• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » Uncategories » థార్మిక చర్చ:1: విగ్రహారాధనకు, సనాతన వైధిక థర్మానికి సంబంధం లేదనే మేధావుల వాదనతో మీరు ఏకీభవిస్తారా?

థార్మిక చర్చ:1: విగ్రహారాధనకు, సనాతన వైధిక థర్మానికి సంబంధం లేదనే మేధావుల వాదనతో మీరు ఏకీభవిస్తారా?

Posted by Sakshyam Magazine on Tuesday, December 9, 2014

నాటి అత్యధిక హిందూ పండితులు విగ్రహారాధననేది కేవలం బయటినుంచి వచ్చిందని, నిజానికి హిందూథర్మానికి, విగ్రహారాధనకు ఏవిధమైన సంబంధం లేదని హెచ్చరించారు. తమ,తమ కాలాలలో ప్రజలను హెచ్చరించారు కూడా! స్వామి దయానందలాంటి మహనీయులు విగ్రహారాధన నరకానికి తొలి మెట్టు అనే హెచ్చరిక కూడా చేసారు. దీనికి ఏవిధమైన వేద అనుమతి లేదని ఘొషించారు. ఒకసారి గతంలో వచ్చిన టపా చూడండి. వీళ్లు ఇలా హెచ్చరించడానికి గల కారణం ఏమిటి? మీరు ఏకీభవిస్తారా?

5 Responses to "థార్మిక చర్చ:1: విగ్రహారాధనకు, సనాతన వైధిక థర్మానికి సంబంధం లేదనే మేధావుల వాదనతో మీరు ఏకీభవిస్తారా?"

  1. Sakshyam EducationDecember 11, 2014 at 12:13 AM

    విగ్రహారాధన అనేది వైధిక థర్మానికి వ్యతిరేకమైనదే! ఈరోజు సనాతనథర్మం పతనం కావడానికి ప్రధానం కారణం ఈ కల్పిత మూర్తి పూజలే! దీనిని నిరోధించిననాడే తిరిగి స్వచ్చమైన వైధిక థర్మం ఊపిరిపోసుకుంటుంది.

    ReplyDelete
    Replies
      Reply
  2. hari.S.babuMarch 16, 2017 at 1:04 PM

    1-60-త
    పరమపూరుషుఁ డొక్కఁ డాఢ్యుఁడు పాలనోద్భవ నాశముల్
    సొరిదిఁ జేయు ముకుంద పద్మజ శూలి సంజ్ఞలఁ బ్రాకృత
    స్ఫురిత సత్త్వ రజస్తమంబులఁ బొందు నందు శుభస్థితుల్
    హరి చరాచరకోటి కిచ్చు ననంత సత్త్వ నిరూఢుఁడై.

    1-61-వ.
    మఱియు నొక్క విశేషంబు గలదు; కాష్ఠంబుకంటె ధూమంబు, ధూమంబుకంటెఁ ద్రయీమయం బయిన వహ్ని యెట్లు విశేషంబగు నట్లు తమోగుణంబుకంటె రజోగుణంబు, రజోగుణంబుకంటె బ్రహ్మప్రకాశకం బగు సత్త్వగుణంబు విశిష్టం బగు; తొల్లి మునులు సత్త్వమయుం డని భగవంతు హరి నధోక్షజుం గొలిచిరి; కొందఱు సంసార మందలి మేలుకొఱకు నన్యుల సేవింతురు; మోక్షార్థు లయిన వారలు ఘోరరూపు లైన భూతపతుల విడిచి దేవతాంతర నిందసేయక శాంతులయి నారాయణ కథల యందే ప్రవర్తింతురు; కొందఱు రాజస తామసులయి సిరియు నైశ్వర్యంబును బ్రజలనుం గోరి పితృభూత ప్రజేశాదుల నారాధింతురు; మోక్ష మిచ్చుటం జేసి నారాయణుండు సేవ్యుండు; వేద యాగ యోగక్రియా జ్ఞాన తపోగతి ధర్మంబులు వాసుదేవ పరంబులు; నిర్గుణుం డయిన పరమేశ్వరుండు గలుగుచు, లేకుండుచు త్రిగుణంబుల తోడం గూడిన తన మాయచేత నింతయు సృజియించి, గుణవంతుని చందంబున నిజమాయా విలసింతంబు లయిన గుణంబులలోఁ బ్రవేశించి విజ్ఞానవిజృంభితుండై వెలుఁగు; నగ్ని యొక్కరుం డయ్యుఁ బెక్కు మ్రాఁకు లందుఁ దేజరిల్లుచుఁ బెక్కండ్రై తోఁచు తెఱంగున విశ్వాత్మకుం డైన పురుషుం డొక్కండ తనవలనం గలిగిన నిఖిల భూతంబు లందు నంతర్యామి రూపంబున దీపించు; మహాభూత సూక్ష్మేంద్రియంబులతోడం గూడి, గుణమయంబు లయిన భావంబులం దనచేత నిర్మితంబు లైన భూతంబు లందుఁ దగులు వడక తద్గుణంబు లనుభవంబు సేయుచు, లోకకర్త యైన యతండు దేవ తిర్యఙ్మనుష్యాది జాతు లందు లీల నవతరించి లోకంబుల రక్షించు" నని, మఱియు సూతుఁ డిట్లనియె.

    1-66-ఆ
    అతిరహస్యమైన హరిజన్మ కథనంబు
    మనుజుఁ డెవ్వఁ డేని మాపు రేపుఁ
    జాల భక్తితోడఁ జదివిన సంసార
    దుఃఖరాశిఁ బాసి తొలఁగిపోవు.

    TO BE CONTINUED

    ReplyDelete
    Replies
      Reply
  3. hari.S.babuMarch 16, 2017 at 1:05 PM

    CONTINUE FROM ABOVE

    1-67-వ.
    వినుం డరూపుం డయి చిదాత్మకుం డయి పరఁగు జీవునికిం బరమేశ్వరు మాయాగుణంబు లైన మహదాది రూపంబులచేత నాత్మస్థానంబుగా స్థూలశరీరంబు విరచితం బైన, గగనంబు నందుఁ బవనాశ్రిత మేఘ సమూహంబును, గాలి యందుఁ బార్థివధూళిధూసరత్వంబును నేరీతి నారీతి ద్రష్ట యగు నాత్మ యందు దృశ్యత్వంబు బుద్ధిమంతులు గానివారిచేత నారోపింపంబడు నీ స్థూలరూపంబుకంటె నదృష్టగుణం బయి యశ్రుతం బైన వస్తు వగుటం జేసి వ్యక్తంబు గాక సూక్ష్మం బై కరచరణాదులు లేక జీవునికి నొండొక రూపంబు విరచితంబై యుండు; సూక్ష్ముఁ డయిన జీవునివలన నుత్క్రాంతి గమనాగమనంబులం బునర్జన్మంబు దోఁచు; నెప్పు డీ స్థూల సూక్ష్మ రూపంబులు రెండు స్వరూప సమ్యగ్జ్ఞానంబునఁ బ్రతిషేధింపఁ బడు; నపుడ నవిద్యం జేసి యాత్మను గల్పింపంబడు ననియుం దెలియు నప్పుడు జీవుండు బ్రహ్మ దర్శనంబున కధికారి యగు; దర్శనం బన జ్ఞానైక స్వరూపంబు; విశారదుం డైన యీశ్వరునిదై క్రీడించుచు నవిద్య యనంబడుచున్న మాయ యుపరతయై యెప్పుడు దాన విద్యారూపంబునం బరిణత యగు నప్పుడు జీవోపాధి యయిన స్థూలసూక్ష్మరూపంబు దహించి జీవుడు కాష్ఠంబు లేక తేజరిల్లు వహ్ని చందంబునం దాన యుపరతుం డయి బ్రహ్మస్వరూపంబునం బొంది పరమానందంబున విరాజమానుం డగు; ఇట్లు తత్త్వజ్ఞులు సెప్పుదు" రని సూతుం డిట్లనియె.

    1-102-సీ.
    విష్ణుండు విశ్వంబు, విష్ణునికంటెను;
    వేఱేమియును లేదు విశ్వమునకు
    భవవృద్ధిలయము లా పరమేశుచే నగు;
    నీ వెఱుంగుదు గాదె నీ ముఖమున
    నెఱిఁగింప బడ్డది యేక దేశమున నీ;
    భువన భద్రమునకై పుట్టినట్టి
    హరికళాజాతుండ వని విచారింపుము, ;
    రమణతో హరిపరాక్రమము లెల్ల

    2-16-వ
    వినుము; భగవంతుండైన హరి విరాడ్విగ్రహంబు నందు భూత భవిష్యద్వర్తమానం బైన విశ్వంబు విలోక్యమానం బగు ధరణీసలిల తేజస్సమీరణ గగనాహంకార మహత్తత్వంబు లనియెడి సప్తావ రణంబుల చేత నావృతం బగు మహాండకోశం బైన శరీరంబు నందు ధారణాశ్రయం బయిన వైరాజపురుషుండు దేజరిల్లు; నమ్మ హాత్మునికిఁ బాదమూలంబు పాతాళంబు; పార్ష్ణిభాగ పాదాగ్ర భాగం బులు రసాతలంబు; గుల్ఫంబులు మహాతలంబు; జంఘలు తలాతలంబు; జానుద్వయంబు సుతలం; బూరువులు వితలాత లంబు; జఘనంబు మహీతలంబు; నాభీవివరంబు నభస్థ్సలంబు; వక్షంబు గ్రహతారకా ముఖ జ్యోతిస్సమూహ సమేతం బగు నక్షత్రలోకంబు; గ్రీవంబు మహర్లోకంబు; ముఖంబు జనలోకంబు; లలాటంబు తపోలోకంబు; శీర్షంబు సత్యలోకంబు; బాహుదం డంబు లింద్రాదులు; గర్ణంబులు దిశలు; శ్రవణేంద్రియంబు శబ్దంబు; నాసాపుటంబు లశ్వనీదేవతలు; ఘ్రాణేంద్రియంబు గంధంబు; వదనంబు వహ్ని; నేత్రంబు లంతరిక్షంబు; చక్షురింద్రి యంబు సూర్యుండు; రేయింబగళ్ళు ఱెప్పలు; భ్రూయుగ్మ విజృంభణంబు బ్రహ్మపదంబు; తాలువులు జలంబు; జిహ్వేంద్రి యంబు రసంబు; భాషణంబులు సకల వేదంబులు; దంష్ట్రలు దండధరుండు; దంతంబులు పుత్రాది స్నేహకళలు; నగవులు జనోన్మాద కరంబు లయిన మాయావిశేషంబులు; కటాక్షంబుల నంత సర్గంబులు; పెదవులు వ్రీడాలోభంబులు; స్తనంబులు ధర్మంబులు; వె న్నధర్మమార్గంబు; మేఢ్రంబు ప్రజాపతి; వృష ణంబులు మిత్రావరుణులు; జఠరంబు సముద్రంబులు; శల్య సంఘంబులు గిరులు; నాడీనివహంబులు నదులు; తనూరుహం బులు తరువులు; నిశ్వాసంబులు వాయువులు; ప్రాయంబు నిరవధికంబయిన కాలంబు; కర్మంబులు నానావిధజంతునివహ సంవృత సంసరణంబులు; శిరోజంబులు మేఘంబులు; కట్టు పుట్టంబులు సంధ్యలు; హృదయంబు ప్రధానంబు; సర్వవికారం బులకు నాశ్రయంబైన మనంబు చంద్రుండు; చిత్తంబు మహత్త త్త్వం; బహంకారంబు రుద్రుండు; నఖంబు లశ్వాశ్వత ర్యుష్ట్రగ జంబులు; కటిప్రదేశంబు పశుమృగాదులు; విచిత్రంబులైన యాలాప నైపుణ్యంబులు పక్షులు; బుద్ధి మనువు; నివాసంబు పురుషుండు; షడ్జాదులైన స్వరవిశేషంబులు గంధర్వ విద్యాధర చారణాప్సర స్సమూహంబులు; స్మృతి ప్రహ్లాదుండు; వీర్యంబు దైత్య దానవానీకంబై యుండు; మఱియు న మ్మాహావిభునకు ముఖంబు బ్రాహ్మణులును, భుజంబులు క్షత్రియులును, నూరు లు వైశ్యులును, జరణంబులు శూద్రులును, నామంబులు నానా విధంబులయిన వసురుద్రాది దేవతాభి ధానంబులును; ద్రవ్యం బులు హవిర్భాగంబులును; కర్మంబులు యజ్ఞప్రయోగంబులు నునగు; నిట్టి సర్వమయుండైన పరమేశ్వరుని విగ్రహంబు ము ముక్షువయినవాడు మనంబున ననుసంధానంబు సేయవలయు" నని వక్కాణించి వెండియు నిట్లనియె.

    2-17-క.
    హరిమయము విశ్వ మంతయు,
    హరి విశ్వమయుండు, సంశయము పనిలే దా
    హరిమయము గాని ద్రవ్యము
    పరమాణువు లేదు వంశపావన; వింటే.

    2-18-సీ.
    కలలోన జీవుండు కౌతూహలంబునఁ;
    బెక్కు దేహంబులఁ బేరువడసి
    యింద్రియంబుల వెంట నెల్లవృత్తంబులు;
    నీక్షించి మఱి తన్ను నెఱుఁగు కరణి
    నఖిలాంతరాత్మకుఁడగు పరమేశ్వరుఁ;
    డఖిల జీవుల హృదయముల నుండి
    బుద్ధి వృత్తుల నెల్ల బోద్ధ యై వీక్షించు;
    బద్ధుండు గాఁడు ప్రాభవము వలన

    2-18.1-తే.
    సత్యుఁ డానంద బహుళ విజ్ఞానమూర్తి
    యతని సేవింప నగుఁగాక, యన్యసేవఁ
    గలుగనేరవు కైవల్య గౌరవములు
    పాయ దెన్నఁడు సంసారబంధ మధిప!

    ReplyDelete
    Replies
      Reply
  4. hari.S.babuMarch 25, 2017 at 12:36 PM

    పాటకి నేనూ ఆటకి మ అక్కా అనంట్టు సుందోపసుందుల్లో ఒకడు కూనిరాగం తీస్తే మరొకడు జోడుమేళం వాయిస్తున్నాడు.

    ఈ మొత్తం వ్యాస విరచితమైన భాగవతంలో విగ్రహారాధనను వ్యతిరేకించే ఒక్క పదాన్ని అర్ధం చేకుని తిరిగి చెప్పగలరా?

    --------------------------------------------------
    2-28-వ.
    వినుము; పరమాత్మ యైన బ్రహ్మంబునకు దక్క కాల దేవ సత్త్వ రజస్తమోగుణాహంకార మహత్తత్త్వ ప్రధానంబులకుఁ బ్రభుత్వంబు లేదు; కావునం బరమాత్మ వ్యతిరిక్తంబు లేదు; దేహాదుల యం దాత్మత్వంబు విసర్జించి యన్య సౌహృదంబు మాని పూజ్యంబైన హరిపదంబుం బ్రతిక్షణంబును హృదయంబున నాలింగనంబు సేసి వైష్ణవంబైన పరమపదంబు సర్వోత్తమం బని సత్పురుషులు దెలియుదు; రివ్విధంబున విజ్ఞానదృగ్వీర్యజ్వలనంబున నిర్దగ్ధవిషయవాసనుండయి క్రమంబున నిరపేక్షత్వంబున.

    2-29-సీ.
    అంఘ్రిమూలమున మూలాధారచక్రంబుఁ;
    బీడించి ప్రాణంబు బిగియఁ బట్టి,
    నాభితలముఁ జేర్చి, నయముతో మెల్లన;
    హృత్సరోజము మీఁది కెగయఁ బట్టి,
    యటమీఁద నురమందు హత్తించి, క్రమ్మఱఁ;
    దాలు మూలమునకుఁ దఱిమి నిలిపి,
    మమతతో భ్రూయుగమధ్యంబు సేర్చి దృ;
    క్కర్ణ నాసాస్య మార్గములు మూసి,

    2-29.1-ఆ.
    యిచ్చలేని యోగి యెలమి ముహర్తార్థ
    మింద్రి యానుషంగ మింత లేక
    ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము చించి
    బ్రహ్మ మందుఁ గలయుఁ బౌరవేంద్ర!

    2-32-వ.
    మఱియునొక్క విశేషంబు గలదు; పుణ్యాతిరేకంబున బ్రహ్మలోకగతులైన వారు కల్పాంతరంబున బుణ్యతారతమ్యంబుల నధికారవిశేషంబు నొందువార లగుదురు; బ్రహ్మాది దేవతాభజనంబునం జనువారు బ్రహ్మజీవిత కాలం బెల్ల బ్రహ్మలోకంబున వసియించి ముక్తు లగుదురు; నారాయణచరణకమల భక్తి పరాయణత్వంబునం జనినవారు నిజేచ్ఛావశంబున నిరర్గళ గమనులై బ్రహ్మాండంబు భేదించి మహోన్నత వైష్ణవపదారూఢులయి తేజరిల్లుదు; రీశ్వరాధిష్ఠితంబైన ప్రకృతియంశంబున మహత్తత్త్వం బగు; మహత్తత్త్వాంశంబున నహంకారంబగు; నహంకారాంశంబున శబ్దతన్మాత్రంబగు; శబ్దతన్మాత్రాంశంబున గగనం బగు; గగనాంశంబున స్పర్శతన్మాత్రంబగు; స్పర్శతన్మాత్రాంశంబున సమీరణంబగు; సమీరణాంశంబున రూపతన్మాత్రం బగు; రూపతన్మాత్రాంశంబు వలనఁ దేజంబగు; తేజోంశంబున రసతన్మాత్రంబగు; రసతన్మాత్రాంశంబు వలన జలంబగు; జలాంశంబున గంధతన్మాత్రంబగు; గంధతన్మాత్రాంశంబునఁ బృథివియగు; వాని మేళనంబునం జతుర్దశ భువనాత్మకంబైన విరాడ్రూపంబగు; నా రూపంబునకుఁ గోటి యోజన విశాలంబైన యండకటాహంబు ప్రథమావరణంబైన పృథ్వి యగు; దీనిఁ బంచాశత్కోటి విశాలంబని కొందఱు వలుకుదు; రయ్యావరణంబు మీఁద సలిల తేజస్సమీర గగనాహంకార మహత్తత్త్వంబు లనియెడి యావరణంబులు క్రమంబున నొండొంటికి దశగుణోత్తరాధికంబులై యుండు; నట్టి యేడింటిమీఁద బ్రకృత్యావరణంబు మహావ్యాపకంబగు బ్రహ్మాండంబు భేదించి వైష్ణవ పదారోహణంబు సేయువాఁడు నిర్భయుండై మెల్లన లింగ దేహంబునఁ బృథివ్యాత్మకత్వంబు నొంది యట్టి పృథివ్యాత్మకత్వంబున ఘ్రాణంబున గంధంబును, జలాత్మకత్వంబున రసనేంద్రియంబున రసంబును, దేజోరూపకత్వంబున దర్శనంబున రూపంబును, సమీరణాత్మకత్వంబున దేహంబున స్పర్శనంబును, గగనాత్మకత్వంబున శ్రవణంబున శబ్దంబును, నతిక్రమించి భూతసూక్ష్మేంద్రియ లయస్థానంబైన యహంకారావరణంబున సంప్రాప్తుం డై యందు మనోమయంబును, దేవమయంబును నైన సాత్వికాహంకార గమనంబున మహత్తత్త్వంబు సొచ్చి గుణత్రయంబున లయించి ప్రధానంబు నొంది ప్రధానాత్మకత్వంబున దేహంబును నుపాధి పరంపరావసానంబునం బ్రకృతిం బాసి యానందమయుండై యానందంబునం బరమాత్మరూపంబైన వాసుదేవ బ్రహ్మంబునందుఁ గలయు" నని చెప్పి వెండియు నిట్లనియె.

    TO BE CONTINUED

    ReplyDelete
    Replies
      Reply
  5. hari.S.babuMarch 25, 2017 at 12:36 PM

    CONTINUED FROM ABOVE
    2-33-ఆ.
    "పరమ భాగవతులు పాటించు పథ మిది
    యీ పథమున యోగి యేఁగెనేని
    మగుడి రాఁడు వాఁడు మఱి సంశయము లేదు
    కల్పశతము లైనఁ గౌరవేంద్ర!

    2-34-వ.
    వినుము; నీ వడిగిన సద్యోముక్తియుఁ గ్రమముక్తియు ననియెడు నీ రెండు మార్గంబులు వేదగీతలందు వివరింపబడియె; వీనిం దొల్లి భగవంతుం డైన వాసుదేవుండు బ్రహ్మచేత నారాధితుండై చెప్పె; సంసార ప్రవిష్టుండైన వానికిఁ దపోయోగాదు లయిన మోక్షమార్గంబులు పెక్కులు గల; వందు భక్తిమార్గంబు కంటె సులభంబు లేదు.

    2-36-సీ.
    అఖిల భూతములందు నాత్మరూపంబున;
    నీశుండు హరి యుండు నెల్ల ప్రొద్దు
    బుద్ధ్యాది లక్షణంబులఁ గానఁబడును మ;
    హత్సేవనీయుఁ డహర్నిశంబు
    వందనీయుఁడు భక్త వత్సలుం డత్యంత;
    నియతుఁడై సతతంబు నియతబుద్ధి
    నాత్మరూపకుఁడగు హరికథామృతమును;
    గర్ణ పుటంబులఁ గాంక్ష దీరఁ

    2-36.1-తే.
    గ్రోలుచుండెడు ధన్యులు కుటిలబహుళ
    విషయ మలినీకృతాంగముల్ వేగ విడిచి
    విష్ణుదేవుని చరణారవింద యుగము
    కడకుఁ జనుదురు సిద్ధంబు కౌరవేంద్ర!

    2-37-క.
    మానుషజన్మము నొందిన
    మానవులకు లభ్యమాన మరణులకు మహా
    జ్ఞానులకుఁ జేయవలయు వి
    ధానము నిగదింపఁ బడియె ధరణీనాథా!

    2-38-వ.
    వినుము; బ్రహ్మవర్చసకాముడైన వానికి వేదవిభుండగు చతుర్ముఖుండును, నింద్రియపాటవకామునకు నింద్రుండును, బ్రజాకామునకు దక్షాది ప్రజాపతులును, భోజనకామునకు నదితియు, స్వర్గకామునకు నాదిత్యాదులును, రాజ్యకామునకు విశ్వదేవతలును, దేశప్రజాసాధనకామునకు సాధ్యులును, శ్రీకామునకు దుర్గయు, దేజస్కామునకు నగ్నియు, వసుకామునకు వసువులును, వీర్యకామునకు వీర్యప్రదులగు రుద్రులును, నాయుష్కామునకు నశ్వనీదేవతలును, బుష్టికామునకు భూమియుఁ, బ్రతిష్టాకామునకు లోకమాతలైన గగనభూదేవతలును, సౌందర్యకామునకు గంధర్వులును, గామినీకామునకు నప్సరసయైన యూర్వశియు, సర్వాధిపత్యకామునకు బ్రహ్మయుఁ, గీర్తికామునకు యజ్ఞంబులును, విత్తసంచయకామునకుం బ్రచేతసుండును, విద్యాకామునకు నుమావల్లభుండును, దాంపత్య ప్రీతికామునకు నుమాదేవియు ధర్మార్థకామునకు నుత్తమశ్లోకుండగు విష్ణువును సంతానకామునకు బితృదేవతలును, రక్షాకామునకు యక్షులును, బలకామునకు మరుద్గణంబులును, రాజత్వకామునకు మనురూపదేవతలును, శత్రుమరణకామునకు గోణపాలకుం డైన రాక్షసుండును, భోగకామునకుం జంద్రుండును, భజనీయు లగుదురు; మఱియును.


    2-39-క.
    కామింపకయును సర్వముఁ
    గామించియునైన ముక్తిఁ గామించి తగన్
    లో మించి పరమపురుషుని
    నేమించి భజించుఁ దత్త్వనిపుణుం డధిపా!
    --------------------------------------------------
    సనాతన ధరమాన్ని పాటించే ప్రతి ఒక్కడికే వ్యాసుడే పరమ గురువు!

    ఇందులో
    2-34-వ.
    వినుము; నీ వడిగిన సద్యోముక్తియుఁ గ్రమముక్తియు ననియెడు నీ రెండు మార్గంబులు వేదగీతలందు వివరింపబడియె; వీనిం దొల్లి భగవంతుం డైన వాసుదేవుండు బ్రహ్మచేత నారాధితుండై చెప్పె; సంసార ప్రవిష్టుండైన వానికిఁ దపోయోగాదు లయిన మోక్షమార్గంబులు పెక్కులు గల; వందు భక్తిమార్గంబు కంటె సులభంబు లేదు.

    అన్నచోట చెప్పిన సద్యోముక్తి,క్రాముక్తి అంతే ఏంటో చెప్పగలరా?మీకు తెలియకపోతే చాగంటివారినో మరొకరినో అడిగి అయినా తెలుసుక్కుని చెప్పండి - మీ సొత పులుముడు మాకు వద్దు!

    ఇక్కడ ఇదిగో:
    2-38-వ.
    వినుము; బ్రహ్మవర్చసకాముడైన వానికి వేదవిభుండగు చతుర్ముఖుండును, నింద్రియపాటవకామునకు నింద్రుండును, బ్రజాకామునకు దక్షాది ప్రజాపతులును, భోజనకామునకు నదితియు, స్వర్గకామునకు నాదిత్యాదులును, రాజ్యకామునకు విశ్వదేవతలును, దేశప్రజాసాధనకామునకు సాధ్యులును, శ్రీకామునకు దుర్గయు, దేజస్కామునకు నగ్నియు, వసుకామునకు వసువులును, వీర్యకామునకు వీర్యప్రదులగు రుద్రులును, నాయుష్కామునకు నశ్వనీదేవతలును, బుష్టికామునకు భూమియుఁ, బ్రతిష్టాకామునకు లోకమాతలైన గగనభూదేవతలును, సౌందర్యకామునకు గంధర్వులును, గామినీకామునకు నప్సరసయైన యూర్వశియు, సర్వాధిపత్యకామునకు బ్రహ్మయుఁ, గీర్తికామునకు యజ్ఞంబులును, విత్తసంచయకామునకుం బ్రచేతసుండును, విద్యాకామునకు నుమావల్లభుండును, దాంపత్య ప్రీతికామునకు నుమాదేవియు ధర్మార్థకామునకు నుత్తమశ్లోకుండగు విష్ణువును సంతానకామునకు బితృదేవతలును, రక్షాకామునకు యక్షులును, బలకామునకు మరుద్గణంబులును, రాజత్వకామునకు మనురూపదేవతలును, శత్రుమరణకామునకు గోణపాలకుం డైన రాక్షసుండును, భోగకామునకుం జంద్రుండును, భజనీయు లగుదురు;

    అని అంత స్పష్టంగా ఎవరు ఏ కోరికలకి అనుగునంగా ఎవరెవరిని భజిస్తారో చెప్తున్నాడు.ఇది బహుళ దేవతారాధన కాదా?మీకు హిందూమతం గురించి తెలిసినట్టు మాట్టాడే దురద తగ్గించుకోకపొతే ఇతరులు కూడా మీ మతం గురించి అదే చేస్తారు - ప్రతి చర్యకీ ప్రతిచర్య ఉంటుంది మరి!
    TIT FOR TAT!

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • 1.క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు:"యేసు ఎవరు?"
    "యేసు పట్ల గల "మీ విశ్వాసం" ఏమిటి? అని మిమ్మల్ని ప్రశ్నిస్తే... " యేసును నేను దేవుని "గా విశ్వసిస్తున్నాను...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • పుస్తక పఠనం వలన ప్రయోజనాలు ఎన్నో!
    ఒ కప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య,సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి.చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు జరిగేవి.క...
  • క్రైస్తవపండితుల అపార్థాలు-బైబిల్ గ్రంధ యధార్థాలు
    నేటి క్రైస్తవ ధర్మం అంతా కల్పిత బోధనలతో నిండిపోయింది.నేటి చర్చి పాదర్ల బోధనలకు,బైబిల్ ఉపదేశాలకు సారూప్యమే లేదు.మానవుడు ముక్తి పొందాలంటే కల్...
  • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం.
                                                                                                Next Page పై పుస్తకం త్వరలో విడుదల కానుం...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • వేద శాస్త్రాల ప్రకారం మాంసాహారం నిషిద్దమా?
     నేడు గోవధ నిషేదం ఒక రాజకీయ నినాధం తప్ప వేద నిషేధం కాదు.ఆనాడు ఆర్యులు కాని,వేద అనుచరులుగాని మాంసాహారులే.వారు చేసే యజ్ఞాలకు ఎన్నో అశ్వాలు,...
  • కొంతమంది ప్రముఖ బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల అపార్ధం!
    ఈమధ్యకాలంలో కొంతమంది బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల విపరీతమైన అపార్ధం చేసుకుని తమ,తమ బ్లాగులలో పరోక్షంగా పోస్టులు వ్రాయడం ప్రా...

Recent Comments

Blog Archive

  • ►  2024 (2)
    • ►  July (2)
  • ►  2021 (1)
    • ►  April (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ▼  2014 (105)
    • ▼  December (13)
      • గీతా శాస్త్రం వెలుగులో "సృష్టికర్త-మనశ్శాంతి" పుస్...
      • ఇహ,పర సాఫల్యానికి కావల్సింది...మతమార్పిడా? మత సంస్...
      • ముష్తాఖ్ అహ్మద్ గారి అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగం.
      • మహనీయ ముహమ్మద్(స) వారు ఇలా ప్రబోధించారు!
      • ముష్తాఖ్ అహ్మద్ గారి ప్రసంగం:వీడియో
      • నరులను ఆశ్రయించేవారు "శాపగ్రస్తులు" దేవుని హెచ్చరిక!
      • బైబిల్ ప్రకారం ధర్మశాస్త్రంలోని ప్రధాన ఆజ్ఞ ఏమిటి?
      • The Awake India ఒక చూపులో...?
      • కర్మ అంటే ఏమిటి?
      • ప్రశ్న:2: వేద శాస్త్రాలు నిషేధించే విగ్రహారాధనలో స...
      • The Awake India : ఉపాధ్యాయులకు సందేశం
      • థార్మిక చర్చ:1: విగ్రహారాధనకు, సనాతన వైధిక థర్మాని...
      • The Awake india
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative