Posted by Sakshyam Magazine on Thursday, November 6, 2014
"శ్వాస" ఉంటేనే గదా ఉండేది "ఆశ"
"ఆశ" ఉంటేనే గదా! నీరసించేది "నిరాశ"!!
నిరాశ నిష్క్రమిస్తేనే గదా! ఆశపై పుట్టేది "భరోస"!!
భరోస ఉంటేనే గదా! జీవితంలో ఉండేది "కులాస"!!
"కులాస"గా ఉంటేనే గదా! దిలుగు దిగిపోయేది!
"దిగులు" దిగిపోతేనే గదా! దివ్యమైన జీవితం లభించేది!!
ఆ "దివ్యమైన జీవితానికి కావాలి.. సవ్యమైన జీవితం!
సవ్యమైన జీవితం గడితే, లభించేను "సత్ఫలితం"
ఆ సత్ఫలితానికి కావలసింది, కేవలం "ఏక దైవారాధన"!!
"ఏక దైవాన్ని" గుర్తించడానికి, చేయాలి నాలుగు గుణాలపై సాధన!!
ఆ "నాలుగు గుణాలు" తెలుసుకుంటే, లభించేను "అసలు దైవం"!
అది తెలుసుకుని ఆచరిస్తే, మన జీవితం "బహుధన్యం"!!
ధన్య జీవితం లభిస్తే, దొరికినట్టే "అమూల్య స్వర్గం"!
స్వర్గప్రాప్తి కంటె ఏముంటుంది, "గొప్ప విజయ దుర్గం"
ఆ నాలుగు గుణాలు ఇవి.
1.దేవుడు ఒక్కడని నమ్మడం. 2.దేవునికి ఎలాంటి అవసరాలు ఉండవని నమ్మడం.
3.దేవుడు ఎవరి సంతానం కాదని నమ్మడం. 4.దేవుడు నిరాకారుడని,బలహీనతలకు అతీతుడని నమ్మడం.
యం.డి.జాన్ షరీఫ్
విశ్రాంత ఉపాధ్యాయుడు