:3-4
యాకోబు -
           దేవుని (యెహోవా)యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన 
           యాకోబు అన్యదేశముయందు చెదరియున్న పండ్రేండు గోత్రముల వారికి 
           శుభమని చెప్పి వ్రాయునది. -యాకోబు 1:1.
యూదా -
           ...తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయ
           బడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. - యూదా 1:1
యోహాను -
            ...మన సహవాసమైతే తండ్రి (యెహోవా)లో కూడాను ఆయన కుమారుడైన
           యేసుక్రీస్తులో కూడాను ఉన్నది. -1వ యోహాను 1:3
పౌలు -
           తండ్రియైన దేవుని (యెహోవా)నుండియు మన ప్రభువైన యేసుక్రీస్తు
           నుండియు మీకు కృపయు సమాధానమును కలుగునుగాక -గలతీయులకు 1:3
         పై వాక్యాలలో మాట్లాడుతున్నవారు యేసు, యేసు శిష్యులైన పేతురు, యాకోబు, యూదా, యోహాను అలాగే పౌలు. వీరంతా విభిన్న వ్యక్తులు కాని, వీరు పై వాక్యాలలో చెప్పిన మాటలలో ఒక సారూప్యత ఒక సమన్వయం ఉన్నది. అందులో - మొదటిది యెహోవా దేవుని ప్రస్తావన మరియు రెండవది యేసుక్రీస్తు ప్రస్తావన. ఈ (యోహాను 5:24,మరియు 17:3)వాక్యాలలో - యేసు, యెహోవాను దేవునిగా విశ్వసించి, తనను క్రీస్తుగా అంగీకరించి,తన బోధనలను ఆచరించిన వారికి మాత్రమే నిత్యజీవం లభిస్తుందని నొక్కి చెబుతున్నారు.
         యేసు బోధ ప్రకారమే యేసు శిష్యులందరూ నడుచుకున్న వైనం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే వారందరి బోధనలలో యెహోవాను దేవునిగా మరియు యేసును క్రీస్తుగా నమ్ముతున్నట్లు, ప్రచారం చేస్తున్నట్లు పై వాక్యాలలో ఎంటో స్పష్టంగా కనిపిస్తుంది.
         కనుక బైబిల్ గ్రంధపు పూర్తి సారాన్శాన్ని బట్టి ఒక నిర్ణయానికి రావాలేగాని ఏదో ఒక వాక్యాన్నో లేక వాక్యంలోని ఒక ముక్కనో పట్టుకుని మన తప్పుడు విశ్వాసాలను సమర్ధించుకోవటానికి ప్రయత్నించకూడదు. కనుక యధార్ధ మనస్సు కలిగి ప్రార్ధనా పూర్వకంగా వాక్య పరిశీలన చెయ్యాలి. తద్వారా సత్యమార్గం లభిస్తుంది. దాని ద్వారా ఇహలోకంలో శాంతి, పరంలో నిత్యజీవమూ ప్రాప్తిస్తుంది. తండ్రి అయిన యెహోవా తనను మాత్రమే మహాదేవునిగా నమ్మి, యేసుక్రీస్తు అడుగుజాడలలో నడిచే సద్బుద్ధిని ప్రసాదించుగాక.ఆమెన్. (Next Page)
   1         2      3        4          5          6         7        8          9        10   

1 Response to "క్రైస్తవపండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు-4"

  1. Juda Lion TribeSeptember 9, 2015 at 6:32 PM

    https://www.youtube.com/watch?v=-__UM5jQfG0&feature=youtube_gdata_player

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • 1.క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు:"యేసు ఎవరు?"
    "యేసు పట్ల గల "మీ విశ్వాసం" ఏమిటి? అని మిమ్మల్ని ప్రశ్నిస్తే... " యేసును నేను దేవుని "గా విశ్వసిస్తున్నాను...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • పుస్తక పఠనం వలన ప్రయోజనాలు ఎన్నో!
    ఒ కప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య,సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి.చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు జరిగేవి.క...
  • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం.
                                                                                                Next Page పై పుస్తకం త్వరలో విడుదల కానుం...
  • క్రైస్తవపండితుల అపార్థాలు-బైబిల్ గ్రంధ యధార్థాలు
    నేటి క్రైస్తవ ధర్మం అంతా కల్పిత బోధనలతో నిండిపోయింది.నేటి చర్చి పాదర్ల బోధనలకు,బైబిల్ ఉపదేశాలకు సారూప్యమే లేదు.మానవుడు ముక్తి పొందాలంటే కల్...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • భగవద్గీత ప్రకారం దేవుని యొక్క గుణగణాలు ఏమిటి?
    ఈ క్రింది లింక్ లో ప్రముఖ ముస్లిం పండితుని యొక్క ప్రసంగాన్ని చూడవచ్చు.వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయగలరు.
  • ప్రపంచదేశాలలో ఆధ్యాత్మికతకు పుట్టినిల్లయిన భారతదేశంలో అసలైన ఆధ్యాత్మికత,సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవడానికి పాశ్చాత్య సంస్కృతే కారణమా?
    పై ప్రశ్నకు మీ విలువైన అభిప్రాయం తెలియజేయండి!

Recent Comments

Blog Archive

  • ►  2024 (2)
    • ►  July (2)
  • ►  2021 (1)
    • ►  April (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ▼  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ▼  February (14)
      • మన భారతదేశం గొప్ప పుణ్యభూమి.
      • నిత్య జీవానికి బలి అవసరమా? Part-3
      • నిత్య జీవానికి బలి అవసరమా? Part-2
      • నిత్య జీవానికి బలి అవసరమా? Part-1
      • క్రైస్తవపండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు-7
      • సమాజ సంస్కరణ ఎలా సాధ్యం? - 2
      • సమాజ సంస్కరణ ఎలా సాధ్యం? - 1
      • క్రైస్తవపండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు-6
      • థర్మో రక్షితి రక్షిత:వీడియో ప్రసంగాలు.
      • క్రైస్తవపండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు-5
      • "MOTHER'S LOVE"
      • క్రైస్తవపండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు-4
      • క్రైస్తవపండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు-3
      • క్రైస్తవపండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు-2
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative