• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » Bible Articles » పాత, క్రొత్త నిబంధనల ప్రకారం- దేవ దేవుడైన యెహావా కఠినాత్ముడా? లేక కరుణామయుడా? -8

పాత, క్రొత్త నిబంధనల ప్రకారం- దేవ దేవుడైన యెహావా కఠినాత్ముడా? లేక కరుణామయుడా? -8

Posted by Sakshyam Magazine on Wednesday, January 13, 2016
Label: Bible Articles

 పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:
యేసు సిలువపై మరణించ లేదు!-8
(పాత, క్రొత్త నిబంధనల ప్రకారం- దేవ దేవుడైన యెహావా 
 కఠినాత్ముడా? లేక కరుణామయుడా?)
గౌరవ నీయులైన పాఠక మిత్రులారా! 
గత వ్యాసం ద్వారా పాత నిబంధన ప్రకారం- నేటి అధిక శాతం క్రైస్తవ బోధకులు ప్రకటిస్తున్నట్లు దేవ దేవుడు 'ప్రాణము' మరియు 'రక్తము' ఉన్నవాటిని మాత్రమే కాక, ఆనాటి ఆర్ధిక మారకాలైన పశువులను, పిండి పదార్ధాలను, వెండి-బంగారాలను కూడా 'అర్పణ' మరియు 'బలి' అని పేర్కొనటమైనది. దీనిని బట్టి- దేవ దేవుడు పాత నిబంధన కాలంలలో కేవలం ఒక్క 'రక్తము'ను మాత్రమే పాప పరిహారానికి ప్రత్యామ్నాయంగా తీసుకునే వాడని నేటి అధికశాతం బోధకులు చేసే ప్రచారం 'పరిశుద్ధ బైబిలు గ్రంధ' ప్రబోధనలకు పూర్తిగా వ్యతిరేకమైన అబద్ధ ప్రచారమని తెలుస్తుంది. 

అలాగే పాప పరిహారానికి దేవుడు చెల్లించమన్న 'అపరాధ రుసుము' (పెనాల్టి) తన కోసం కాదు, ప్రజల కోసమే అని 'పరిశుద్ధ బైబిలు గ్రంధం' తేలియజేసిన వైనాన్నీ తెలుసుకున్నారు. దీనిని బట్టి- సర్వ మానవుల పాప పరిహారానికి యేసు 'రక్తము'ను దేవ దేవుడు 'అపరాధ రుసుము' (పెనాల్టి) తన కొరకు తీసుకున్నాడని చేసే ప్రచారమూ అబద్ధమని 'పరిశుద్ధ బైబిలు గ్రంధ' ప్రబోధన ద్వారా తెలిసింది. ఎందుకంటే- దేవ దేవుడు నిరపేక్ష పరుడు. అయన మానవులకు కావలసినవన్నీ ఇచ్చేవాడేగాని మానవుల నుండి ఏ ఒక్కటీ పుచ్చుకునే వాడు కాడు కనుక.
నేటి అధిక శాతం క్రైస్తవ బోధకుల ప్రచారాన్ని బట్టి- యెహోవా దేవుడు, పాత నిబంధన కాలంలో మానవుల పాపాలను పరిహారం చేయటానికి పశువుల 'రక్తము'ను  కోరుకున్న రాక్షసుడుగా ఇంకా అది సరిపోక, కొత్త నిబంధన కాలంలో చివరికి తన ప్రియ కుమారుని రక్తాన్ని సైతం తాగేసిన పరమ రాక్షసునిగా కనిపిస్తాడు.

పాత, క్రొత్త నిబంధనల ప్రకారం- యెహావా కఠినాత్ముడా? లేక కరుణామయుడా?  
యెహోవా దీర్ఘ శాంతుడును, కృపాతిశయుడును. -సంఖ్యాకాండము 14:17 
యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమియందైనను నీవంటి దేవుడొకడునులేడు; పూర్ణమనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై యున్నావు. -1. వ రాజులు 8:23  

వారు విధేయులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసికొనక తమ మనస్సును కఠినపరచు కొని, తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్లుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగు బాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యతలు గలవాడవును, దీర్ఘ శాంతమును బహుకృపయు గలవాడవునై యుండి వారిని విసర్జింపలేదు.-నెహెమ్యా 9:17 

అయితే నీవు మహోపకారివై యుండి, వారిని బొత్తిగా నాశనముచేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపాకనికరములుగల దేవుడవై యున్నావు. -నెహెమ్యా 9:31

 యెహోవా, నీ కృప ఆకాశము నంటుచున్నది నీ సత్య సంధత్వము అంతరిక్షము నంటుచున్నది. -కీర్తన 36:5

ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు నీకు మొఱ్ఱపెట్టు వారందరియెడల కృపాతిశయము గలవాడవు.-కీర్తన 86:5 

 ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములుగల దేవుడవు ధీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు 16. నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము నీ సేవకురాలి కుమారుని రక్షింపుము.-కీర్తన 86:15

యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తర తరములుండును.      -కీర్తన100:5
 యెహోవా (1) దయాదాక్షిణ్య పూర్ణుడు (2) (యెహోవా) దీర్ఘశాంతుడు (3) (యెహోవా) కృపాసమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు. -కీర్తన 103:8, 9

భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. -కీర్తన 103:11

 యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును.-కీర్తన 107:1
ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి యున్నాడు. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు.-కీర్తన 111:4

యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.-కీర్తన 136:1    (ఇదే విషయం మొత్తం 26 కీర్తనలలో ఉన్నది)

తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. 19. ఆయన మరల మన యందు జాలిపడును, మన దోష ములను అణచి వేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు.-మీకా 7:18, 19

ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు 13. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. -యావేలు 2:12, 13

పైన పేర్కొన్న పాత నిబంధనకు చెందిన పరిశుద్ధ వాక్యాలు దేవ దేవుడైన యెహోవాను అత్యంత కృప, సమాధానములు కలిగిన వానిగా చూపిస్తున్నాయి. కరుణావాత్సల్యములు మరియు శాంతమూర్తి అయిన యెహోవాను గురించి క్రొత్త నిబంధన ఏమంటుందో ఈ క్రింది వాక్యాలలో గమనించగలరు. 
  
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.-యోహాను 3:16 

ప్రియులారా, మనము ఒకని నొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది; ప్రేమించు  ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. 8. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు. 9. మనము ఆయన ద్వారా జీవించు నట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్ష పరచబడెను. -1. వ యోహాను 4:7-9

క్రొత్త నిబందంకు చెందిన పరిశుద్ధ వాక్యాల ప్రకారమూ పరమ తండ్రి అయిన యెహోవా అత్యంత కృప, సమాధానములు కలిగిన  దేవుడని సుస్పష్టం అయ్యింది. స్థలాభావం వలన కొన్ని వాక్యాలను మాత్రమే పెర్కొనటమైంది.  'పరిశుద్ధ బైబిలు గ్రంధం'లో ఇంకా అలాంటి వాక్యాలు వందల సంఖ్యలో ఉన్నాయి. 

గమనిక: యేసును పుట్టించి, ఈ లోకానికి పంపించటానికి గల మూల కారణం- దేవ దేవుడైన యెహోవాకు  మానవాళి పట్ల ఉన్న అపారమైన ప్రేమే కారణమని క్రొత్త నిబంధనకు చెందిన (యోహాను 3:16) పై వాక్యం తెలియజేస్తుంది. అలాగే- క్రొత్త నిబంధనకు చెందిన (1. వ యోహాను 4:8) వాక్యమైతే- 'దేవ దేవుడైన యెహోవా స్వరూపమే ప్రేమా మయం' అని ప్రకటించటం పరాకాష్ఠ! దీనిని బట్టి- పాత, క్రొత్త నిబంధనల ప్రకారం- దేవ దేవుడైన యెహావా కరుణామయుడే కాని, కఠినాత్ముడు కాడు! అని తేలిపోయింది!!


దేవ దేవుడైన యెహోవాకు చెందిన అంత గొప్ప కరుణా వాత్సల్యములను దాచి పెట్టి, మానవులు చేసే ప్రతి చిన్న పాపానికీ పశువుల 'రక్తం' త్రాగే రాక్షసునిగా ఇంకా అది సరిపోక,  చివరికి తన ప్రియ కుమారుని రక్తాన్ని సైతం తాగేసిన పరమ రాక్షసునిగా ఆయనను చిత్రించి చూపటం ఎంతటి దుర్మార్గమో ఒక్కసారి ఆలోచించగలరు! 

"ఇట్టే క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల గొప్ప ప్రేమామయుడైన యెహోవా దేవుడు మానవుల పాపాలను క్షమించటానికి యేసు 'రక్తము'ను 'అపరాధ రుసుము' (పెనాల్టి) గా కోరుకున్నాడు" అని
 నేటి అధిక శాతం క్రైస్తవ బోధకులు చేస్తున్న బోధ- 'పరిశుద్ధ బైబిలు గ్రంధ' ప్రబోధలకు 
పూర్తిగా వ్యతిరేకమైన ఒక అసత్య బోధ అని సుస్పష్టం అవుతుంది.

కనుక ప్రియ క్రైస్తవులారా! 
బైబిలు బోధలను మాత్రమే నమ్మండి! 
ఇంకా వాటికి 
అనుకూలమైన బోధనలను చేసే బోధకులనే అనుసరించండి!
ఎందుకంటే-

అయ్యో, వేష ధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల యెదుట పరలోకరాజ్యమును మూయుదురు; 14. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. 15. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరక పాత్రునిగా చేయుదురు.  -మత్తయి 23:13-15

అని యేసు హెచ్చరిస్తున్నారు. ఈనాటి అధిక శాతం బోధకులు బైబిలు చేత పట్టుకొని అదే బైబిలుకు వ్యతిరేక బోధలు చేస్తున్నారు. దానికి- ఒక బోధకుడంటే మరొక బోధకునికి ఉన్న శతృత్వం మరియు  'పిండికొలది రొట్టె' అన్నట్లు 'డబ్బు కొలది ప్రార్ధన' వంటి విధానాలే ఆధారాలు. అలాంటి అబద్ధ బోధకుల అసత్య బోధలను అనుసరిచే వారి కొరకు పరలోక రాజ్యము (అనగా స్వర్గము) మూసివేయబడుతుంది. అంతే కాదు, అలాంటి అబద్ధ బోధకులను అనుసరించటం వలన రెండింతలు నరక పాత్రులు కాక తప్పదు అని యేసు హెచ్చరిస్తున్నారు.
తస్మాత్ జాగ్రత్త! 
M. A. Abhilash 
91+96664 88877
tmcnewstmc@gmail.com
వీడియో ప్రసంగాల కొరకు Sakshyam TV చూడండి.

5 Responses to "పాత, క్రొత్త నిబంధనల ప్రకారం- దేవ దేవుడైన యెహావా కఠినాత్ముడా? లేక కరుణామయుడా? -8"

  1. yallapragada hyma kumarJanuary 14, 2016 at 7:26 PM

    సూటిగా సుత్తి లేకుండా చెప్పండే..
    మతం మార్చమని ఏసుప్రభు చెప్పారా?
    బాప్టిజం తీసుకోగానె పాపాలు పోతాయా?
    ఏసు తన రక్తంతో మానవాళి పాపాలు కడిగేసారా?
    ప్రళయం వచ్చినపుడు ఆయనను ప్రార్థిస్తున్న వారిని మాత్రమే కాపాడుతారా?

    ReplyDelete
    Replies
    1. AravindJanuary 15, 2016 at 8:37 AM

      మీరు ప్రశ్నలు అడిగే విధానం చూస్తుంటే "సాక్ష్యం మేగజైన్" వాళ్లు క్రైస్తవమతానికి ప్రచారం కలిగించే వారుగా పొరబడినట్టున్నారు. వాస్తవానికిది క్రైస్తవ మత నిరోధానికి కృషి చేస్తూ దానిలోని లోపాలను ఎత్తి చూపుతుంది.

      Delete
      Replies
        Reply
    2. Reply
  2. yallapragada hyma kumarJanuary 15, 2016 at 11:52 AM

    నిజమే చిన్న పొరపాటు.

    ReplyDelete
    Replies
      Reply
  3. UnknownJanuary 15, 2016 at 1:37 PM

    అభిలాష్ వర్యులకు సంక్రాంతి శుభాకాంక్షములు!మీరును,కుటుంబమును ఆయురారోగ్యములతో వర్ధిల్లగలగాలని భగవంతుణ్ణి వేడుకొనుచున్నాను.తమరు,తమరి అంతర్జాల పత్రికయును మరిన్ని ధర్మానుశాసనములు తెలియజేయుచు దిన,దినవర్ధాభినయం చెందవలయునని సర్వదా సర్వేశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. UnknownJanuary 15, 2016 at 9:40 PM

      గౌరవనీయులైన గోపాల్ శర్మ గారికి కృతజ్ఞతలు. మీకూ సంక్రాంతి శుభాకాంక్షలు! మిమ్మల్నీ, మీ కుటుంబ సభ్యులనూ ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ళూ కాచి, కాపాడాలని సరోన్నతుడైన ఆ సర్వేస్వరుడిని మనసారా కోరి ప్రార్ధిస్తున్నాను!

      Delete
      Replies
        Reply
    2. Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • 1.క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు:"యేసు ఎవరు?"
    "యేసు పట్ల గల "మీ విశ్వాసం" ఏమిటి? అని మిమ్మల్ని ప్రశ్నిస్తే... " యేసును నేను దేవుని "గా విశ్వసిస్తున్నాను...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • పుస్తక పఠనం వలన ప్రయోజనాలు ఎన్నో!
    ఒ కప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య,సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి.చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు జరిగేవి.క...
  • క్రైస్తవపండితుల అపార్థాలు-బైబిల్ గ్రంధ యధార్థాలు
    నేటి క్రైస్తవ ధర్మం అంతా కల్పిత బోధనలతో నిండిపోయింది.నేటి చర్చి పాదర్ల బోధనలకు,బైబిల్ ఉపదేశాలకు సారూప్యమే లేదు.మానవుడు ముక్తి పొందాలంటే కల్...
  • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం.
                                                                                                Next Page పై పుస్తకం త్వరలో విడుదల కానుం...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • వేద శాస్త్రాల ప్రకారం మాంసాహారం నిషిద్దమా?
     నేడు గోవధ నిషేదం ఒక రాజకీయ నినాధం తప్ప వేద నిషేధం కాదు.ఆనాడు ఆర్యులు కాని,వేద అనుచరులుగాని మాంసాహారులే.వారు చేసే యజ్ఞాలకు ఎన్నో అశ్వాలు,...
  • కొంతమంది ప్రముఖ బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల అపార్ధం!
    ఈమధ్యకాలంలో కొంతమంది బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల విపరీతమైన అపార్ధం చేసుకుని తమ,తమ బ్లాగులలో పరోక్షంగా పోస్టులు వ్రాయడం ప్రా...

Recent Comments

Blog Archive

  • ►  2024 (2)
    • ►  July (2)
  • ►  2021 (1)
    • ►  April (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ▼  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ▼  January (18)
      • Janana,maranaalakatheethudu (జనన మరణాలకతీతుడు)
      • 1 తిమోతీ 3:16 ప్రకారం.. పౌలు దృష్టిలో యెహోవా శరీరధ...
      • యేసు తీర్పు తీర్చును! కాబట్టి యేసు దేవుడా?
      • ఫిలిప్పీ 2:9-11 ప్రకారం “ప్రతి వాని మోకాలును యేసు ...
      • ఓ దేవా....ఉదయించే ప్రతి కిరణం నీ సందేశం
      • తీతుకు 2:13 వచనం ప్రకారం యేసు “మహా దేవుడా?
      • దేవుని పై ఆధారపడే వాడు సర్వసృష్టికర్తతో సమానమైన దే...
      • దేవ దేవుడైన యెహావాకు మనుషులు ‘మరణించుట’ ఇష్టమా? ‘జ...
      • ఇది మనుషులలో అజ్ఞానమా? మూర్ఖత్వమా?
      • ప్రియమైన "సాక్ష్యం మేగజైన్" పాఠకులకు సంక్రాంతి శుభ...
      • చాడీలు చెప్పడం,వినడం 26సార్లు వ్యభిచారం చేసిన పాపం...
      • పాత, క్రొత్త నిబంధనల ప్రకారం- దేవ దేవుడైన యెహావా క...
      • భగవద్గీత ప్రకారం దేవుని యొక్క గుణగణాలు ఏమిటి?
      • బైబిలు కోరే బలి - పశువులను తెగ నరకటమా? లేక తన సంపద...
      • పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం: యేసు సిలువపై మరణ...
      • ఈరోజు నుండి Sakshyam Publications బ్లాగ్ ప్రారంభం
      • పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం: యేసు సిలువపై మరణ...
      • M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబో...
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative