Posted by Sakshyam Magazine on Sunday, November 23, 2014
దేవుడనే వానికి ఉండవలసిన మౌలిక లక్షణాలలో ఒక లక్షణం - సర్వజ్ఞత. అదిలేని వాడు ఏవిధంగానూ దేవుడు కాలేడు. అయితే యేసుకు సర్వజ్ఞత లేదా? అని ప్రశ్నిస్తే ఈ క్రింది బైబిల్ వాక్యాలు చెప్పేదేమిటో గమనించగలరు.
అయితే ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు
తండ్రి మాత్రమేగాని , యే మనుష్యుడైనను ,పరలోకమందలి
దూతలైనను కుమారుడైనను (తనైనను) ఎరుగరు. మత్తయి 24:36
మరునాడు వారు బేతనియనుండి వెళ్లుచుండగా ఆయన (యేసు)
ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరమునుండి చూచి,
దాని మీద ఏమైనను దొరకునేమో అని వచ్చెను.దాని యొద్దకు వచ్చి
చూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడలేదు.ఏలయనగా అది
అంజూరపు పండ్లకాలము కాదు. మార్కు 11:12-13
పై రెండు వాక్యాల ప్రకారమూ యేసుకు సర్వజ్ఞత (Omni Scient) అన్నది ఏమాత్రం లేదని తేటపడుతుంది.ఆ సామర్ధ్యం లేనప్పుడు యేసు దేవుడు ఎలా కాగలరు?