Posted by Sakshyam Magazine on Tuesday, August 15, 2017
ఈమధ్య ఒక ప్రముఖ బ్లాగర్ (పేరు ప్రస్తావించదలచుకోలేదు.అందరికీ తెలిసిన విషయమే) సాక్ష్యం మేగజైన్ లోని వ్యాసాలను వక్రీకరిస్తూ, ఎగతాళి చేస్తూ ఇస్లాం గురించి ఎవరో ఇస్లాం ద్రోహి వ్రాసిన కట్టుకధలనీ పట్టుకు వేలాడుతూ సాక్ష్యం మేగజైన్ ను ,దాని కంటెంట్ రచయితలలో ఒకరైన M.A.అభిలాష్ కు వార్నింగ్స్ ఇస్తూ ఖబడ్దార్, బస్తీమే సవాల్ అంటూ, సైకో అంటూ విపరీత పదజాలంతో దూషిస్తూ అనేక పోస్టులు తన బ్లాగులో పెట్టారు.
ఆయన ఏవైతే ఇస్లాం గురించి వ్రాసారో అవన్నీ కేవలం బ్రిటీష్ కల్పిత చరిత్ర అనే విషయాన్ని ఆయన గ్రహించలేకపోయారు.
మరొక విడ్డూర విషయమేమిటంటే : ఎవడో M.A. Khan గారు చెప్పిన పాయింటునే ఇదివరలో నేను "ఇస్లామిక్ టెర్రరిజం అంటూ విడిగా ఏదీ లేదు ఇస్లామే ఒక టెర్రరిస్టు మతం!ప్రతిసారీ ఐసిస్ తీవ్రవాదులు మాదే నిజమైన ఇస్లాం అని ఎందుకు ప్రకటిస్తున్నారు?" అని ప్రశ్నను సంధిస్తూ ఇస్లాం అంటేనే టెర్రరిజం అని వాదిస్తున్నారు. చదవడానికి, వినడానికి విడ్డూరంగా లేదు.
ఎవరో టెర్రరిస్ట్ గ్రూపోళ్ళు మాదే నిజమైన ఇస్లాం అంటే.. ఇస్లాం టెర్రరిస్ట్ మతమైపోతుందా? ఎవరో హిందువులో, లేక క్రైస్తావులో బాంబ్ పెట్టి పేల్చేసి మాదే నిజమైనది అంటే హిందూమతం లేక క్రైస్తవ మతాలు టెర్రరిస్ట్ మతాలు అయ్యిపోతాయా? ఈ చిన్న విషయాన్ని కూడా ఎందుకు ఆలోచించడం లేదు. ఈ బ్లాగర్ గారు "సాక్ష్యం మేగజైన్" లోని వ్యాసాలను పరిశీలించకుండానే, శాస్త్ర బద్ధంగా ఆలోచించకుండానే ఎవరో వ్రాసిన పిట్టకధలు ఉటంకిస్తూ అతి దారుణమైన విమర్శలు గుప్పిస్తున్నారు.
స్వచ్చమైన, మరుగున పడిన శాస్త్రాలు వెలుగులోకి రావాలి, వాటి స్థాపన జరగాలి అనే ఉద్దేశ్యంతో ఎంతో వ్యయ,ప్రయాసలకోర్చి ఈ బ్లాగును నడుపుతున్నాము. మా ప్రయత్నాన్ని గుర్తించకుండా మాకు ఈ వార్నింగ్లు ఇవ్వడం వలన ఉపయోగమేముంది చెప్పండి?
ప్రపంచంలో మంచీ,చెడూ శాశ్వతంగానే ఉంటాయి దేనిని నిర్మూలించలేము. అలాగే మన మతమని అనుకుంటూ ఇతర మతాలనూ నాశనం చేయలేము. అన్నిమతాలు ఆ ఒక్క భగవంతుడినే చూపిస్తాయి. ఆయననే గుర్తించి వేడుకోవాలి తప్ప మతానికో దేవుడు లేడు. ఈ విషయం గ్రహిస్తే అన్ని మతాలూ ఒక్కటే అనే భావన కలుగుతుంది. అప్పుడు మన మనస్సునుండి "అన్ని మతాలూ ఒక్కటే అనడం పెద్ద అబద్ధం" అన్న అజ్ఞానపూరిత అభిప్రాయాలు వెలువడవు.
"సాక్ష్యం మేగజైన్" అన్ని మతాలను గౌరవిస్తుంది. ఇందులో అన్ని మతాల రచయితలూ కూడా ఉన్నారు. నిజానికి ఏమతంలోనైనా ఒక విషయాన్ని ఉటంకిస్తున్నామంటే ఆవిషయం యొక్క వాస్తవ స్వరూపం తెలుసుకోవడానికి, తెలియజేయడానికి తప్ప ఆయా మతాలను విమర్శించడం కాదు. ఈరోజు ఒక క్రైస్తవ మతమే కాదు హిందూమతం, ఇస్లాం మతం కూడా ఎన్నో మూఢ నమ్మకాలతోనూ శాస్త్ర విరుద్ధ విశ్వాసాలతోనూ నిండిపోయింది. మనకు వాటిని సరిదిద్దు కోవలసిన అవసరం లేదంటారా? ఆ పనే సాక్ష్యం మేగజైన్ చేస్తోంది. మంచీ,చెడుల నుండి మంచినే వేరు చేసి చూపించే ప్రయత్నం చేస్తుంది. దయచేసి గమనించండి.
గమనిక : ఆ బ్లాగర్ పట్ల అపార గౌరవ భావాలు కలిగియున్నాము. ఆయనతో మాకు గాని, మాతో ఆయనకు గాని ఏవిధమైన విరోధాలు లేవు. కేవలం సిద్ధాంతపరమైన చిన్న అభిప్రాయ బేధం తప్ప. ఆయన "సాక్ష్యం మేగజైన్" కు గుడ్ బై చెప్పడం మా మనసులకు బాధ కలిగింది. దయచేసి మీరు పున: మన "సాక్ష్యం మేగజైన్" అభిమాన పాఠకుల్లో చేరవలసినదిగా హృదయపూర్వక ఆహ్వానం అందిస్తున్నాము. శుభం! జై హింద్!! - Sakshyam magazine Editor : K.S.Chowdary
Is your goal of achieving an Islamic world? Is it possible for you?