• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » ARTICLES » యవ్వనం

యవ్వనం

Posted by Sakshyam Magazine on Saturday, October 22, 2016
Label: ARTICLES

సాధారణంగా మనిషి జీవితంలో మూడు దశలు ఉంటాయి. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం.
బాల్య దశ 
ప్రతి విషయంలో తల్లిదండ్రులపై ఆధారపడే, తల్లిదండ్రుల పర్యవేక్షణలో పెరిగే దశ. ఏది అర్ధం చేసుకోలేని మానసిక పరిపక్వత లేని దశ.

వృద్ధాప్య దశ
శరీరంలో శక్తి సత్తువ, జ్ఞాపకశక్తి వంటివి సన్నగిల్లిపోతాయి. మనిషి బలహీనుడైపోతాడు. ఈ దశలో కూడా మనిషి ఎవరో ఒకరిమీద ఆధారపడతాడు. అందుకే వృద్ధాప్యాన్ని మరో బాల్యం అంటారు.

యవ్వనం
ఇక యవ్వన దశ విషయానికి వస్తే మానసిక పరిపక్వతతో పాటు శక్తి సామర్ద్య౦, ఎక్కువ సమయం కష్టించి పనిచేసేతత్వం మొండుగా ఉంటాయి. ఇంకా ఈ దశలో పరిపరివిధాల ఆలోచనలు పుట్టుకొస్తాయి. ప్రపంచపు రంగురంగులు మనస్సును ఆకర్షిస్తాయి, అలరిస్తాయి, ఆదమరిపిస్తాయి.
యవ్వనం ఎంతో మధురమైనది, ఎంతో విలువైనది. కానీ, అంతకంటే ప్రమాదకరమైనది. నేటి యువత యువత జీవితలపై ఓసారి నిఘాసారీస్తే వాస్తవం ఇట్టే బోధపడుతుంది. ప్రాపంచిక విషపు కోరల్లో ఎంత లోతుల్లో కూరుకున్నారో, ఎటువంటి వాటికి బానిసలయ్యారో స్పష్టంగా అర్ధమవుతుంది. 
యవ్వనంలోనే మేలుకొని మసలుకుంటే భవిష్యత్తును అందంగా మలుచుకోవచ్చు. ఈ దశే భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఆదమరిచి పాశ్చాత్య పోకడలకు అలవాటుపడితే భవిష్యత్తు అంధకారమే. 
దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. యువతే దేశానికి వెన్నుముక. కాని నేడు యువత జీవితం గమ్యం తెలియని నావలా ఉంది. అంధకారపు అగాధపు లోతుల్లో కూరుకుపోయి ఉంది. వారిని పెడమార్గంలో పెట్టడానికి పాశ్చాత్య సంస్కృతి పోకడలు కంకణం కట్టుకున్నాయి. దీనికి ప్రభుత్వ స్వార్ధం తోడైంది. ఎక్కువ ఆదాయం పొందలనే ప్రభుత్వ పేరాశ వల్ల లెక్క లేనన్ని మద్యం దుకాణాలు ఉనికిలోకి వచ్చాయి. మొత్తం సమాజాన్ని మత్తులో ముంచి మృత్యువు ఒడికి చేర్చడానికి పోటీపడుతున్నాయి. అంతటితో సారి పెట్టుకుంటే సంతోషించేవారమే కానీ క్లబ్ లు, పబ్ లు నగరాలలో, పట్టణాలలో కోకొల్లలుగా పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దీనికితోడు మాదకద్రవ్యాలు. విచ్చలవిడి సరదాల్లో మాదకద్రవ్యాల బారినపడి కొట్టుమిట్టాడుతున్న కేసులు అనేకం. దీన్ని అదునుగా చేసుకుని డ్రగ్ మాఫియాలే నడుస్తున్నాయి. ఇటీవల హైదారాబాద్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్ రాకెట్ ఇందుకు ఉదాహరణ.

వీటన్నిటి బారిన పడేది నవ యవ్వనంలో ఉన్న యువతదే పైచేయి అనడంలో ఆశ్చర్యం లేదు. కొన్ని స్వచ్చంద సంస్థల సర్వే ల ప్రకారం పబ్ లలో దుమ్మురేగ్గోడుతున్న వాళ్లలో ౨౫ సంవత్సరాలలోపు వారు 80 శాతం, పద్దెనిమిది సంవత్సరాలలోపు 34 శాతం, అంటే 80 శాతం మంది యవ్వనం క్లబ్ లో, పబ్ లలోనే గడిచిపోతుంది. ఎన్నో సాధించే సామర్ధ్యం కలిగిన యవ్వనం మత్తుపదార్ధాల నిషలో, సిగరెట్ల పోగలతోనే గడిచిపోతుంది.

ఇక చట్టం విషయానికి వస్తే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండనివాళ్లకు మద్యం అమ్మితే పదివేల జరిమానా విధించబడుతుంది. పాతికేళ్లు నిండనిదే పబ్ కెళ్లే అర్హతలేదని చట్టం స్పష్టం చేసింది. కానీ విచారకర విషయం ఏమిటంటే, 80 శాతం మంది 25 సంవత్సరాలలో వారే పబ్ లలో దుమ్ము రెగ్గోడుతున్నారు. మరి ఈ చట్టలన్నీ ఏం చేస్తున్నట్లు అంటే పచ్చ నోట్ల మత్తులో నిద్రలోకి జరుకుంటున్నాయి. ఇంకా మన ప్రభుత్వాల చల్లని అభయహస్తం వాటి పై ఉన్నంత కాలం మద్యం దుకాణాలు, పబ్, క్లబ్ లు యువత జీవితలను అంధకారంలో నేడుతూ వారిని పెదమార్గం పట్టించడానికి ముడుపువ్వులు ఆరు కాయలు గా వర్ధిల్లుతూనే ఉంటాయి.దైవప్రవక్త [స] ఇలా ప్రవచించారు ''ప్రళయ దినంనాడు ఈ విషయాలను గురించి ప్రశ్నించకుండా దేవుని న్యాయస్థానం నుండి ఏ ఒక్కడూ అడుగు కూడా కదపలేడు.

1] తాను, తన వయస్సును ఏ ఏ కార్యాలలో మళ్లించాడు? 
2] [తనకు లభించిన] ధార్మిక జ్ఞానంపై ఎంతవరకు అనుసరించాడు?
3] ఏ ఏ మార్గాల్లో ద్వారా సంపాదించాడు?
4] దాన్ని ఏ ఏ మార్గాల్లో ఖర్చు పెట్టాడు?
5] తన శరీరాన్ని [యవనాన్ని] ఏయే కార్యకలాపాల్లో గడిపావు? [తిర్మజి]

దైవం తన న్యాయస్థానంలో ఈ ఐదు ప్రశ్నలను ప్రశ్నించకుండా ఏ ఒక్కడు ఒక్క అడుగు కూడా కదపలేడు. కానీ విచారకర విషయమేమిటంటే, నేడు మనిషి తన జీవతాన్ని నిర్లక్ష్యానికే గురిచేస్తున్నాడు. అక్రమ మార్గంలో సంపాదిస్తున్నాడు. అనైతిక మార్గంలో ఖర్చుపెడుతున్నాడు. అనైతిక కార్యక్రమాలలోనే తన యవ్వనాన్ని కృశింపజేస్తాడు. 

ఇప్పటికైనా మన యువత మేల్కోంటే తమ జీవితలను సంస్కరించుకుంటేఇటు సమాజ సంస్కరణ జరగడమేకాదు పరలోకంలో దేవుని సమక్షంలో ఉన్నతమైన స్థానం లభిస్తుంది. దైవప్రవక్త [స] ఇలా తెలిపారు.

''అల్లాహ్ ప్రళయం రోజున ఏడు రకాల మనుషుల్ని తన నీడన ఆశ్రయమిస్తాడు. ఆరోజున ఆయన నీడ తప్ప మరే నీడాకానరాదు. వారిలో...
1] న్యాయమూర్తి అయిన పాలకుడు
2] తన యవ్వనమంతా అల్లాహ్ ఆరాధనలో గడిపిన యువకడు
3] ఏకాంతంలో ఉన్నప్పుడు అల్లాహ్ గుర్తుకురాగానే అతని కాళ్ళ నుండి ఆశ్రువులూ జలజలా కరీనా వ్యక్తి. 
4] తన మస్సునంతా మసీద్ లోనే లగ్నం చేసినవాడు. 
5] దైవప్రసన్నత కోసమే పరస్పరం ఆత్మీయతను ఏర్పరచుకునే ఇద్దరు.
6] ఉన్నత కుటుంబానికి చెందిన ఓ అతి సౌందర్యవతి అయిన స్త్రీ కామవాంఛను తీర్చిమని అడిగితే నేను అల్లాహ్ కు భయపడుతున్నానని చెప్పి నిరాకరించేవాడు.
7] అల్లాహ్ మార్గంలో దానం చేసేటప్పుడు కుడిచేయి చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకుండా అతిగోప్యంగా చేసేవాడు. [బుఖారి,ముస్లిం]
పై రెండు హదీసుల అనుగుణంగా తమ జీవితల్ని మలచుకునే సద్భుద్దిని దైవం మనకి ప్రసాదించుగాక [ఆమీన్]      

0 Response to "యవ్వనం"

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • 1.క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు:"యేసు ఎవరు?"
    "యేసు పట్ల గల "మీ విశ్వాసం" ఏమిటి? అని మిమ్మల్ని ప్రశ్నిస్తే... " యేసును నేను దేవుని "గా విశ్వసిస్తున్నాను...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • పుస్తక పఠనం వలన ప్రయోజనాలు ఎన్నో!
    ఒ కప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య,సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి.చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు జరిగేవి.క...
  • క్రైస్తవపండితుల అపార్థాలు-బైబిల్ గ్రంధ యధార్థాలు
    నేటి క్రైస్తవ ధర్మం అంతా కల్పిత బోధనలతో నిండిపోయింది.నేటి చర్చి పాదర్ల బోధనలకు,బైబిల్ ఉపదేశాలకు సారూప్యమే లేదు.మానవుడు ముక్తి పొందాలంటే కల్...
  • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం.
                                                                                                Next Page పై పుస్తకం త్వరలో విడుదల కానుం...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • వేద శాస్త్రాల ప్రకారం మాంసాహారం నిషిద్దమా?
     నేడు గోవధ నిషేదం ఒక రాజకీయ నినాధం తప్ప వేద నిషేధం కాదు.ఆనాడు ఆర్యులు కాని,వేద అనుచరులుగాని మాంసాహారులే.వారు చేసే యజ్ఞాలకు ఎన్నో అశ్వాలు,...
  • కొంతమంది ప్రముఖ బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల అపార్ధం!
    ఈమధ్యకాలంలో కొంతమంది బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల విపరీతమైన అపార్ధం చేసుకుని తమ,తమ బ్లాగులలో పరోక్షంగా పోస్టులు వ్రాయడం ప్రా...

Recent Comments

Blog Archive

  • ►  2024 (2)
    • ►  July (2)
  • ►  2021 (1)
    • ►  April (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ▼  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ▼  October (10)
      • భారత దేశంలో అణు ఇంధనం
      • ప్రకృతి ధర్మం | Sakshyam Magazine
      • యవ్వనం
      • సుఖ దు:ఖాలు
      • నౌకర్లు, సేవకుల హక్కులు
      • చెట్టే చిరునామా !
      • విశ్వాసుల తల్లి హజ్రత్ ఖదీజా
      • జీవిత చక్రం
      • పరదా ముస్లిం స్త్రీ భూషణం
      • హదీసు గ్రంధాలు
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative