Posted by Sakshyam Magazine on Thursday, November 20, 2014
విద్యను అర్ధించేవాడే అవుతాడు "విద్యార్ధి"!
విద్యార్ధి తన జీవితంలో ఉండాలి సదా పరమార్ధి!!
విద్యార్ధి అనేవాడికి వయస్సుతో ఉండదు నిమిత్తం!
మంచిని ప్రసాదించే విషయాలే నేర్చుకోవాలి సమస్తం!!
విద్యజ్ఞానసముపార్జనకు ఓ రాజబాట వంటిది!
జ్ఞాని చెప్పే ప్రతిమాట రాజీమాటవంటిది!!
ఎంతపండితుడైనా విద్యార్ధిదశ ఇంకా మిగిలే ఉంటుంది!
జీవితాంతము చదివినా, చదవాలనే ఆశ ఇంకా ఉంటుంది!!
విద్యార్ధి తనజ్ఞాన సంపదను మేధస్సునిధిలో వేస్తుంటాడు!
పని పడ్డప్పుడు, సంబంధితజ్ఞానాన్ని విధిగా తీస్తుంటాడు!!
సంపదల్లోకెల్లా జ్ఞానసంపదే అతివిలువాతివిలువైనది!
జ్ఞానసంపదకలవాడీకి కీర్తి దక్కుతుంది బహువిలువైనది!
ప్రతి విద్యార్ధికి తప్పక ఉండాలి, ఆమోదయోగ్యమైన గమ్యం!
అది అనిపించాలి,చూపరులందరికి బహురమ్యం!!
యం.డి.జాన్ షరీఫ్
విశ్రాంత ఉపాధ్యాయుడు
కోదాడ.