• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » ARTICLES » పరదా ముస్లిం స్త్రీ భూషణం

పరదా ముస్లిం స్త్రీ భూషణం

Posted by Sakshyam Magazine on Friday, October 14, 2016
Label: ARTICLES

హిజాబ్ అంటే రెండు వస్తువుల మధ్య పరస్పరం ఒకదానికొకటి మరుగుపరిచే వస్తువు అన్నమాట. సృష్టికర్త తన దాసులలో అందరికన్నా పవిత్ర్రులు, పుణ్యశీలురకు ఈ ఆదేశం ఇచ్చినప్పుడు ఈ పదం పారిభాషికంగా ఇస్లామీ ప్రపంచానికి పరిచయం అయింది.
''ప్రవక్త [స] భార్యలను మీరు ఏదయినా అడగవలసి ఉంటే తెరచాటున ఉండి అడగండి. ఇది మీ హృదయాల, వారి హృదయాల పరిశుద్ధత కొరకు ఎంతో సముచితమయిన పద్ధతి'' [అహ్ జాబ్ సూరా33:53]
ఈ ఆయత్ ను హిజాబ్ ఆయత్ అంటారు. ఈ ఆయత్ అవతరించిన తరువాత ప్రవక్త సతీమణులు తమ గుమ్మలకు తెరలు ఏర్పాటు చేసుకున్నారు. తరువాత వారిని చూసి ముస్లిం కుటుంబాలు కూడా ఈ పద్ధతిని పాటించారు పరదా వల్ల బయటి వారు ఇంటిలోని వారిని చూడలేరు. ఈ ఇస్లామీ సమాజ పవిత్రత కోసం ఇటువంటి మరికొన్ని ఆదేశాలు క్రమంగా అవతరించసాగాయి. వాటి ద్వారా స్త్రీ పురుషుల పరిధి సృష్టం చేయడం జరిగింది. ఇంటిలోపలి పనులు, చిన్నవారికి శిక్షణనివ్వడం, స్త్రీ యెక్క ప్రాధమిక బాధ్యత, ఇంటివెలుపలి విషయాలు చక్కబెట్టడం పురుషుని బాధ్యతగా నిర్ణయించబడింది. ఏదయినా అవసరం వచ్చినప్పుడు స్త్రీ బయటకు వెళ్లవలసి వస్తే పరదా ధరించి వెళ్లలన్న ఆంక్ష్ విధించబడింది. తద్వారా గృహకుటుంబ వ్యవస్థను పవిత్రంగా, స్థిరంగా ఉంచగలిగేందుకు, సమాజాన్ని వ్యెకల్యంనుండి రక్షించాలని. ఇందులో కుటుంబ వ్యవస్థ, పురుషుని నాయకత్వం, ఆధిక్యత, స్త్రీ పురుషుల దుస్తులు, సతర్ హద్దులు ఇంటిలోపల ఎలా వుండాలి, ఇంటి నుండి బయటికిపోవాలంటే అవలంభించవలసిన విధానం, ఆదేశాలు మహ్ రమ్ [వివాహ సంబంధం హరామ్ చెయ్యబడినవారు] నా మహ్ రమ్ [హరామ్ చేయబడిని వారి మధ్య పాటించవలసిన వ్యత్యాసం, అంతరంగ సంస్కరణ కోసం అనేక ఆదేశాలు చేరి ఉన్నాయి.
అల్లాహ్ అవతరింపజేసిన సూత్రాలు చట్టలకు కట్టుబడి వుండే ఆ కాలంలో, ఈనాటి మానవుడు ఎదుర్కొంటున్న సామాజిక, కుటుంబ సమస్యలన్నింటినుండి చాలావరకు సమాజం సురక్షితంగా ఉండేవి. అందుకు చరిత్రే సాక్ష్యం.
మరోవైపు అహంకారి అయిన మానవుడు తన సృష్టికర్త, యజమాని ఆదేశాలను ధిక్కరించి తన కోరికలకు వచ్చిన మార్గాన్ని తన కోసం ఎంచుకున్నప్పుడు అతడికి దు:ఖం, వ్యాకుల పాటు తప్ప మరేమీ దక్కలేదు. దైవప్రవక్త [స]చూపిన లజ్జా, పరదల విధానం పవిత్రత గల విధానం, నిర్లజ్జ, నీతిబాహ్యత షైతాను జాలం. దీనిలో చిక్కుకున్న కుటుంబం ఛిద్రమయిపోతుంది. సామాజిక జీవితంలో సమస్యలు పెరుగుతూ పోతాయి. ముస్లింల ఈ పతనావస్థకు కారణలేమిటో అన్వేషిద్దాం.
18వ శతాబ్ధం అంతం, 19వ శతాబ్ది ఆరంభ కాలంఅది. పాశ్చాత్య జాతులు వలసల వరద ఒక తుఫానులా ఇస్లామీ దేశాలపై విరుచుకుపడి, చూస్తుండగానే తూర్పు నుండి పడమటి వరకు ఇస్లామీ ప్రపంచమంతటా వ్యాపించింది. 19వ శతాబ్ది అర్ధభాగం చివరకు చేరుకుంటూ అధికభాగం ముస్లిం జాతులు యూరప్ కు బానిసలయ్యాయి. బానిసలుకాని రాజ్యాలు సయితం లోబడి ఆకర్షణకు గురయ్యాయి. పాశ్ఛాత్యవ్యామోహం పెరిగిపోయింది.
ఈ విప్లవం పరిసమాప్తి అయినప్పుడు ముస్లిముల కళ్ళు తెరుచుకోవడం ఆరంభమయింది. కాని ఓటమిపలయిన జాతిలో సహజంగా జనించే భయం, భావధాస్య౦ వారిలోనూ నరనరాన వ్యాపించింది. వారు తమ అణగారినతనానికి, యూరపు వారిలో అభివృద్ధికి అసలు కారణం ఏమిటో గ్రహించలేకపోయ్యారు. పైగా, తమ నెత్తికెక్కిన సమాజాన్ని పాశ్చాత్యుల మూసలో పోతపోసే ప్రయత్నం జరిగింది. ఈ కాలంలో పాశ్చాత్య వేషభాషలు, పాశ్చాత్య సమాజ పోకడలు, పాశ్చాత్య మర్యాదలు ఆచారాలు, విధానాలను అనుకరించడం రివాజుగా మారింది.
ఇస్లామీ చరిత్రలోని సంఘటనలు, ఇస్లామీ షరీఅత్ ఆదేశాలు, ఖర్ఆన్, హదీసుల వివరణలోనూ, ఇస్లాంకు పాత శత్రువులైన వారు వెలిబుచ్చే ఆక్షేపణా దృష్టితో ద్వేషం ప్రదర్శించేవారు. అదిచూసి ముస్లింలు కూడా సిగ్గుపడసాగారు. ఆ మచ్చను కడిగివేసే ప్రయత్నం చేశారు. ఇస్లాం శత్రువులు జిహాద్ ను ఆక్షేపించారు. ఆ ముస్లింలు 'అయ్యా! మేమ్ క్కడ?జిహాద్ ఎక్కడ? అంటూ విన్నవించుకున్నారు. వారు [ఆ కాలంనాటి] బానిసత్వాన్ని ఆక్షేపించారు. ముస్లింలు అది మా వద్ద ధర్మవిరుద్ద కార్యం అన్నారు. వారు బహుభార్యత్వాన్ని విమర్శించారు. వీరు వెంటనే ఖుర్ఆన్ లోని ఒక వాక్యంపై అడ్డుగీత రాశారు. వారు స్త్రీ పురుషుల మధ్య పరిపూర్ణ సమానత్వం ఉండాలన్నారు. వీరు మా మతం కూడా ఇదే అవి విన్నవించుకున్నారు? వారు నికాహ్ తాలాక్ [వివాహం, విడాకులు] చట్టాలను విమర్శించారా లేదు వీటన్నింటినీ సవరించడానికి సిద్ధపడ్డారు. వారు ఇస్లాం, ఆర్ట్ కు వ్యతిరేకం అన్నారు. వీరు ఇస్లాం ఎల్లప్పుడూ సంగీత నాట్యాలు, శిల్పాలు నాయకత్వంవహిస్తుంది అన్నారు.
ఇది ముస్లింల చరిత్రలో అతి నికృష్టకాలం. ఈ కాలంలోనే పరదా చర్చ లేవనెత్తబడింది. సిగ్గు బిడియాలకు స్వస్తి చెప్పేకాలం ఆరంభమయింది. నఖాబ్ [ముఖంపై కట్టుకునే వస్త్రం] తో పాటు సతర్ ను పాటించే వస్త్రధారణలో ఉన్న స్త్రీని, గుడారం, కఫన్ వస్త్రంలో ఉన్న జనజాగా ఎకసక్కలాడేవారు.ఈ అభాగ్యులు సిగ్గుతో కుంచించుకుపోయేవారు.ఎంతవరకని సహించగలరు. నిస్సహాయులు, సిగ్గు విడిచి సంచరించేందుకు [పరదా లేకుండా] సిద్ధపడ్డారు కాని ఈ సందర్భంగా తీవ్రమయిన మోసం ఏం జరిగిందంటే పరదా రాహిత్యాన్నిఖుర్ఆన్, హదీసులకు అనుగుణమయినదిగా నిరూపించే ప్రయత్నంజరిగింది. వాస్తవానికిఇస్లామీ వ్యవస్థలోని సమాజంలో స్త్రీ స్వేచ్ఛ్ కు ఆఖరి హద్దు ఏమంటే అవసరం ఏర్పడినప్పుడు చేతులు, ముఖం బహిరంగపరచడానికి అనుమతించబడింది. ఇంకా తన అవసరాల కోసం ఇల్లు దాటి బయటికి రావచ్చు. వీళ్ళు ఈ ఆఖరిహద్దునే తొలి మెట్టుగా చూపుతారు. ఇంకాస్తముందుకు వెళ్లి, ప్రతి సిగ్గు విడిచినతనం, నీతిబాహ్యతలు దేనిలోనైతే పాశ్చాత్య ధోరణి చేరి ఉందో, స్త్రీ స్వేచ్చ పేరట ఇస్లాం నుండి దిగుమతి చేసుకునే ప్రయత్నం చేస్తారు. అలంకరణలతో పరదా పాటించవలసిన వారి ఎదుట పరాయివారితో పాటు ఆడే, పాడే కబుర్లు చెప్పుకునే స్వేచ్చ ప్రసాదించబడుతుంది. ఇలా ఒక ముస్లిం స్త్రీ తన స్వంతసోదరుని పట్ల కూడా ప్రవర్తించదు. గ్రహకృత్యాలలో తప్ప ఇతర కార్యకలాపాలలో పాలుపంచుకునే స్వేచ్చ షరతులతో ఇస్లాంలో స్త్రీకి ఇవ్వబడింది. దీనిని రుజువుగా చూపడం జరుగుతుంది. ఇందుకోసం ముస్లిం స్త్రీలు కూడా పాశ్చాత్య స్త్రీల వలె గ్రహజీవితం, దాని బాధ్యతలకు తిలోదకాలిచ్చి, రాజకీయ, సామాజిక, ఆర్ధిక కార్యకలాపాలలో విచ్చలవిడిగా పాల్గొని ప్రతి కార్యరంగంలోనూ పురుషులతో సమానంగా కృషిచేయడం జరిగింది.
భారత్, పాకిస్తాన్ లలో అయితే వ్యవహారం ఇంతటితో సరిపెట్టుకోవడం జరిగింది. కాని ఇతర దేశాలలో రాజకీయ స్వేచ్చగల భావదాస్య బానిసలు అంతకంటే పది అడుగులు ముందుకు వేశారు. అక్కడ యూరోపియన్ స్త్రీ ల వస్త్రధారణనే ముస్లిం స్త్రీలు కూడా అవలంభిస్తారు. తద్వారా అసలు, నకిలీలలో తేడా ఉండకూడదని, ఖుర్ఆన్, సున్నత్ ల నుండి ఈ లజ్జా విహీన జీవితానికి ధర్మబద్ధతకుఏదయినా కోణం వేదుకబడుతుందా? మీరు ఈ మార్గం అనుసరించదలచినవారు సృష్టంగా, మేము ఇస్లాంపై, దాని చట్టాలపై తిరుగుబాటు చేస్తున్నాం అని ప్రకటించి అనుసరించాలి. ఏ సామాజిక వ్యవస్థను, ఏ జీవిత విధానాన్ని, దాని సిద్ధాంతాలు, క్రియాత్మక భాగాలలో ఒక్కొక్క దానీ ఖుర్ఆన్ హరాంగా నిర్ణయించిందో దానిని బహిరంగంగా అవలంభించటమా? ఇదెక్కడి కాపట్యం ? ఎటువంటి నమ్మకద్రోహం? పైగా ఈ మార్గంలో మొదటి అడుగు ఖుర్ఆన్ పేరునే చెప్పుకొని వేస్తున్నారా? అంటే మిగతా అడుగులు కూడా ఖుర్ఆన్ ప్రకారమే పడుతున్నాయని ప్రపంచం మోసంలో పడిపోవాలా? 

1 Response to "పరదా ముస్లిం స్త్రీ భూషణం "

  1. AnonymousOctober 29, 2016 at 6:38 PM

    'ప్రవక్త [స] భార్యలను మీరు ఏదయినా అడగవలసి ఉంటే తెరచాటున ఉండి అడగండి. ఇది మీ హృదయాల, వారి హృదయాల పరిశుద్ధత కొరకు ఎంతో సముచితమయిన పద్ధతి' [అహ్ జాబ్ సూరా33:53]

    ఇది మంచి విషయం. దీనికి సంబంధించిన ప్రశ్నని చాలామంది నన్నూ అడిగారు. అల్లా ఆదేశం కేవలం మహమద భార్యలను సామాన్యులు కలుసుకోవడానికి మాత్రమే వరిస్తుంది. అందువలననే వారు తమ గుమ్మాలకు పరదాలనుంచాదు. కొన్నివేలమంది ఆయన్ని, ఆయన భార్యలను కలుసుకోవడానికి వస్తున్నప్పుడు ఆ అటవీ కాలంలో ఆమాత్రం జాగ్రత్త అవసరం. నిజానికి ఆపద్దతి కూడా ప్రవక్త కాలంలలోనే కొన్నాళ్ళుండి కనుమరుగైంది. కానీ ఆ పద్దతిని మిగతావారు పాటించడం అల్లా అభిమతంకాదు. గమనింఛగలరు. నేడు ఇస్లాంపేరుతో ప్రపంచంలో జరుగుతున్నదంతా అల్లా అభీశ్టానికి విరుద్ధం.

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • 1.క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు:"యేసు ఎవరు?"
    "యేసు పట్ల గల "మీ విశ్వాసం" ఏమిటి? అని మిమ్మల్ని ప్రశ్నిస్తే... " యేసును నేను దేవుని "గా విశ్వసిస్తున్నాను...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • పుస్తక పఠనం వలన ప్రయోజనాలు ఎన్నో!
    ఒ కప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య,సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి.చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు జరిగేవి.క...
  • క్రైస్తవపండితుల అపార్థాలు-బైబిల్ గ్రంధ యధార్థాలు
    నేటి క్రైస్తవ ధర్మం అంతా కల్పిత బోధనలతో నిండిపోయింది.నేటి చర్చి పాదర్ల బోధనలకు,బైబిల్ ఉపదేశాలకు సారూప్యమే లేదు.మానవుడు ముక్తి పొందాలంటే కల్...
  • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం.
                                                                                                Next Page పై పుస్తకం త్వరలో విడుదల కానుం...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • వేద శాస్త్రాల ప్రకారం మాంసాహారం నిషిద్దమా?
     నేడు గోవధ నిషేదం ఒక రాజకీయ నినాధం తప్ప వేద నిషేధం కాదు.ఆనాడు ఆర్యులు కాని,వేద అనుచరులుగాని మాంసాహారులే.వారు చేసే యజ్ఞాలకు ఎన్నో అశ్వాలు,...
  • కొంతమంది ప్రముఖ బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల అపార్ధం!
    ఈమధ్యకాలంలో కొంతమంది బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల విపరీతమైన అపార్ధం చేసుకుని తమ,తమ బ్లాగులలో పరోక్షంగా పోస్టులు వ్రాయడం ప్రా...

Recent Comments

Blog Archive

  • ►  2024 (2)
    • ►  July (2)
  • ►  2021 (1)
    • ►  April (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ▼  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ▼  October (10)
      • భారత దేశంలో అణు ఇంధనం
      • ప్రకృతి ధర్మం | Sakshyam Magazine
      • యవ్వనం
      • సుఖ దు:ఖాలు
      • నౌకర్లు, సేవకుల హక్కులు
      • చెట్టే చిరునామా !
      • విశ్వాసుల తల్లి హజ్రత్ ఖదీజా
      • జీవిత చక్రం
      • పరదా ముస్లిం స్త్రీ భూషణం
      • హదీసు గ్రంధాలు
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative